"అద్భుతం అనేది ఒక్కసారే జరగాలి మాటి మాటికి జరిహిత్ర అది అద్భుతం అనిపించుకుంటుందా?" అని అడిగిన ఆ అమాయకత్వం నా కింకా గుర్తే. తను ఒక రోజు నా తో మాట్లాడాలి నన్ను గట్టిగా హత్తుకుని ముద్దాడి ఎదో సాధించినట్టు ఎగరాలి ... ఒక రోజు కష్టపడి అలిసిపోయి నా వాడిలో సేద తీరాలి ... ఇంకొరోజు నాకే అమ్మ అయి లాలించి బుజ్జగించాలి ... ఇలా ఎన్నో కోరికలు ... అన్నిటికి నా అందాల రాకుమారి దగ్గర సమాధానం ఉండేది ... అది చాలు బాధ మరవడానికి ... ఆ నవ్వు చాలు మళ్ళీ మళ్ళీ ప్రేమ లో పడటానికి. అది తను నాకు ... ****************** "ఈ ప్రయాణం ఇంత ఒంటరి గా చెయ్యకర్లేదు .. నేనుంటా నేస్తం లా ... ఎక్కడి దాకా?" అని ఒక అపరిచితుడు కానీ తెలిసిన వాడిలా కనిపిస్తున్న ఒక నడి వయస్సు అందగాడు చమత్కారం గా ఎక్కడో ఆలోచిస్తున్న సూర్య ప్రతాప్ ఎదురు సీట్ లో కూర్చున్నాడు. ఆ పిలుపు తో ఆలోచనల నుంచి బయటపడ్డ ప్రతాప్ ఆ మాటల కి అర్ధం ఏమిటి అన్నట్టు చూసాడు. అపరిచితుడు : "నా పేరు చెప్పినా గుర్తు పెట్టుకునే ఆలోచన కాదు నీది. కళ్ల కుళాయి ని కట్టేసి కాసేపు హృదయాన్ని మాటల తో తేలిక చెయ్యి. " ప్రతాప్: "తెలియని ...