"అద్భుతం అనేది ఒక్కసారే జరగాలి మాటి మాటికి జరిహిత్ర అది అద్భుతం అనిపించుకుంటుందా?" అని అడిగిన ఆ అమాయకత్వం నా కింకా గుర్తే. తను ఒక రోజు నా తో మాట్లాడాలి నన్ను గట్టిగా హత్తుకుని ముద్దాడి ఎదో సాధించినట్టు ఎగరాలి ... ఒక రోజు కష్టపడి అలిసిపోయి నా వాడిలో సేద తీరాలి ... ఇంకొరోజు నాకే అమ్మ అయి లాలించి బుజ్జగించాలి ... ఇలా ఎన్నో కోరికలు ... అన్నిటికి నా అందాల రాకుమారి దగ్గర సమాధానం ఉండేది ... అది చాలు బాధ మరవడానికి ... ఆ నవ్వు చాలు మళ్ళీ మళ్ళీ ప్రేమ లో పడటానికి. అది తను నాకు ...
******************
"ఈ ప్రయాణం ఇంత ఒంటరి గా చెయ్యకర్లేదు .. నేనుంటా నేస్తం లా ... ఎక్కడి దాకా?" అని ఒక అపరిచితుడు కానీ తెలిసిన వాడిలా కనిపిస్తున్న ఒక నడి వయస్సు అందగాడు చమత్కారం గా ఎక్కడో ఆలోచిస్తున్న సూర్య ప్రతాప్ ఎదురు సీట్ లో కూర్చున్నాడు. ఆ పిలుపు తో ఆలోచనల నుంచి బయటపడ్డ ప్రతాప్ ఆ మాటల కి అర్ధం ఏమిటి అన్నట్టు చూసాడు.
అపరిచితుడు : "నా పేరు చెప్పినా గుర్తు పెట్టుకునే ఆలోచన కాదు నీది. కళ్ల కుళాయి ని కట్టేసి కాసేపు హృదయాన్ని మాటల తో తేలిక చెయ్యి. "
ప్రతాప్: "తెలియని వాళ్ల తో మాట్లాడను!"
అపరిచితుడు: "అయితే తెలిసిన వాడిని అనుకో .. నేను నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా ... ఆస్తి అడగలేదు గా దీనంగా గాల్లోకి చూసే బదులు మాట్లాడితే భారం తగ్గుతుంది. ఒంటరితనం నీకు అలవాటు ఎలాగో లేదు .. ఉన్నట్టు నటన వై అని ..."
ప్రతాప్: "ఎవరో అనుకుని ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు. మనకి నువ్వు అనుకునేంత పరిచయం లేదు .. ఇప్పుడు నాకు చేసుకునే ఉత్సాహం కూడా లేదు .."
అపరిచితుడు (నవ్వుతూ): "దూరం చేసుకునే కొద్దీ మనుషులు ఒంటరి వాళ్ళు అవుతారు ... ఇప్పుడు కూడా ఎందుకు అంత పంతం?"
ప్రతాప్ : (చిరాగ్గా) "అప్పుడు ఇప్పుడు అంటూ ఏంటి నాకీ నస ... ట్రైన్ లో పడుకోవటానికి బెర్త్లుంటాయి .. హాయిగా నిద్రపోండి .. నా బుర్ర తింటే ఏమొస్తుంది?"
అపరిచుతుడు: "ఒకసారి చుట్టూ చూడు .."
ప్రతాప్ కి అప్పుడే అర్ధం అయ్యింది ఆ కంపార్ట్మెంట్ లో బెర్తులేవని ... పై గా ఎదురు బదురు సీట్లు అన్ని .. ఏక్కడో చూసినట్టు ఉన్న జనాలు అంత నింపేశారు కానీ అంతా స్మశాన నిశ్శబ్దం. ఈ మనిషి స్టేషన్ వచ్చే వరకు నా పక్కనే అన్నమాట అని మనసు లో అనుకుని
ప్రతాప్: "మాట్లాడే ఉద్దేశ్యం లేదు .. మీరు చెబితే వింటా!"
అపరిచితుడు:"ఇది నీ ప్రయాణం .. ఆలోచనలతో కట్టిపడేస్తున్న మనసు ... ఓదార్పు కోరుకుంటున్న దుఃఖం .. అయినవారికీ చేరువకాలేను కనుక వీడిపోతున్న ప్రేమావేశం ... ఇవన్నీ నీవు వినే వాడు దొరికాడు అని చెప్పేసుకోక ఆలోచిస్తావేం ... కానీ ..!"
ప్రతాప్: "మీకేం కావాలి స్వామి?!"
అపరిచితుడు: "నీ భారం ..."
ప్రతాప్: "ఏంటి????"
అపరిచుతుడు: "నేను ఇంతసేపు మాట్లాడితే ... ఈపాటికి పొర్లు దండాలు పెట్టేసేవారు ... చెప్పవయ్యా .. ఇంకెంత ఆడిగించుకుంటావ్ .."
ప్రతాప్: "సరే ... ఎలాగో వదలవు నన్ను ... ఈ ట్రైన్ ఇంకా అడవుల్లో నే ఉంది .. కానీ .. నేనేం అలిచిస్తున్నానో విను .."
****************
ప్రతాప్ అప్పుడే కార్తీక తో మాట్లాడాలి అని బయలుదేరాడు .. ఎదో ఉత్సహం .. తనని కలిసి చెప్పేస్తేనే కానీ తీరని ఆరాటం .. ... అలా అలా మేఘాలలో తేలుతూ పాట వింటూ వెళ్లి భరిస్తా లో కూర్చుని .. ఎంత సింబాలిసం ... ఇక నిన్ను జీవితాంతం భరిస్తా అని భరిస్తా లో చెబుతున్నా .. అనుకున్నాడు ...
రేడియో స్టేషన్ మారింది ... ఫీల్ మై లవ్ అంటోంది ... అలా కార్తీక నడుచుకుంటూ వస్తోంది .. సాంగ్ రెండో చరణం ముందు దేవి కొట్టిన మ్యూజిక్ కి మనోడి expression సింక్ అయ్యింది .. విషయం ముందే తెలిసినట్టు కార్తీక తెల్లని దుస్తుల్లో దివ్య సుందరి లా .. అదే అదే తెలుగు లో వైట్ డిరెస్స్ లో ఏంజెల్ లా వచ్చి కూర్చుంది. ఇంకేం మాట రాని మౌనమిది అంటూ బాలు ఇళయరాజా కృతి ఒకటి అందుకున్నాడు .. ఆమె ని అలాగే మనోడు చూస్తూ ఉంటే .. ఆయన శిష్యుడు మనో ప్రియ ప్రియతమ రాగాలు అంటూ ఇంకో ఇళయరాజా కృతి పట్టాడు ... అయినా ఈ మహానుభావుడు కదలటంలా ... చివరికి ఆమె సహనం కట్ట తెగి "ఎవరైనా ఆర్డర్ తీసుకుంటారా?" అని అరిచింది. వచ్చేసాడు .. దెబ్బకి ఈ లోకం లోకి వచ్చేసి ప్రతాప్ .. ఈ సారి ఏ.ఆర్.రెహ్మాన్ కృతి అంజలి .. అంజలి సాక్షి గా .. "నేను నిన్ను ప్రేమిస్తున్నా ... నాకు ఊహ తెలిసినప్పటి నుంచి .. మొదట్లో ఇది కేవలం స్నేహం ..కానీ ఇప్పుడు ప్రేమ .. నువ్వు ఒప్పుకుంటే రేపు పెళ్లి .." అని తేల్చేశాడు. ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తాడు అనుకోని కార్తీక ఆనందం నిండిన ఐ డ్రాప్స్ వదులుతూ "yes" అనేసింది ... ఇంకేం రేడియో లో థమన్ డప్పులు బీట్ స్టార్ట్ చేసాడు, blockbuster సాక్షి గా ప్రతాప్ మైండ్ లో అల్లు అర్జున్ , ప్రభుదేవా తనే అనే ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది.. కాసేపు ఉంటే డాన్స్ చేసేవాడే .. చుట్టూ ఉన్న వాళ్ళ మీద దయ తో ఆర్డర్ తెచ్చేసాడు సర్వర్ సుందరం .. అలా ఎం సందేహం లేదు అంటూ కల్యాణి మాలిక్ వెనక భరోసా ఇస్తుంటే కార్తీక .. ప్రతాప్ .. ఇద్దరు ప్రేమ పావురాలు అయ్యి ఎగిరి పోయారు. ....
****************
కాలం కరిగింది. ప్రేమ తిరిగింది అనే అనుమానం మొదలయ్యింది కార్తీక లో. అప్పుడు సింగల్ కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ. తన మీద మాత్రమే దృష్టి పెట్టలేడు కానీ ఇది వరలా మాత్రం లేడు. ఎప్పుడూ అసంతృప్తి యాడ్ మోడల్ లా ఉంటాడు. ఏంటో ఈ మనిషి అనుకుంటూ ఉంది. ప్రతాప్ వచ్చాడు. ఆనందం గా ఉన్నాడు. ప్రతాప్ పాస్ అయిన ఎన్నో సబ్జెక్ట్స్ లో కార్తీక కోపం ఒకటి. వెంటనే కొడుకు కౌశిక్ ని ఎత్తుకుని ఆడుతూ ఆమె ఆలోచనల్లో ఉన్న భయం తీసేసి షాపింగ్ అన్నాడు. అయిన ఒక్కసారి అయినా మాట్లాడుకోవాల్సిన విషయం ఇది .. కనుమరుగు అయిపోయింది ..
************
కష్టాన్ని మోస్తున్న కన్నీటి దేవత ఉంది తను ఇప్పుడు. ఒక్కకపటి మెరుపు లేదు కళ్లలో. సూన్యం లో ఎదో వెతుకుతున్నాయి ఆమె కళ్లు. అప్పుడే అక్కడికి వచ్చాడు ప్రతాప్. నెలల తరువాత చూస్తున్నాడు తనని. భరించలేకపోతున్నాడు. కానీ అతని లో ఉన్న అగ్గి చల్లారాలి అంటే ఆమె సమాధానం చెప్పాలి. తన తప్పేంటో చెప్పాలి ఎందుకు దూరం చేసిందో తనకి చెప్పాలి.
ప్రతాప్: "కార్తీక "
మాములుగా అతని పిలుపు ఆమె లో ఆనందం నింపుతుంది కానీ ఈ సారి కలవరం మొదలైంది. దూరమయ్యింది అనుకున్న బాధ ఎదో తనని వెతుకుంటు వచ్చి నుంచుంది. ఆ పిలుపు లో ఉన్న వేదన తన ఆవేదనని పెంచేసింది. మాట్లాడలేను అనుకుంటూ వెళ్ళబోయింది. కానీ ప్రతాప్ చెయ్యిపట్టుకుని ఆపేసాడు. ఇక తప్పదు.
ప్రతాప్: "పరిపోయేంత తప్పు నువ్వు చేసావా? నన్ను దూరం పెట్టి కనీసం మాట్లాడకూడనంత తప్పు నేను చేసానా? "
కార్తీక : "నువ్వేం చేశావో అది మర్చిపోలేక ... వాడిని నీకు దూరం చేసాను అనే పేరు వద్దనే నాన్న వాళ్ళ తో ఉంటున్నాను. "
ప్రతాప్: "అదే ఎందుకు? తప్పు ఉంటే సరిదిద్దాలి పరిపోతే ఎలా?"
కార్తీక: "నాకు నీతో ఉండటం విషం. చేదు అయితే సర్దుకోవచ్చు విషం మింగితే చావుకోసం ఎదురు చూపూలే మిగుల్తాయి .."
ప్రతాప్ (ఆ మాటలకి చచ్చిపోయినా ఎదో ఆశ కొద్దీ) : "సరే ... విడాకులు తీసుకుని వెళ్లిపో ... కానీ శిక్ష కి కారణం చెప్పు!"
కార్తీక: "కౌశిక్ వారం రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు అపుడు నువెక్కడ ఉన్నావ్ ..?"
ప్రతాప్ : "సింగపూర్ వెళ్తున్న షిప్ లో .. అప్పుడే చెప్పాను గా పని మీద తప్పడం లేదు అని. నువ్వు పని మీద వెళ్ళినప్పుడు నేను వాడిని చాలా సార్లు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాను. ఆ విషయం మీద ఎన్నో సార్లు సారి చెప్పాను. కుదిరినప్పుడు మామగారి తో నాన్నతో మాట్లాడాను .. నీ తో మాట్లాడతాను అంటే నువ్వు కంగారు పడుతున్నావ్ అన్నారు .. మూడు రోజులకి మామగారు చేసి భయం లేదు పని చూసుకుని రండి అంటే ఇంకేం చెయ్యాలి . దానికే నేను విషం అయిపోయానా? ఎంత సిల్లీ గా ఉందొ తెలుసా ఇది?"
కార్తిక: "మన బిడ్డ చచ్చిపోతాడు ఏమో అనే భయం నుంచి ఓదార్పు నీ మాట. అది ఇవ్వలేకపోయావ్ .. నా మరో బిడ్డ ని చంపేసావ్ ... నీ తో ఆనందం గా చెప్పాలి అనుకున్న కానీ నీకు పని ముఖ్యం .. డబ్బు ముఖ్యం .. ప్రేమ అంటూ వెంటపడ్డావ్ .. పెళ్లి అంటూ ఆనందంగా ఉందాం అన్నావ్ .. ఇప్పుడు నాకు బాధ తప్ప ఎం మిగిల్చావ్? అందరిలా తిరగాల్సిన నా బిడ్డ ని వల్లే మందు తాగాడు. వాడి ముందు తాగకు రా అంటే ... ఒత్తిడి అన్నావ్ .. ఇవాళ వాడు "అమ్మా! నాన్న తాగే జ్యూస్ కావాలి" అంటుంటే ఆ రోజు అది తాగే వాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అనే ఆలోచన వచ్చిన ప్రతి సారి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని బాధ పడుతూనే ఉన్నా. నీ తో ఉండలేను .. త్వరగా సంతకం పెట్టి నన్ను క్షమించి వదిలెయ్యి .. నిన్ను ప్రేమించి తప్పు చేశాను!"
**************
"నాకు తను అలా అనేసరికి ఎం చెయ్యాలో తెలియలేదు. నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. శిక్ష నాకే పడాలి. తప్పు నాదే .. తను చెబుతూనే ఉంది అలవాటు చేసుకోకు అని వినలేదు .. నేను ఒక ప్రాణం తీసాను. మెసరో ప్రాణం లో జీవం లేకుండా చేసాను. నా బిడ్డ కి నా అలవాటు రాకూడదు అనే ఇలా దూరం గా వచ్చేసాను. మనేయ్యలేను .. ఎం చెయ్యాలి ... "
అపరిచితుడు: "బ్రతికే ప్రయత్నం చేసి ఉండాలి. నీ లోకం లో ఎన్నో ఆనందాలు ఉన్నాయి కానీ మత్తు లో ఇంకో లోకం కావాలి అనుకున్నావ్ .. ఇప్పుడు నీ భార్య, కొడుకు ముఖ్యం గా నీ మీద ఆధారపడ్డ ని తల్లిదండ్రులు ఏమాయ్యారో చూడు ..." అంటూ అతని కి కిటికీ వైపు చూపించాడు.
ప్రతాప్ ఫోటో చూస్తూ ఏడుస్తున్న అమ్మా నాన్నా .. వాళ్ళకి తనే కొడుకు అయిన కార్తీక ని చూస్తూ ఏడ్చేశాడు.
అపరిచితుడు: "నీ భార్య నీ లో మార్పు కోరుకుంది .. నువ్వు ఇలా కొత్త జీవితం ఇచ్చావ్.. నీ పిరికితనానికి వాళ్లని చూస్తూ ఏడుస్తూ గడువు. నీ ఆత్మ హత్య కి శిక్ష నీకు కాదు వాళ్ళకి .. "
ప్రతాప్ తల తిప్పి చూసే సరికి అక్కడ ఎవ్వరూ లేరు .. ఎటు చూసినా తన వాళ్లే ...
*************
నా దో లోకం .. ఆనందం చుట్టూ ఉన్న బాధ మిగిలిన త్రిశంకు స్వర్గం!!!

Comments
Post a Comment