Skip to main content

Posts

Showing posts with the label అంతరంగ తరంగాలు

నాన్న ... ఒక రోజు ...!!

బాధ కి రూపం ఉండదు నవ్వు కి అర్ధం ఉండదు ప్రేమ కి కొలత అక్కర్లేదు  బ్రహ్మాండం అంతా అరచేతిలో మోయక్కర్లేదు నువ్వు నువ్వు గా ఉండు చాలు  నీ లా నువ్వు నవ్వుకుంటూ  నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ  తడబడుతూ ... మళ్ళీ నిలబడుతూ  నేను లేను అని ఆగిపోకు నేను నేర్పింది మర్చిపోకు  నా పేరు నువ్వు నా రూపం నువ్వు నేనే నువ్వు ... నువ్వే నేను ... నాన్న అంటే ఇంతే కదా నాన్న ..? నువ్వుంటే ఇదే చెప్పేవాడివా..? నేనే ఊహించుకుని అనేసుకుంటున్నానా..? ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వాడివి కదా ... ఇప్పుడు అడుగుతున్నా చెప్పు ... పోనీ .. ఏంట్రా ఇది అని తిట్టు .. శూన్యం లోని నిశీధి అంతా  నన్ను అలుముకున్న రోజు  నాకు నేను తప్ప ఎవ్వరూ.. ధైర్యం చెప్పలేని రోజు నువ్వు రాకూడదు అనుకున్న రోజు నేను చూస్తున్న నిజం .. కల కాలేని రోజు ఎన్ని ఏళ్ళు గడిచినా బాధ పెంచే రోజు నిన్ను నాలోనే వెతుక్కునే రోజు జ్ఞాపకాల గునపం గుండె చీల్చే రోజు ముందుకు వెళ్లే అడుగు ఆగి వెనక్కి తగ్గే రోజు ఎదో శిక్ష ... పరీక్ష ... అనిపించే ప్రతిరోజు  నీ నవ్వు తప్ప ఏది గుర్తుకు రాని రోజు  నేను నా గమ్యం లో నిన్ను తలవని రోజు లేద...

నా దో లోకం .... Short Story

"అద్భుతం అనేది ఒక్కసారే జరగాలి మాటి మాటికి జరిహిత్ర అది అద్భుతం అనిపించుకుంటుందా?" అని అడిగిన ఆ అమాయకత్వం నా కింకా గుర్తే. తను ఒక రోజు నా తో మాట్లాడాలి నన్ను గట్టిగా హత్తుకుని ముద్దాడి ఎదో సాధించినట్టు ఎగరాలి ... ఒక రోజు కష్టపడి అలిసిపోయి నా వాడిలో సేద తీరాలి ... ఇంకొరోజు నాకే అమ్మ అయి లాలించి బుజ్జగించాలి ... ఇలా ఎన్నో కోరికలు ... అన్నిటికి నా అందాల రాకుమారి దగ్గర సమాధానం ఉండేది ... అది చాలు బాధ మరవడానికి ... ఆ నవ్వు చాలు మళ్ళీ మళ్ళీ ప్రేమ లో పడటానికి. అది తను నాకు ...            ****************** "ఈ ప్రయాణం ఇంత ఒంటరి గా చెయ్యకర్లేదు .. నేనుంటా నేస్తం లా ... ఎక్కడి దాకా?" అని ఒక అపరిచితుడు కానీ తెలిసిన వాడిలా కనిపిస్తున్న ఒక నడి వయస్సు అందగాడు చమత్కారం గా ఎక్కడో ఆలోచిస్తున్న సూర్య ప్రతాప్ ఎదురు సీట్ లో కూర్చున్నాడు. ఆ పిలుపు తో ఆలోచనల నుంచి బయటపడ్డ ప్రతాప్ ఆ మాటల కి అర్ధం ఏమిటి అన్నట్టు చూసాడు. అపరిచితుడు : "నా పేరు చెప్పినా గుర్తు పెట్టుకునే ఆలోచన కాదు నీది. కళ్ల కుళాయి ని కట్టేసి కాసేపు హృదయాన్ని మాటల తో తేలిక చెయ్యి. " ప్రతాప్: "తెలియని ...

ఆ క్షణం

పెళ్ళిచూపులప్పుడు, మన కొనచూపులు కలసిన................. ఆ తొలిక్షణం నువ్వు నాదానివైపోవాలనిపించిన........ఆ క్షణం అద్దం, నాలో నిన్నే చూపించి మురిపించిన.................ఆ క్షణం మదినది లో, పోంగే భావనలన్నీ అక్షరరూపంలో పోందుపర్చి నీకు చూపించిన....................ఆ క్షణం నిశ్చితార్ధం రోజు, ఉంగరాలు మారిన.................ఆ క్షణం నీ ముఖమంతా సిగ్గుపువ్వులు విరిసిన.........ఆ క్షణం నీ మెడలో తాళి కట్టిన.............ఆ క్షణం నీ చేతిని నా చేతిలో పెట్టిన...... ఆ క్షణం ఇక ఒకరికొకరం అనుకున్న.....ఆ క్షణం నాతో జీవితం గడపాలని నువ్వు ఇల్లు దాటిన............ఆ క్షణం తల్లిదండ్రులను వదలలేక నీ కంటిముత్యాలు రాలిన.......ఆ క్షణం నీతో నేను అబద్ధమాడిన............ఆ క్షణం నీ బుంగమూతి కోరికలన్నీ నేను తీర్చిన.........ఆ క్షణం నన్ను పూర్తిగా నీ వాడిని చేసుకున్న.............ఆ క్...

నన్ను క్షమించు కన్నా.....!!

లోకం నేర్పాల్సిన తండ్రిని నిన్ను చీకట్లో పెంచాను విధి నన్ను తయారుచేస్తే నేను నిన్ను తయారుచేయాలనుకున్నాను యాభై ఏళ్లకు నేను ఇంతవాడినైతే నువ్వు ఇరవైయ్యేళ్లకే నా అంతవాడివి కావాలనుకున్నాను !! నువ్వు నన్ను ప్రతి విషయంలో మించాలనుకున్నాను అందరు నన్ను నీ తండ్రీ అని గౌరవిస్తూంటే పోంగిపోదామనుకున్నాను కానీ ఇవాళ ఇంత జరిగాక నా తప్పు తేలుసుకున్నాను !! అవును!! విధితో నిన్ను ఆడనివ్వాలి, ఓడనివ్వాలి, పోరాడనివ్వాలి, గెలవనివ్వాలి, ఎదగనివ్వాలి!! అన్నీ నా కళ్లల్లోంచే చూడనివ్వాల్సింది కాదు!! అంతా నువ్వు ఎరిగినట్టే ఉంటుందని మభ్యపెట్టాల్సింది కాదు!! తప్పే..........నువ్వంటూ ఒకడివి ఎదగాలనీ నీకంటూ ఒక మనస్తత్వం ఉండాలనీ నీదంటూ ఒక పంధా ఎర్పర్చుకోవాలనీ నేర్పలేదు.............నాది నిజంగా తప్పే!! నా కఠినత్వం తప్పే నా స్వార్ధం తప్పే నా అమాయకత్వం తప్పే నీ ఆనందాన్ని హరించడం తప్పే ఆకాశహార్మ్యంలా ఎదిగిన నిన్ను చూడాలనుకున్నాను... కానీ.....ఇలా గోడ మీద చిన్న బొమ్మలా చూస్తూన్నాను!! నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాగా....... నీ రంపపుకోతని అర్ధం చేసుకున్నాగ...

అంతరంగ తరంగాలు

స్వాతంత్రదినొత్సవం సందర్భంగా నా అంతరంగం లో మెదిలిన కొన్ని ....... స్వేచ్ఛ , మనసుకు ఉత్తేజం !! ప్రకృతి ధర్మం !! ప్రగతికి మార్గం !! స్వేచ్ఛ , లేకుంటే అది దాస్యం !! ప్లీజ్ క్లిక్ read more!! స్వేచ్ఛ అంటే భాధ్యత!! స్వేచ్ఛ అంటే భధ్రత!! స్వేచ్ఛ అంటే సామాజిక ఆవశ్యకత!! స్వేచ్ఛ అంటే దేశొన్నతికి తోడ్పడే దక్షత!! భూతకాలం లో బ్రతికేవారికి చేసినవాటి గురించి ఆలోచన భవిష్యత్తు లో బ్రతికేవారికి చేయబొయేవాటి గురించి ఆలోచన వర్తమానం లో బ్రతుకుతున్నవారికి చేస్తున్నవాటి గురించి ఆలోచన వెరసి ఏనాడు లేదు మనసుకి ఆలోచన నుండి స్వేచ్ఛ!! మనిషీ, నీ చుట్టూ గీసుకొకు వృత్తం!! స్వేచ్ఛావాయువు, పీల్చు ప్రతినిత్యం!! స్వాతంత్ర నమరయోధులారా , మీ, ధీక్షకు వందనం ...