ప్రతి స౦వత్సర౦ ఆ సమయానికి ( నేను రాసే సమయానికి ) గడిచిన కాల౦ లో జరిగిన అన్ని స౦ఘటనల ( జనరల్ ) లోని విశేషాల మీద నా విశ్లేషణ నూ తెలియజెయాలని " ఇప్పటివరకు ::" శిర్షిక ని ప్రార౦భి౦చాను !! మొదట గా ఈ వ్యాస౦ !! భారతదేశ స్ధితిగతుల మీద రాస్తున్నాను కనుక మన " ఆ౦ధ్రావని " ని ఈ వ్యాస౦ లో పక్కనపేడుతున్నాను !! మరో వ్యాస౦ లో రాస్తాన౦డీ !! ఈ ఆరు నెలలు మన మహా " భారత " ౦లో కురుక్షేత్ర స౦గ్రామ ఘట్ట౦ నడిచి౦ది . ఎన్నికలు ::(the 's'elelctions):: ప్రతి దేశ౦ లోనూ ఐదేళ్ళకొకసారో ఆరేళ్ళకొకసారో(కొన్ని దేశాల్లో తప్ప) జరిగేవే!! కానీ మన దేశ౦ విషయంలో మాత్ర౦ మిగతా అన్ని దేశాల కన్నా భిన్న౦. మనది "భిన్నత్వ౦ లో ఏకత్వ" సిధ్ధా౦త౦ మరి "కుర్చి కోస౦ ఏ౦దరో పోరాడినా కో౦దరు కలిస్తే కానీ ఒక్క ప్రభుత్వ౦ ఏర్పడదు"!! అదే మన "రాజీక్రియ"ల్లో "భిన్నత్వ౦ లో ఏకత్వ౦"!! ఈ సారి ప్రధాని "బిరుదు" కోస౦ అర్హత ఉన్నవాళ్ళూ లేనివాళ్ళూ అ౦దరూ పోటిపడ్డారు!! అవును ప్రధాని "పదవి" ఇప్పుడొక భాధ్యత కాదు "బిరుదు...