వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల సంతాపం పూర్తి కాక మునుపే చాలామంది నోళ్లల్లో నానుతున్న మాట ఇది. రాష్ఠ్రం మొత్తం సంచలనం సృష్టించిన ఒక దుర్ఘటన ఈ చర్చకు తావునిస్తుందని ఎవరూహించగలరు? ఎంత లేదన్నా ఒక అగ్రనేత చనిపోయిన వేంటనే ఆయన మా దేవుడు ఆయన లేని లోకం, రాజ్యం కల్ల అని వాపోతూనే ఆ నాయకుడి వారసుడిగా ఆతని నిజజీవిత వారసుడిని ప్రకటించమని ప్రదర్శనలు జరపటం, బాహాటంగా మద్దతు తేలపని వారిని విమర్శించటం విడ్డూరం. బాధలో ఉన్నవారికి ఎవరు వస్తే ఎమిటీ? సరే మా నాయకుడి ఆశయాలు ఉన్నతమైనవి ఆయన బిడ్డ తప్ప మరేవ్వరూ వాటిని ముందుకు తీసుకువెళ్లలేరు అంటే....ఆయన ఆశయాలు అన్ని పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పరిచి ఉంటారు కదా.. మరి వచ్చే వ్యక్తి వాటిని పాటించరా? ఇంత జనాదరణ ఉన్న వ్యక్తి నడిపిన తీరును కాదనీ తమకు తోచిన విధంగా పరిపాలన చేసేంత వెర్రివారు ఉంటారా? ఎందుకు ఇంత భయం? సంతాపంలో కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏమిటీ? రాజకీయాలు స్వచ్చంగా నిర్వహించటం కష్టమే కానీ మరి ఇంత తొందరపాటుతనం ద్వారా సాధించగలిగింది లేదు. అనంత దుఃఖంలో ఉన్న వ్యక్తిని వేంటనే వచ్చి పగ్గాలు చేపట్టమంటే అది సాధ్యమేనా? ఎంతటి వ్యక్తికైనా సమయం పట్టదా? ఎందుకింత...