వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల సంతాపం పూర్తి కాక మునుపే చాలామంది నోళ్లల్లో నానుతున్న మాట ఇది. రాష్ఠ్రం మొత్తం సంచలనం సృష్టించిన ఒక దుర్ఘటన ఈ చర్చకు తావునిస్తుందని ఎవరూహించగలరు? ఎంత లేదన్నా ఒక అగ్రనేత చనిపోయిన వేంటనే ఆయన మా దేవుడు ఆయన లేని లోకం, రాజ్యం కల్ల అని వాపోతూనే ఆ నాయకుడి వారసుడిగా ఆతని నిజజీవిత వారసుడిని ప్రకటించమని ప్రదర్శనలు జరపటం, బాహాటంగా మద్దతు తేలపని వారిని విమర్శించటం విడ్డూరం. బాధలో ఉన్నవారికి ఎవరు వస్తే ఎమిటీ? సరే మా నాయకుడి ఆశయాలు ఉన్నతమైనవి ఆయన బిడ్డ తప్ప మరేవ్వరూ వాటిని ముందుకు తీసుకువెళ్లలేరు అంటే....ఆయన ఆశయాలు అన్ని పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పరిచి ఉంటారు కదా.. మరి వచ్చే వ్యక్తి వాటిని పాటించరా? ఇంత జనాదరణ ఉన్న వ్యక్తి నడిపిన తీరును కాదనీ తమకు తోచిన విధంగా పరిపాలన చేసేంత వెర్రివారు ఉంటారా? ఎందుకు ఇంత భయం? సంతాపంలో కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏమిటీ?
రాజకీయాలు స్వచ్చంగా నిర్వహించటం కష్టమే కానీ మరి ఇంత తొందరపాటుతనం ద్వారా సాధించగలిగింది లేదు. అనంత దుఃఖంలో ఉన్న వ్యక్తిని వేంటనే వచ్చి పగ్గాలు చేపట్టమంటే అది సాధ్యమేనా? ఎంతటి వ్యక్తికైనా సమయం పట్టదా? ఎందుకింత రభస? ఏ దీర్ఘకాలీక ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారు ఇంత రాధ్ధాంతం?
మనమున్నది ప్రజాస్వామ్యంలోనా? లేక రాజరికంలోనా? ఆ వ్యవస్ధ వద్దూ అని పోరాడి మనం తేచ్చుకున్న ఈ వ్యవస్ధలో కూడా మనం కోరుకునేది కుటుంబపాలనేనా?
మనలో మార్పు రాదా?
ఇప్పుడు మన భవిష్యత్తు అంతా ఢిల్లీ దర్బారులో ఉంది. ఎవరిని చేస్తే మంచిది అనే చర్చ చాలా జోరుగా, ఘాటుగానే జరిగింది. అయినా పరిపాలన నడుస్తోంది కదా....ఒక సి.ఎం. ఉన్నాడు కదా......అని నానుస్తోంది. ఇక్కడ మంత్రులు మాత్రం తమ విధి నిర్వహణలో మునగక తమ రాజభక్తిని చాటుకుంటున్నారు. పదవులు అలంకరణప్రాయమే అని ఉరకే అనలేదు. పదవిని నిలబెట్టుకోవడానికి చూపిన చోరవ భాధ్యత స్వీకరించటంలో లేదు. ఇటువంటి సమయంలో రోశయ్య తప్ప మరో ఉపాయం లేదు. ఎందరు సహకరించినా.... సహకరించకున్నా నా పని నాదే అని ధృడంగా ఉండటం ఎంతమంది వల్ల అవుతుంది??
ప్రస్తుతానికి విషయం సద్దుమణగనిద్దాం అన్న అధిష్ఠానం నిర్ణయం వారికే ప్రతికూలంగా పరిణమించేలా ఉంది. ఈ ఆందోళనలు ఇంకేంత తీవ్రరూపం దాలుస్తాయో మరి.
ఇంతకీ కాబోయే సి.ఎం. ఎవరంటారూ? మూసను విడిచి ఒక స్త్రీని ముఖ్యమంత్రిగా చూస్తామా? అంత అవకాశం మన రాష్ఠ్రరాజకీయం ఇస్తుందా? ఇది జరిగితే ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించినట్లే..................వేచి చూద్దాం!!

మంత్రులది భక్తి కాదు, భయం. వయ్యస్ హయాంలో తమ అడ్డగోలు నిలువుదోపిడీల లీలలూ, లెక్కలూ బయటపడతాయనే భయం లేకుండా నిబ్బరంగా ఉండాలంటే ఆయన పుత్రరత్నాన్ని పీఠమ్మీద కూర్చోపెట్టాలి. లేకపోతే, ఎంత రోశయ్యా తమలోవాడేనైనా ఎటుపోయి ఎటొస్తుందోనన్న భయం. అంతే.
ReplyDeleteభయమూ,భక్తితోపాటు ముందు సీయెమ్ తో ఉన్న లావాదేవీలూ కావొచ్చు.
ReplyDeleteఅయితే భయంతో కూడిన భక్తి అనమంటారా?
ReplyDelete