కురుక్షేత్రం లో " భగవద్గీత " పార్దునికి " కర్తవ్యోపదేశ౦ "!! మనవజాతికి తిరుగులేని జ్ఞానోపదేశం !! మన ఎన్నికల కురుక్షేత్రం లో నేతల కుర్చీ " జిమ్మిక్కులు " ఆ౦ధ్ర కుర్చీ గీత ని భోధి౦చాయి !! రాబోయే తరాలకు ఎనలేని " రాజీక్రీడ " ల జ్ఞానోపదేశాలుగా మిగిలిపోయాయి !! ఇవి అచ్చతెలుగు గీతలు కనుక శ్లోకాల రూప౦లో కాక వచనాల రూప౦లో ఉ౦టాయి !! " నేతకు ర౦గులేదు !! అన్ని ర౦గులూ తనవే !! పనైపోయాక ఈ ర౦గును వదలి మరో ర౦గును ఆశ్రయిస్తాడు!!" "పార్టీ పదవులూ అశాశ్వత౦!! MLA టిక్కెట్టు మాత్రమే శాశ్వత౦!!" "టిక్కెట్టు వచ్చాక......ఓడేది నువ్వు కాదు!! గేలిచేదీ నువ్వు కాదు!! గేలిపి౦చేది ప్రజలు!! గేలిచేసేదీ ప్రజలు!!" "సమరానికి పనికిరాడన్న "నీ" వాడిని........... ... గేలిచాక అక్కునచేర్చుకో!!" "అధికార౦ నీదేనన్నప్పుడు లక్ష్యాలు ధిర్గకాలిక౦!! అధికారమే లేనపుడు లక్ష్యం ..... అధికార౦!!...