Skip to main content

Posts

Showing posts from September, 2009

భారత్-పాకిస్తాన్ క్రికెట్ పోరు..........

దక్షిణ ఆఫ్రికా, సెంచూరియన్ మైదానంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ తన తోలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడుతోంది. పదహారు నెలల తరువాత దాయాదులు, చిరకాల ప్రత్యర్ధులు అయిన ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ సంగ్రామమిది. క్రికెట్ ప్రియులకు విందు భోజనం లాంటి ఈ సమరం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.

విజయవంతమైన ఓషన్ శాట్-2 ప్రయోగం..!!

భారతీయ సాంకేతిక విజ్ఞానం వేగంగా అభివృధి చెందుతోంది అనడానికి మరో ఊదాహారణ. చంద్రయాన్ తరువాత చేసిన ఈ ప్రయోగం సఫలం కావడం నిజంగా హర్షించదగ్గ విషయం. పూర్తి భారతీయ విజ్ఞానం తో రూపోందిన PSLV రాకెట్ లాంచర్లు పదిహేనోసారి తమ పనితనన్నాని నిరూపించుకున్నాయి. ఇస్రో సైంటిస్టులు అందరికీ అభినందనలు!!

పదివేలు పూర్తి...కాల్పనిక లోకం లో........!!

కాల్పనిక లోకం ఒకప్పుడు........Nareshkota's world not so fictional!! ఈ రోజు తో నాలుగంకెల నుంచి ఐదు అంకెలకు చేరుకుంది. తోలిసారి నాలుగంకెలు వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. మళ్లీ ఐదంకెలప్పుడు అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. ఇది మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యం అయ్యింది. బ్లాగుని సందర్శించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు!! వెన్ను తట్టి ప్రోత్సాహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు!!                                                                                 ఇలాగే ఇంకా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ఆడియో రివ్యు..!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ముందు మాట:: జోధా-అక్బర్ తరువాత అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా ఇది. తప్పకుండా మంచి రోమాంటిక్ కామెడి సినిమా అవుతుంది అని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య విశేషం ప్రియాంకా చోప్రా పన్నెండు(12) పాత్రల్లో నటించడం. కమల్ హాసన్ రికార్డుని బ్రేక్ చేసేసింది. మరి ఆ పన్నెండు పాత్రల్లో కేవలం కనబడిందో లేక నటించిందో ఈ నెల 25 కి విడుదలయ్యే సినిమాని చూస్తే తెలిసిపోతుంది. అశుతోష్ రెహమాన్ ని విడిచి ఈ సినిమాతో సోహైల్ సేన్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేసారు. అతను పాటలు ఎలా ఇచ్చాడో చూద్దాం.........ఆ..అన్నట్టూ ఇందులో పదమూడు(13) పాటలున్నాయి. రాశికో పాట. ఇంకో ఎక్సట్రా.............

గణేష్--జస్ట్ గణేష్ ఆడియో రివ్యూ........!!

గణేష్--జస్ట్ గణేష్ ముందు మాట:: ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రామ్ నటించిన కొత్త సినిమా గణేష్ పాటలు విడుదలయ్యాయి. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఎమ్.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెఢీ తరువాత రామ్ తో స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రమిది. మిక్కి జె.మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...... తనేమందో............ . రాసిన వారు:: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన వారు:: జావేద్ అలీ పాట టైటానిక్ సంగీతం బీట్ తో మొదలౌతుంది. వింటున్నంత సేపు ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది. ఇంకా హ్యాపీ డేస్ మత్తు వదలలేదు మిక్కి గారికి. జావేద్ అలీ గొంతులో తెలుగు అంతగా కూనీ కాకపోవడం కాస్త హర్షించదగ్గ విషయం. పాటకి తగినట్టుగా ఉంది అతని గానం. శాస్త్రి గారు ఎప్పుడూ రాసే భావాలే.......కొత్తదనం లేని పాట. లలల్లలయ్.......... రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి పాడిన వారు:: కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్ పాట పూర్తిగా ’ఒకే ఒక్కడు’ సినిమాలోని ’ఉట్టి మీద కూడు’ తరహాలో నడుస్తుంది. దరువు పాట ఒక్కటైనా ఉండాలని చేసినట్టు ఉన్నారు. రామజోగయ్య గారి లిరిక్స్ పాటకి తగినట్టు గానే ఉన్నాయి. పాడిన

జోష్ సినిమా రివ్యూ......

అక్కినేని వంశం నుంచి నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా జోష్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరి ఆశక్తిని చూరగొన్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడుల మనవడు, నాగార్జున తనయుడు, వెంకటేష్ మేనల్లుడు ఇలా చాలా పెద్ద కుటుంబ ఇమేజ్ ఉన్న హీరో మొదటి సినిమా అందులోనూ రెండేళ్లు నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ని సినీప్రియుల్ని ఊరించిన ఈ సినిమా అనుకున్నంత ఆశించినంత జోష్ ని ప్రదర్శించలేకపోయింది. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత నిర్మించిన ఈ చిత్రంలో రాజు గారి దగ్గర చాలాకాలం నుంచీ పనిచేస్తున్న వాసువర్మని దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమాతో. అతనిలో ఉన్న కఫ్యూజన్ సినిమా అంతా కనబడింది. సినిమాని హీరో కుటుంబ ఇమేజ్ కి తగినట్టు రూపోందించాలా లేక తన సినిమాగా గుర్తింపు తెచ్చుకోవాలా అనే విషయంలో అతను చాలా తికమక పడ్డాడు. హీరో పాత్ర చిత్రణలో ఇది స్పష్టంగా కనబడుతుంది. సహజంగా యక్టివ్ గా ఉండే వ్యక్తి అందులోనూ యంగ్ కాలేజ్ అబ్బాయి మరి అంత నిరసపడిపోయినట్టు చూపించటం అతని క్యారెక్టర్ కి కరెక్ట్ గా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రకంగా సినిమా మొదటినుంచి చివరివరకూ మరోరకంగా ఉండటం మార్పుని సూచి

కమినే చూడదగ్గ చిత్రమే.......!!

ఈ సినిమాని నేను రిలీజ్ అయిన రెండో రోజే చూసాను కానీ అప్పట్లో రాయలేదు. ఇప్పడు మళ్లీ చూసాను.......రాస్తున్నాను. సినిమాని మన పాప్యులర్ మసాలా సినిమాగా చూస్తే అస్సలు నచ్చదు. అవ్వటానికి మసాలా కధే అయినా ఈ సినిమాని తీసిన విధానం కొత్తగా ఉంటుంది. కాస్త అస్తవ్యస్తంగా కూడా ఉంటుంది. అర్ధం అవ్వడం కష్టం. కానీ అర్ధమయితే మజా వస్తుంది. ఇదో ఇద్దరు కవలల కధ. ఒకరు తప్పుడుదారిలోనైనా తన కలని నేరవేర్చుకుంటే మరొకరు ఊహించని మలుపు వల్ల కలని వదులుకుంటాడు. మనకి ప్రతిరోజూ జీవితంలో ఇలాంటి వారు కనబడుతూనే ఉంటారు. ఇద్దరికి మాటాలాడటంలో తడబాటు. ఒకరు ’క’ ని ’ఫా’ అని పలికితే ఇంకొకరికి నత్తి. ఒకరి మార్గం తప్పు మరొకరిది ఒప్పు. కధ చార్లీతో మొదలై అతను కల నేరవేర్చుకొవడంతో ముగుస్తుంది. తమ్ముడి పాత్ర మధ్యలో వచ్చి సమస్యలు సృష్టించినట్టు అనిపిస్తుంది. కానీ కధ ఇద్దరిది. ఇద్దరూ ముఖ్యులే. ఒక పాత్ర కధగానే చెప్పిన విధానం వల్లే చూసేవారికి తికమక కలుగుతుంది. ఎవరి వైపు నుంచి కధని అర్ధం చేసుకోవాలో తెలియదు. గందరగోళం నుంచి తెరుకుని కధని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టె సరికి సగం సినిమా అయిపోతుంది. విషాల్ భరద్వాజ్ ఇంతకు ముందు సినిమాల్లా ఇ

ఇంతకీ కాబోయే సి.ఎం. ఏవరూ??

వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల సంతాపం పూర్తి కాక మునుపే చాలామంది నోళ్లల్లో నానుతున్న మాట ఇది. రాష్ఠ్రం మొత్తం సంచలనం సృష్టించిన ఒక దుర్ఘటన ఈ చర్చకు తావునిస్తుందని ఎవరూహించగలరు? ఎంత లేదన్నా ఒక అగ్రనేత చనిపోయిన వేంటనే ఆయన మా దేవుడు ఆయన లేని లోకం, రాజ్యం కల్ల అని వాపోతూనే ఆ నాయకుడి వారసుడిగా ఆతని నిజజీవిత వారసుడిని ప్రకటించమని ప్రదర్శనలు జరపటం, బాహాటంగా మద్దతు తేలపని వారిని విమర్శించటం విడ్డూరం. బాధలో ఉన్నవారికి ఎవరు వస్తే ఎమిటీ? సరే మా నాయకుడి ఆశయాలు ఉన్నతమైనవి ఆయన బిడ్డ తప్ప మరేవ్వరూ వాటిని ముందుకు తీసుకువెళ్లలేరు అంటే....ఆయన ఆశయాలు అన్ని పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పరిచి ఉంటారు కదా.. మరి వచ్చే వ్యక్తి వాటిని పాటించరా? ఇంత జనాదరణ ఉన్న వ్యక్తి నడిపిన తీరును కాదనీ తమకు తోచిన విధంగా పరిపాలన చేసేంత వెర్రివారు ఉంటారా? ఎందుకు ఇంత భయం? సంతాపంలో కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏమిటీ? రాజకీయాలు స్వచ్చంగా నిర్వహించటం కష్టమే కానీ మరి ఇంత తొందరపాటుతనం ద్వారా సాధించగలిగింది లేదు. అనంత దుఃఖంలో ఉన్న వ్యక్తిని వేంటనే వచ్చి పగ్గాలు చేపట్టమంటే అది సాధ్యమేనా? ఎంతటి వ్యక్తికైనా సమయం పట్టదా? ఎందుకింత

నా కొత్త బ్లాగు.......

నా కొత్త బ్లాగు........ నేనో క్రికేట్ ప్రేమికుడిని........... పిచ్చి వాడిని.............ఇంకా ఎన్ని పేర్లు పెట్టగలిగితే అన్నీ............ అందుకే ఒక కొత్త బ్లాగు మొదలుపెట్టాను.. పేరు  CRICKET IN LIFE... పై మాటని క్లిక్ చేస్తే మికు ఆ బ్లాగు కనబడుతుంది.  చూడండి. బాగా నడిపేందుకు ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను. ఇదో సరికొత్త బ్లాగు కనుక అప్పుడే బోల్డన్ని పోస్టులు ఉండవు. మీ అభిప్రాయం అముల్యం!! తప్పక తేలియజేస్తారని ఆశిస్తున్నాను.............

కాల్పనిక లోకానికి తిరిగి స్వాగతం..........

స్వాగతం.........పునస్వాగతం...........రండి....రండి....దయచేయండి. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మృతి సందర్భంగా ఈ రెండు రోజులు సంతాపం తెలియజేశాము. అంధ్ర రాష్ట్రం లో నెలకొన్న విషాదచాయల నడుమ రాయలేకపోయాను. ఎవ్వరికీ మళ్లీ ఇటువంటి పరిస్ధితి ఎదురుకాకుడదు అని ఆశిస్తూ.............. ఇక మళ్లీ మొదలుపేడుతున్నాను. నిన్నటి వరకూ ఒక తరహలో సాగిన ఈ కాల్పనిక లోకం లో ఇవాళ్టి నుంచీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా ముస్తాబు చేసాను. అక్షరాలు పెద్దగా అర్ధమయ్యేలా ఉండాలి అని కాస్త ఫాంటు సైజు పెంచాను. తెలుగు లేబుళ్లు మాత్రమే కనబడతాయి. అవ్వండీ........మార్పులు.....ఇక నా పోస్టులు చదివి మీ అభిప్రాయాలు చేబుతారని/ చేప్పమని కోరుకుంటూ......... అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందో కూడా చేప్పండి...........చేబుతారు కదూ..!!

వై.యస్.అర్. మృతికి సంతాపం!!

నిన్నటి రచ్చబండ.......నేటి విషాదానికి కారణం అవ్వడం నిజంగా దురదృష్టం. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని బయలుదేరిన మన ముఖ్యమంత్రి..... ఈ రీతి తిరిగిరావాల్సిరావడం విచారకరం. జరగకూడనిది ఇలా జరగినది మింగుడు పడని నిజం. ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారి కుటుంబసభ్యులకు, అభిమానులుకు, ఆయన పాలన కోనసాగాలని కోరుకున్న వారికి ఇది తీరని లోటు. రాష్ట్రచరిత్రలో మరచిపోలేని ధుసంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.......... రాష్ట్రం లో ఈ రెండు రోజులూ సంతాప దినాలు.........అలాగే ఈ "కాల్పనిక లోకం" లో కూడా.............. . తిరిగిరాని లోకానికి చేరిన ఓ చిరంజీవీ.......... నికిదే మా జోహార్.............!!