కొత్త సినిమాల మీద రివ్యూల కన్నా ఇలా చేబితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే నేను విన్న కొత్త సినిమాల పాటల విశేషాలు ఇవి............ జోష్............ త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు... డి..డిరిడి.. . పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది. బాడ్ బాడ్ బాయ్... . ఇందులో ఈలగానం మనని ఆకట్టుకుంటుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. రంజిత్ బాగా పాడాడు. నీతో ఉంటే నిన్నే పెళ్ళాడతాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు పాటని గుర్తుకుతెస్తున్నట్టు సాగుతుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. మంచి మెలోడి. కాలేజీ బుల్లోడా. . చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు. పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీ...
Comments
Post a Comment