Skip to main content

Posts

Showing posts with the label తెలుగు వ్యాసాలు

నా దో లోకం .... Short Story

"అద్భుతం అనేది ఒక్కసారే జరగాలి మాటి మాటికి జరిహిత్ర అది అద్భుతం అనిపించుకుంటుందా?" అని అడిగిన ఆ అమాయకత్వం నా కింకా గుర్తే. తను ఒక రోజు నా తో మాట్లాడాలి నన్ను గట్టిగా హత్తుకుని ముద్దాడి ఎదో సాధించినట్టు ఎగరాలి ... ఒక రోజు కష్టపడి అలిసిపోయి నా వాడిలో సేద తీరాలి ... ఇంకొరోజు నాకే అమ్మ అయి లాలించి బుజ్జగించాలి ... ఇలా ఎన్నో కోరికలు ... అన్నిటికి నా అందాల రాకుమారి దగ్గర సమాధానం ఉండేది ... అది చాలు బాధ మరవడానికి ... ఆ నవ్వు చాలు మళ్ళీ మళ్ళీ ప్రేమ లో పడటానికి. అది తను నాకు ...            ****************** "ఈ ప్రయాణం ఇంత ఒంటరి గా చెయ్యకర్లేదు .. నేనుంటా నేస్తం లా ... ఎక్కడి దాకా?" అని ఒక అపరిచితుడు కానీ తెలిసిన వాడిలా కనిపిస్తున్న ఒక నడి వయస్సు అందగాడు చమత్కారం గా ఎక్కడో ఆలోచిస్తున్న సూర్య ప్రతాప్ ఎదురు సీట్ లో కూర్చున్నాడు. ఆ పిలుపు తో ఆలోచనల నుంచి బయటపడ్డ ప్రతాప్ ఆ మాటల కి అర్ధం ఏమిటి అన్నట్టు చూసాడు. అపరిచితుడు : "నా పేరు చెప్పినా గుర్తు పెట్టుకునే ఆలోచన కాదు నీది. కళ్ల కుళాయి ని కట్టేసి కాసేపు హృదయాన్ని మాటల తో తేలిక చెయ్యి. " ప్రతాప్: "తెలియని ...

భారత్-పాకిస్తాన్ క్రికెట్ పోరు..........

దక్షిణ ఆఫ్రికా, సెంచూరియన్ మైదానంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ తన తోలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడుతోంది. పదహారు నెలల తరువాత దాయాదులు, చిరకాల ప్రత్యర్ధులు అయిన ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ సంగ్రామమిది. క్రికెట్ ప్రియులకు విందు భోజనం లాంటి ఈ సమరం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.

విజయవంతమైన ఓషన్ శాట్-2 ప్రయోగం..!!

భారతీయ సాంకేతిక విజ్ఞానం వేగంగా అభివృధి చెందుతోంది అనడానికి మరో ఊదాహారణ. చంద్రయాన్ తరువాత చేసిన ఈ ప్రయోగం సఫలం కావడం నిజంగా హర్షించదగ్గ విషయం. పూర్తి భారతీయ విజ్ఞానం తో రూపోందిన PSLV రాకెట్ లాంచర్లు పదిహేనోసారి తమ పనితనన్నాని నిరూపించుకున్నాయి. ఇస్రో సైంటిస్టులు అందరికీ అభినందనలు!!

పదివేలు పూర్తి...కాల్పనిక లోకం లో........!!

కాల్పనిక లోకం ఒకప్పుడు........Nareshkota's world not so fictional!! ఈ రోజు తో నాలుగంకెల నుంచి ఐదు అంకెలకు చేరుకుంది. తోలిసారి నాలుగంకెలు వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. మళ్లీ ఐదంకెలప్పుడు అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. ఇది మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యం అయ్యింది. బ్లాగుని సందర్శించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు!! వెన్ను తట్టి ప్రోత్సాహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు!!                                                                                 ఇలాగే ఇంకా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ఆడియో రివ్యు..!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ముందు మాట:: జోధా-అక్బర్ తరువాత అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా ఇది. తప్పకుండా మంచి రోమాంటిక్ కామెడి సినిమా అవుతుంది అని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య విశేషం ప్రియాంకా చోప్రా పన్నెండు(12) పాత్రల్లో నటించడం. కమల్ హాసన్ రికార్డుని బ్రేక్ చేసేసింది. మరి ఆ పన్నెండు పాత్రల్లో కేవలం కనబడిందో లేక నటించిందో ఈ నెల 25 కి విడుదలయ్యే సినిమాని చూస్తే తెలిసిపోతుంది. అశుతోష్ రెహమాన్ ని విడిచి ఈ సినిమాతో సోహైల్ సేన్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేసారు. అతను పాటలు ఎలా ఇచ్చాడో చూద్దాం.........ఆ..అన్నట్టూ ఇందులో పదమూడు(13) పాటలున్నాయి. రాశికో పాట. ఇంకో ఎక్సట్రా.............

గణేష్--జస్ట్ గణేష్ ఆడియో రివ్యూ........!!

గణేష్--జస్ట్ గణేష్ ముందు మాట:: ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రామ్ నటించిన కొత్త సినిమా గణేష్ పాటలు విడుదలయ్యాయి. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఎమ్.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెఢీ తరువాత రామ్ తో స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రమిది. మిక్కి జె.మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...... తనేమందో............ . రాసిన వారు:: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన వారు:: జావేద్ అలీ పాట టైటానిక్ సంగీతం బీట్ తో మొదలౌతుంది. వింటున్నంత సేపు ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది. ఇంకా హ్యాపీ డేస్ మత్తు వదలలేదు మిక్కి గారికి. జావేద్ అలీ గొంతులో తెలుగు అంతగా కూనీ కాకపోవడం కాస్త హర్షించదగ్గ విషయం. పాటకి తగినట్టుగా ఉంది అతని గానం. శాస్త్రి గారు ఎప్పుడూ రాసే భావాలే.......కొత్తదనం లేని పాట. లలల్లలయ్.......... రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి పాడిన వారు:: కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్ పాట పూర్తిగా ’ఒకే ఒక్కడు’ సినిమాలోని ’ఉట్టి మీద కూడు’ తరహాలో నడుస్తుంది. దరువు పాట ఒక్కటైనా ఉండాలని చేసినట్టు ఉన్నారు. రామజోగయ్య గారి లిరిక్స్ పాటకి తగినట్టు గానే ఉన్నాయి. పాడిన...

ఇంతకీ కాబోయే సి.ఎం. ఏవరూ??

వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల సంతాపం పూర్తి కాక మునుపే చాలామంది నోళ్లల్లో నానుతున్న మాట ఇది. రాష్ఠ్రం మొత్తం సంచలనం సృష్టించిన ఒక దుర్ఘటన ఈ చర్చకు తావునిస్తుందని ఎవరూహించగలరు? ఎంత లేదన్నా ఒక అగ్రనేత చనిపోయిన వేంటనే ఆయన మా దేవుడు ఆయన లేని లోకం, రాజ్యం కల్ల అని వాపోతూనే ఆ నాయకుడి వారసుడిగా ఆతని నిజజీవిత వారసుడిని ప్రకటించమని ప్రదర్శనలు జరపటం, బాహాటంగా మద్దతు తేలపని వారిని విమర్శించటం విడ్డూరం. బాధలో ఉన్నవారికి ఎవరు వస్తే ఎమిటీ? సరే మా నాయకుడి ఆశయాలు ఉన్నతమైనవి ఆయన బిడ్డ తప్ప మరేవ్వరూ వాటిని ముందుకు తీసుకువెళ్లలేరు అంటే....ఆయన ఆశయాలు అన్ని పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పరిచి ఉంటారు కదా.. మరి వచ్చే వ్యక్తి వాటిని పాటించరా? ఇంత జనాదరణ ఉన్న వ్యక్తి నడిపిన తీరును కాదనీ తమకు తోచిన విధంగా పరిపాలన చేసేంత వెర్రివారు ఉంటారా? ఎందుకు ఇంత భయం? సంతాపంలో కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏమిటీ? రాజకీయాలు స్వచ్చంగా నిర్వహించటం కష్టమే కానీ మరి ఇంత తొందరపాటుతనం ద్వారా సాధించగలిగింది లేదు. అనంత దుఃఖంలో ఉన్న వ్యక్తిని వేంటనే వచ్చి పగ్గాలు చేపట్టమంటే అది సాధ్యమేనా? ఎంతటి వ్యక్తికైనా సమయం పట్టదా? ఎందుకింత...

నా కొత్త బ్లాగు.......

నా కొత్త బ్లాగు........ నేనో క్రికేట్ ప్రేమికుడిని........... పిచ్చి వాడిని.............ఇంకా ఎన్ని పేర్లు పెట్టగలిగితే అన్నీ............ అందుకే ఒక కొత్త బ్లాగు మొదలుపెట్టాను.. పేరు  CRICKET IN LIFE... పై మాటని క్లిక్ చేస్తే మికు ఆ బ్లాగు కనబడుతుంది.  చూడండి. బాగా నడిపేందుకు ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను. ఇదో సరికొత్త బ్లాగు కనుక అప్పుడే బోల్డన్ని పోస్టులు ఉండవు. మీ అభిప్రాయం అముల్యం!! తప్పక తేలియజేస్తారని ఆశిస్తున్నాను.............

కాల్పనిక లోకానికి తిరిగి స్వాగతం..........

స్వాగతం.........పునస్వాగతం...........రండి....రండి....దయచేయండి. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మృతి సందర్భంగా ఈ రెండు రోజులు సంతాపం తెలియజేశాము. అంధ్ర రాష్ట్రం లో నెలకొన్న విషాదచాయల నడుమ రాయలేకపోయాను. ఎవ్వరికీ మళ్లీ ఇటువంటి పరిస్ధితి ఎదురుకాకుడదు అని ఆశిస్తూ.............. ఇక మళ్లీ మొదలుపేడుతున్నాను. నిన్నటి వరకూ ఒక తరహలో సాగిన ఈ కాల్పనిక లోకం లో ఇవాళ్టి నుంచీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా ముస్తాబు చేసాను. అక్షరాలు పెద్దగా అర్ధమయ్యేలా ఉండాలి అని కాస్త ఫాంటు సైజు పెంచాను. తెలుగు లేబుళ్లు మాత్రమే కనబడతాయి. అవ్వండీ........మార్పులు.....ఇక నా పోస్టులు చదివి మీ అభిప్రాయాలు చేబుతారని/ చేప్పమని కోరుకుంటూ......... అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందో కూడా చేప్పండి...........చేబుతారు కదూ..!!

వై.యస్.అర్. మృతికి సంతాపం!!

నిన్నటి రచ్చబండ.......నేటి విషాదానికి కారణం అవ్వడం నిజంగా దురదృష్టం. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని బయలుదేరిన మన ముఖ్యమంత్రి..... ఈ రీతి తిరిగిరావాల్సిరావడం విచారకరం. జరగకూడనిది ఇలా జరగినది మింగుడు పడని నిజం. ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారి కుటుంబసభ్యులకు, అభిమానులుకు, ఆయన పాలన కోనసాగాలని కోరుకున్న వారికి ఇది తీరని లోటు. రాష్ట్రచరిత్రలో మరచిపోలేని ధుసంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.......... రాష్ట్రం లో ఈ రెండు రోజులూ సంతాప దినాలు.........అలాగే ఈ "కాల్పనిక లోకం" లో కూడా.............. . తిరిగిరాని లోకానికి చేరిన ఓ చిరంజీవీ.......... నికిదే మా జోహార్.............!!

వినదగ్గ కొత్త తెలుగు సినిమా పాటలు.....!!

కొత్త సినిమాల మీద రివ్యూల కన్నా ఇలా చేబితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే నేను విన్న కొత్త సినిమాల పాటల విశేషాలు ఇవి............ జోష్............  త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు... డి..డిరిడి.. . పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది. బాడ్ బాడ్ బాయ్... . ఇందులో ఈలగానం మనని ఆకట్టుకుంటుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. రంజిత్ బాగా పాడాడు. నీతో ఉంటే నిన్నే పెళ్ళాడతాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు పాటని గుర్తుకుతెస్తున్నట్టు సాగుతుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. మంచి మెలోడి. కాలేజీ బుల్లోడా. . చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు. పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీ...

ఆ క్షణం

పెళ్ళిచూపులప్పుడు, మన కొనచూపులు కలసిన................. ఆ తొలిక్షణం నువ్వు నాదానివైపోవాలనిపించిన........ఆ క్షణం అద్దం, నాలో నిన్నే చూపించి మురిపించిన.................ఆ క్షణం మదినది లో, పోంగే భావనలన్నీ అక్షరరూపంలో పోందుపర్చి నీకు చూపించిన....................ఆ క్షణం నిశ్చితార్ధం రోజు, ఉంగరాలు మారిన.................ఆ క్షణం నీ ముఖమంతా సిగ్గుపువ్వులు విరిసిన.........ఆ క్షణం నీ మెడలో తాళి కట్టిన.............ఆ క్షణం నీ చేతిని నా చేతిలో పెట్టిన...... ఆ క్షణం ఇక ఒకరికొకరం అనుకున్న.....ఆ క్షణం నాతో జీవితం గడపాలని నువ్వు ఇల్లు దాటిన............ఆ క్షణం తల్లిదండ్రులను వదలలేక నీ కంటిముత్యాలు రాలిన.......ఆ క్షణం నీతో నేను అబద్ధమాడిన............ఆ క్షణం నీ బుంగమూతి కోరికలన్నీ నేను తీర్చిన.........ఆ క్షణం నన్ను పూర్తిగా నీ వాడిని చేసుకున్న.............ఆ క్...

సినిమాలోకం::సినిమాలు - నవరసాలు!! (రెండోవ భాగం)

మొదటి భాగం ౪ . అద్భుత రసం :: ఆశ్చర్యచకితుల్ని చేయడం!! అద్భుత రసం అంటే కేవలం ఒక మాయాజాలం ప్రదర్శించటం కాదు!! ఒక పి.సి.సర్కార్ షో లాగా నిజమా? మాయా? అనిపించే విధంగా ఉండనవసరం లేదు.. జనం లో అద్భుతమనే భావనని మిగల్చగలిగితే చాలు. ప్రకృతిని అందంగా కెమెరా లో బంధించటం దగ్గర నుంచీ మనసుని తాకే గ్రాఫిక్ వరకూ అంతా అద్భుతమే!! మన సినిమాల్లో ముందు నుంచీ ఈ రసాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు....ఒక్క సినిమాలో అని కాదు అన్ని సినిమాల్లోనూ అంతే.........కధనంలో రావల్సిన అన్ని మలుపులూ అయిపోయి ఇక చివరి ఘట్టం మొదలౌతుంది. విలన్ ఎవరూ ఛేదించలేనంత ప్యూహాన్ని పన్నుతాడు......హీరో రెండు మైళ్ల దూరం నుంచీ పరిగెత్తుకు వచ్చి సమయం మించనివ్వకుండా ఛేదిస్తాడు ........ డూపుల సహాయంతో ...ఈ మధ్య వైర్ల సహాయంతో....!! మనకి అద్భుతమైన సినిమాని చూసాం అనే నిజమైన ఆనందాన్ని, తృప్తిని మిగిల్చేవి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు. మాయాబజార్ లో అంతా మాయే ..... కృష్ణ మాయ, పింగళి కలం మాయ, కె.వి.రెడ్డి దర్శకత్వ మాయ, మార్కస్ బారట్లే కెమెరా మాయ, అన్నింటికీ మించి నటీనటుల మాయ, ఘటోత్కచ మాయ అబ్బ...అంతా వివాహ భోజనమ్మే కదండి!! పాతాళభైరవి లో నేపాళమాంత్రికుడో అద్భ...

నన్ను క్షమించు కన్నా.....!!

లోకం నేర్పాల్సిన తండ్రిని నిన్ను చీకట్లో పెంచాను విధి నన్ను తయారుచేస్తే నేను నిన్ను తయారుచేయాలనుకున్నాను యాభై ఏళ్లకు నేను ఇంతవాడినైతే నువ్వు ఇరవైయ్యేళ్లకే నా అంతవాడివి కావాలనుకున్నాను !! నువ్వు నన్ను ప్రతి విషయంలో మించాలనుకున్నాను అందరు నన్ను నీ తండ్రీ అని గౌరవిస్తూంటే పోంగిపోదామనుకున్నాను కానీ ఇవాళ ఇంత జరిగాక నా తప్పు తేలుసుకున్నాను !! అవును!! విధితో నిన్ను ఆడనివ్వాలి, ఓడనివ్వాలి, పోరాడనివ్వాలి, గెలవనివ్వాలి, ఎదగనివ్వాలి!! అన్నీ నా కళ్లల్లోంచే చూడనివ్వాల్సింది కాదు!! అంతా నువ్వు ఎరిగినట్టే ఉంటుందని మభ్యపెట్టాల్సింది కాదు!! తప్పే..........నువ్వంటూ ఒకడివి ఎదగాలనీ నీకంటూ ఒక మనస్తత్వం ఉండాలనీ నీదంటూ ఒక పంధా ఎర్పర్చుకోవాలనీ నేర్పలేదు.............నాది నిజంగా తప్పే!! నా కఠినత్వం తప్పే నా స్వార్ధం తప్పే నా అమాయకత్వం తప్పే నీ ఆనందాన్ని హరించడం తప్పే ఆకాశహార్మ్యంలా ఎదిగిన నిన్ను చూడాలనుకున్నాను... కానీ.....ఇలా గోడ మీద చిన్న బొమ్మలా చూస్తూన్నాను!! నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాగా....... నీ రంపపుకోతని అర్ధం చేసుకున్నాగ...

వినాయక ప్రసాదంబు.....

వినాయక ప్రసాదంబు....... కుడుమే శ్రేష్ఠంబు.. చవితి నాటి విందు........ఓహ్హొహ్హొ..మనకే పసందు!!

గోవిందం స్వ’గతం’:: ఇదే ఆఖరు

అవును...!! ఇదే ఆఖరుసారి నేను ఈ కాల్పనిక లోకానికి రావడం.....ఈ న....నరేష్ కోట బ్లాగు కి ఇక రాను!! బాబూ నరేషు ఇక నీ తలపులకూ, కల్పనలకూ గుడ్ బై, ఇంక సేలవు...!! నువ్వు నా క్యారెక్టర్ ని నడుపుతున్న తీరుకి నా మీద నాకే ఆసహ్యం వేస్తోంది. నేను కట్నం తీసుకున్నానా? అందుకు శిక్షగా నా భార్య నన్ను చులకనగా చూస్తుందా?? ఏ కాలం లో ఉన్నావ్ బాబూ?? సరే.....అది పక్కన పేడదాం.......నాకు వచ్చేవి పాస్ మార్కులా? నేను.. గోవిందం ది గ్రేట్ ని పది.....రెండుసార్లు, ఇంటర్.....నాలుగుసార్లు, డిగ్రీ.......ఐదో ఏడాది చదివానా? నాకు చదువబ్బడం లేదని మా పెద్దలు పేళ్లి చేసేసారా? ఆఖరికి నా భార్య కూడా నా అంతే చదువుతుందా? ఇట్లాగే ఉరుకుంటే మా పిల్లలు మా కంటే వెధవలు అనేలా ఉన్నావే...! అసలు నీకో క్యారెక్టర్ క్రియేట్ చేయ్యడం వచ్చా? గోవిందం...ది సంఘసంస్కర్త, గోవిందం....ది రాజకీయ నాయకుడు, గోవిందం.....ది సైనికుడు..లాంటి వేవీ దొరకలేదా? పోనీ గోవిందం...ది సాఫ్టవేర్ ఇంజినీర్ అనన్నా అందాం అనిపించలేదా? నరేష్ కోట :: ఏందుకు అనాలి?? నువ్వు నేను సృష్టించిన పాత్రవి. నా ఇష్టం నాకు తోచినట్టు రాస్తాను. నువ్వేరివి అడగడానికి? నీ పాత్రని, నేను నాకు నచ...

సినిమాలోకం:: సినిమాలు - నవరసాలు!!

మన కళలల్లో రాసప్రాధాన్యత అమోఘం!! చూసేవారిలో రసానుభూతిని కలిగించడమే ముఖ్యం!! అసలు రసమంటే ఇంగ్లీషు లో expression!! తెలుగు లో భావోద్వేగ స్పందన!! ఒక దృశ్యాన్నో, సంఘటన్నో, చూసినవేంటనే మనలో కలిగే భావోద్వేగ స్పందన!! మన చుట్టూ జరుగుతున్నవిషయాలు, మనమున్న పరిస్ధితులే ఈ స్పందనకు కారణం!! సినిమాల్లో నటులు తాము స్పందిస్తూ, చూసేవారిలో స్పందన తీసుకురావాలి!! క్లుప్తంగా "రసపోషణే నటన"!! కేవలం రసపోషణ జరిగితే చాలా?? చాలదు!! సినిమాలు చూసే జనం కోసమే కదా!! మరి ఏదో నటుడు నటించేస్తే సరిపోతుందా?!! సరిపోదు!! ఆ నటుడు ఏం చేసాడో జనానికి ఎక్కాలి, అతను చేసిందానికి తనకు తేలీకుండానే స్పందించాలి!! అది యిల రూపంలో కావచ్చు లేదా తనలో తనే ఆనందించోచ్చు, బాధపడోచ్చు!! ఏమైనా కధలో లీనమైపోవాలి, నటుడుని ఇష్టపడాలి, తిట్టుకోవాలి, అతడు పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకోవాలి!! అదే రసానుభూతి!! అందుకే నవరసాలు!! అభినయం కలగలిసిన కళ నాట్యం.. నాట్యంలోంచి వచ్చినవే నవరసాలు!! ఎన్ని ముద్రలు ఉన్నా ముఖంతో అబినయించేటప్పుడు నవరసాల్ని పోషించటం అవసరం!! అదే నటనగా నాటకాల్లోకి ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించాయి!! ఇక ఆ తొమ్మిది రసాలు ఏమిటీ?? మన ...

సినిమాలోకం:: సినిమా అంటే.....మూడొ(ఆఖరి) భాగం!!

[రెండొవ భాగం] సినిమా అంటే కళాత్మక వ్యాపారం :: ఎదైనా వ్యాపారం అవ్వాలంటే అది జనానికి అవసరమో లేక జనామోదమో పోంది ఉండాలి!! కళకి వ్యాపారానికి సంబంధం ఒక్కపటిది అని చెప్పలేనిది!! కళ ఎంత జనామోదం పోందితే అంత వ్యాపారమైంది!! అసలు వ్యాపారం కానివేవైనా మన జీవితాల్లో ఉన్నాయా.......సబ్బులు దగ్గర నుంచీ తిండి దాకా అంతా వ్యాపారమే కదా..(ప్రేమ తప్ప....అవి కూడా ఒక్కోసారి) ఆ బాటలోనే విద్య, కళ రెండూ వ్యాపారాలైయ్యాయి!! చిన్న పిట్ట కధ ::( సంబంధం ఉన్నదే ....) ఒక గుంపు...(ఏ కాలం నాటిదని అడగకండి.......మీ ఊహా.) ......నడుచుకుంటూ వెళుతున్నారు!! వారు ఎంతసేపటి నుంచీ నడుస్తున్నారో చెప్పలేను కానీ బాగా అలసిపోయి ఉన్నారు!! చెట్టు చూసుకుని కునుకు తీసారు!! నిద్ర తీరాక వారందరికీ ఆకలి మొదలైయింది! మంచివాడోకడు వేట పట్టుకొచ్చాడు!! వాడు తెచ్చిందాన్ని అందరూ పంచుకోవాలనుకున్నారు!! అంతా తనే తినలేడు కనుక అతనూ ఒప్పుకున్నాడు!! ఒక్కొక్కరూ ఒక్కొ పనికి పునుకున్నారు!! ఒకడు వంటచెరకు తెచ్చాడు!! ఇంకొకడు వంటచేసాడు!! మరోకడు అందరికీ సమానంగా పంచటం అదే వడ్డించాడు!! ఒకడు ఆకులు కుట్టాడు!! అందరిలోకీ బలంగా ఉన్నవాడు మరే గోడవ రాకుండా అలాగే బయట...

సినిమాలోకం:: సినిమా అంటే.....(రెండొవ భాగం)

" ప్రత్యేకంగా రచన చేసి , పాత్రాధారులతో నటింపజేసి , చిత్రికరించబడేదే సినిమా / చలనచిత్రం " [మొదటి భాగం] పాట ముఖ్యమా ?? సినిమా కొంతమందికి జీవనాధారం!! మరికొంతమందికి వినొద సాధనం!! ఇవాళ మన సమాజం లో సినిమాకు ఉన్న ఆరాధనను చూసి చాలామంది నటులు కావాలనీ, రచయితలు కావాలనీ, దర్శకులు కావాలనీ తిరుగుతున్నారు!! ఎంతోమంది మిగిలిన అత్యవసరపనులు చేస్తూ గడుపుతున్నారు!! ఇదేమీ ఇవాళ కొత్తగా ఉన్న పరిణామం కాదు!! ఏనాటి సమాజానికి ఆనాటి అత్యుత్తమ వినొదసాధనం లో భాగం కావాలనీ, దాన్ని జీవనాధారం చేసుకోవాలనీ చాలామంది ప్రయత్నించారు!! ప్రయత్నిస్తూనే ఉన్నారు!! మన సమాజంలో వినొదానికి ముఖ్యం పాట!! ఒక పాట మనిషిని కదిలిస్తుంది, మదిని మెలుకోల్పుతుంది............విన్నవారితో విహరించి ప్రాచుర్యం పోందుతుంది!! ఏటువంటి మనిషైయినా పాట వింటాడు!! ఎదో ఒకరకం గా అనుభవిస్తాడు!! అనుభవంలోంచి అభినయం పుట్టింది!! అభినయం పాటలోని మాటకనుగుణంగా మారి భావంతో నాట్యం అయ్యింది!! నాట్యం నుంచీ నటన, అందులోంచి అనుకరణ అన్నీ మొదలయ్యాయి!! కాబట్టి పాటలేకుండా మనం మన ప్రసిధ్ధ కళారుపాల్ని ఉహించుకోలేము!! విదేశంలో నాటకం ఎలా పుట్టిందో కానీ మనదగ్గర మాత్రం పాటల...

గోవిందం స్వ’గతం’:: చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం (రెండొవ భాగం)!!

మొదటి భాగం స్కూలు రోజుల్లో అంతా భారీతనమే!! అసలు ఆ గ్రౌండ్ అది తెలుచుకుంటుంటే ఒళ్ళు గగురుపోడుస్తుంది!! అప్పటి తో పోల్చుకుంటే కనీసం స్విమింగ్ పూలు అంత కూడా ఉండనీ కాలేజిల్లో ఇంటర్, డిగ్రీ చదివాను!! ఆ గ్రౌండ్ లో సిక్స్ కొట్టాలంటే కష్టమైపోయేది!! సచిన్, ధోని లకి ఈజి నేమో!! గ్రౌండ్ మధ్యలో జెండా ఎగురుతుంటే ఒక కార్నర్ లో కూర్చుని చూడటమే అద్భుతంగా ఉంటుంది!! ఆ తరువాత డాన్స్ కాంపిటిషన్స్, పరుగు పందెలు, మంచి స్కిట్స్, గెలిచిన వాళ్ళకి ప్రైజులు!! అబ్బ... ఆ రోజులు.... ఆ రోజులే మళ్ళీ రావు.....రాలేవు!! రాంబాబు సార్.... గుర్తున్నాడా.....మన డ్రాయింగ్ సార్.....ఎప్పుడూ స్కిట్స్ వేస్తుండే వాడూ..... అప్పుడు నువ్వు నాలుగొవ తరగతి అనుకుంటా నేను పది చదువుతున్నా లే..!! (నరేష్ కోట:: ఆయన నా పదొవ తరగతికి కూడా అక్కడే ఉన్నారు!!) ఆ..!! ఆయన సి.ఐ.డి. అనే స్కిట్ లో నన్ను హీరో గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ బ్రిజ్ గోపాల్ గాడి వల్ల నాకు అనుకున్నది వాడి కోడుక్కి పోయింది. వెధవకి నేనంటే ఎప్పుడూ కోపమే!! అందరికీ అడగ్గానే ఒక్కమార్కైనా పెంచేవాడు!! కానీ నాకు మాత్రం ఒక మార్కు తగ్గిస్తాననేవాడు!! అసలే పాస్ మార్కులు కన్నా ఎక్కువ వచ్చేవి...