Skip to main content

Posts

Showing posts with the label తెలుగు రీవ్యుస్

My Recommendations:: Best Movies of 2016

My Recommendations:: Best Movies of 2016! The year 2016 has come to an end and we are entering the new calendar year, 2017 marking that our dear rock in the universe, Earth completed its one revolution around our beloved Star Sun like its been doing for billions of years. Well, as humans we are bound to celebrate such an occasion looking forward to a new year with renewed enthusiasm leaving the bygone year worries to the history for records. The cinema in 2016 saw some great moments and very dull moments as well. Recounting the best moments to step into the new year on a positive note, I am giving you the list of my best cinematic experiences in theatre for the year of 2016! I watch films from 6 languages mainly, English, Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. Of all these Kannada is the industry I am amazed and impressed with the fast progress and different cinema it is encouraging and throughly disappointed with the lack of audacity to encourage freshness on the part of...

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ఆడియో రివ్యు..!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ముందు మాట:: జోధా-అక్బర్ తరువాత అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా ఇది. తప్పకుండా మంచి రోమాంటిక్ కామెడి సినిమా అవుతుంది అని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య విశేషం ప్రియాంకా చోప్రా పన్నెండు(12) పాత్రల్లో నటించడం. కమల్ హాసన్ రికార్డుని బ్రేక్ చేసేసింది. మరి ఆ పన్నెండు పాత్రల్లో కేవలం కనబడిందో లేక నటించిందో ఈ నెల 25 కి విడుదలయ్యే సినిమాని చూస్తే తెలిసిపోతుంది. అశుతోష్ రెహమాన్ ని విడిచి ఈ సినిమాతో సోహైల్ సేన్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేసారు. అతను పాటలు ఎలా ఇచ్చాడో చూద్దాం.........ఆ..అన్నట్టూ ఇందులో పదమూడు(13) పాటలున్నాయి. రాశికో పాట. ఇంకో ఎక్సట్రా.............

గణేష్--జస్ట్ గణేష్ ఆడియో రివ్యూ........!!

గణేష్--జస్ట్ గణేష్ ముందు మాట:: ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రామ్ నటించిన కొత్త సినిమా గణేష్ పాటలు విడుదలయ్యాయి. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఎమ్.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెఢీ తరువాత రామ్ తో స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రమిది. మిక్కి జె.మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...... తనేమందో............ . రాసిన వారు:: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన వారు:: జావేద్ అలీ పాట టైటానిక్ సంగీతం బీట్ తో మొదలౌతుంది. వింటున్నంత సేపు ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది. ఇంకా హ్యాపీ డేస్ మత్తు వదలలేదు మిక్కి గారికి. జావేద్ అలీ గొంతులో తెలుగు అంతగా కూనీ కాకపోవడం కాస్త హర్షించదగ్గ విషయం. పాటకి తగినట్టుగా ఉంది అతని గానం. శాస్త్రి గారు ఎప్పుడూ రాసే భావాలే.......కొత్తదనం లేని పాట. లలల్లలయ్.......... రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి పాడిన వారు:: కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్ పాట పూర్తిగా ’ఒకే ఒక్కడు’ సినిమాలోని ’ఉట్టి మీద కూడు’ తరహాలో నడుస్తుంది. దరువు పాట ఒక్కటైనా ఉండాలని చేసినట్టు ఉన్నారు. రామజోగయ్య గారి లిరిక్స్ పాటకి తగినట్టు గానే ఉన్నాయి. పాడిన...

జోష్ సినిమా రివ్యూ......

అక్కినేని వంశం నుంచి నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా జోష్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరి ఆశక్తిని చూరగొన్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడుల మనవడు, నాగార్జున తనయుడు, వెంకటేష్ మేనల్లుడు ఇలా చాలా పెద్ద కుటుంబ ఇమేజ్ ఉన్న హీరో మొదటి సినిమా అందులోనూ రెండేళ్లు నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ని సినీప్రియుల్ని ఊరించిన ఈ సినిమా అనుకున్నంత ఆశించినంత జోష్ ని ప్రదర్శించలేకపోయింది. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత నిర్మించిన ఈ చిత్రంలో రాజు గారి దగ్గర చాలాకాలం నుంచీ పనిచేస్తున్న వాసువర్మని దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమాతో. అతనిలో ఉన్న కఫ్యూజన్ సినిమా అంతా కనబడింది. సినిమాని హీరో కుటుంబ ఇమేజ్ కి తగినట్టు రూపోందించాలా లేక తన సినిమాగా గుర్తింపు తెచ్చుకోవాలా అనే విషయంలో అతను చాలా తికమక పడ్డాడు. హీరో పాత్ర చిత్రణలో ఇది స్పష్టంగా కనబడుతుంది. సహజంగా యక్టివ్ గా ఉండే వ్యక్తి అందులోనూ యంగ్ కాలేజ్ అబ్బాయి మరి అంత నిరసపడిపోయినట్టు చూపించటం అతని క్యారెక్టర్ కి కరెక్ట్ గా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రకంగా సినిమా మొదటినుంచి చివరివరకూ మరోరకంగా ఉండటం మార్పుని సూచి...

కమినే చూడదగ్గ చిత్రమే.......!!

ఈ సినిమాని నేను రిలీజ్ అయిన రెండో రోజే చూసాను కానీ అప్పట్లో రాయలేదు. ఇప్పడు మళ్లీ చూసాను.......రాస్తున్నాను. సినిమాని మన పాప్యులర్ మసాలా సినిమాగా చూస్తే అస్సలు నచ్చదు. అవ్వటానికి మసాలా కధే అయినా ఈ సినిమాని తీసిన విధానం కొత్తగా ఉంటుంది. కాస్త అస్తవ్యస్తంగా కూడా ఉంటుంది. అర్ధం అవ్వడం కష్టం. కానీ అర్ధమయితే మజా వస్తుంది. ఇదో ఇద్దరు కవలల కధ. ఒకరు తప్పుడుదారిలోనైనా తన కలని నేరవేర్చుకుంటే మరొకరు ఊహించని మలుపు వల్ల కలని వదులుకుంటాడు. మనకి ప్రతిరోజూ జీవితంలో ఇలాంటి వారు కనబడుతూనే ఉంటారు. ఇద్దరికి మాటాలాడటంలో తడబాటు. ఒకరు ’క’ ని ’ఫా’ అని పలికితే ఇంకొకరికి నత్తి. ఒకరి మార్గం తప్పు మరొకరిది ఒప్పు. కధ చార్లీతో మొదలై అతను కల నేరవేర్చుకొవడంతో ముగుస్తుంది. తమ్ముడి పాత్ర మధ్యలో వచ్చి సమస్యలు సృష్టించినట్టు అనిపిస్తుంది. కానీ కధ ఇద్దరిది. ఇద్దరూ ముఖ్యులే. ఒక పాత్ర కధగానే చెప్పిన విధానం వల్లే చూసేవారికి తికమక కలుగుతుంది. ఎవరి వైపు నుంచి కధని అర్ధం చేసుకోవాలో తెలియదు. గందరగోళం నుంచి తెరుకుని కధని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టె సరికి సగం సినిమా అయిపోతుంది. విషాల్ భరద్వాజ్ ఇంతకు ముందు సినిమాల్లా ఇ...

వినదగ్గ కొత్త తెలుగు సినిమా పాటలు.....!!

కొత్త సినిమాల మీద రివ్యూల కన్నా ఇలా చేబితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే నేను విన్న కొత్త సినిమాల పాటల విశేషాలు ఇవి............ జోష్............  త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు... డి..డిరిడి.. . పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది. బాడ్ బాడ్ బాయ్... . ఇందులో ఈలగానం మనని ఆకట్టుకుంటుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. రంజిత్ బాగా పాడాడు. నీతో ఉంటే నిన్నే పెళ్ళాడతాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు పాటని గుర్తుకుతెస్తున్నట్టు సాగుతుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. మంచి మెలోడి. కాలేజీ బుల్లోడా. . చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు. పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీ...

తెలుగు రీవ్యులు:: మగధీర ఆడియొ రీవ్యు !!

మనమ౦దర౦ ఎ౦తగానో ఎదురుచూసిన పాటలు మనమున్దుకు వచ్చెసాయి!! నిన్న రాత్రి అట్టహసమ్ గా జరిగిన ఆడియొ విడుదల మహొస్తవమ్ లొ మెగాస్టార్ చిర౦జీవి పవర్ స్టార్ పవన్ కల్యణ్ చెతులమీదగా పాటలు విడుదలయ్యాయి!! రాజమొళి దర్సకత్వ౦ లొ వస్తున్న ఈ సినిమా చాలాకాల౦ చిత్రికరణ జరుపుకొని ఇప్పటికి మనము౦దుకు రావడానికి సిద్దమై౦ది!! రాజమొళి సినిమా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కీరవాణి బాణీలూ హీరో విలన్ పాత్రలూ వారి మధ్య పొరాటాలు!! మరి రామ్ చరణ్ తేజ్ నటి౦చిన రొ౦డో సినిమా పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా.................... బ౦గారు కోడిపెట్ట ..................... పాడిన వారు : : ర౦జిత్, శివాని రాసిన వారు :: భువనచ౦ద్ర ఘరానా మొగుడు సినిమా లొని ఈ పాట చిర౦జీవి హుషారు గీతల్లో ము౦దు వరుసలొ ఉ౦టు౦ది. ఈ సినిమా కొస౦ ఆ పాటని రీమిక్స్ చెసారు అని వినగానే అ౦దరిలొనూ పాట ఎలా ఉ౦టు౦దో అనే ఉత్సుకత నెలకొ౦ది. కానీ పాటలొ కొన్ని బీట్స్ ని మాత్ర౦ మార్చి యధాతధ౦ వాడేసారు.ఈ సారి పాడిన వారి గొ౦తుల్లొ బాలు చిత్ర లకి ఉన్న౦త ధమ్ము లేకపొవడ౦తొ పుర్తిగా అసలు పాటనే వాడుకుని ఉ౦టే బాగు౦డేది అనిపిన్చి౦ది. ఈ పాట ని రీమిక్స్ అనట౦ కన్నా రీ ఆరే౦జ్డ్ అనటమే ఉత్తమ౦...