మూలం: మా నాన్న Shri. VLNSK గారు రాసిన బ్రతుకు సుఖం(1979) ముకుంద్ శేఖర్ నది ఒడ్డున కూర్చుని వస్తున్న - పోతున్న పడవలు ఒకదానిని మరోకటి దాటడం చూస్తున్నాడు. దూరంగా సూరీడు టాటా బై బై చెప్పే పని లో తెడ్డు పడిన నది నీటి తరంగాలలో దోబూచులాట ఆడుకుంటున్నాడు. పొద్దున్నుంచి అందర్నీ ఒక వైపు మాడుస్తునే ఇంకో వైపు బ్రతుకు దారి చూపించి చూపించి అలసిపోయాడు పాపం. పైగా ఇక్కడ డ్యూటీ దిగి ఇంకో వైపు ఎక్కాలి... కొంచెం సేపు ఇలా ఆడుకుంటే తప్పేముంది అనుకున్నాడు. ఒక పడవ లో అటు ఒడ్డుకు వెళుతున్న అలసిపోయిన పెద్దోళ్ళు ... వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఇటు ఒడ్డుకు వస్తూ అల్లరి చేస్తున్న కురోళ్లు మరో పడవ లో. వాళ్ల గోల మనకెందుకు అనుకుంటూ కొంచెం దూరంగా వయ్యారాలు పోతూ ఈదుతున్న బాతులు ... వాటి పైన గుడ్లూ చేరుకోవాలి అని ఎగురుతున్న పక్షులు. రసికత ఉండాలే కాని ఈ సీన్ ని సీనరి నీ చూస్తూ అలా ప్రకృతి నీ వర్ణిస్తూ గడిపెయొచ్చు. కానీ ... మన ముకుంద కళ్ళలో ఏవో దిగులు నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. అవి తెర దాటి రావు ... మన వాడి బాధ భారం కొండ దిగదు. ఇంత ఆనందం తన చుట్టూ ఉన్న అనుభవించలేని కష్టాన్ని కడిగే పని లో ఉన్నట్టు ఉంది నది ... వచ్చి చల్లగ...