బాధ కి రూపం ఉండదు నవ్వు కి అర్ధం ఉండదు ప్రేమ కి కొలత అక్కర్లేదు బ్రహ్మాండం అంతా అరచేతిలో మోయక్కర్లేదు నువ్వు నువ్వు గా ఉండు చాలు నీ లా నువ్వు నవ్వుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ తడబడుతూ ... మళ్ళీ నిలబడుతూ నేను లేను అని ఆగిపోకు నేను నేర్పింది మర్చిపోకు నా పేరు నువ్వు నా రూపం నువ్వు నేనే నువ్వు ... నువ్వే నేను ... నాన్న అంటే ఇంతే కదా నాన్న ..? నువ్వుంటే ఇదే చెప్పేవాడివా..? నేనే ఊహించుకుని అనేసుకుంటున్నానా..? ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వాడివి కదా ... ఇప్పుడు అడుగుతున్నా చెప్పు ... పోనీ .. ఏంట్రా ఇది అని తిట్టు .. శూన్యం లోని నిశీధి అంతా నన్ను అలుముకున్న రోజు నాకు నేను తప్ప ఎవ్వరూ.. ధైర్యం చెప్పలేని రోజు నువ్వు రాకూడదు అనుకున్న రోజు నేను చూస్తున్న నిజం .. కల కాలేని రోజు ఎన్ని ఏళ్ళు గడిచినా బాధ పెంచే రోజు నిన్ను నాలోనే వెతుక్కునే రోజు జ్ఞాపకాల గునపం గుండె చీల్చే రోజు ముందుకు వెళ్లే అడుగు ఆగి వెనక్కి తగ్గే రోజు ఎదో శిక్ష ... పరీక్ష ... అనిపించే ప్రతిరోజు నీ నవ్వు తప్ప ఏది గుర్తుకు రాని రోజు నేను నా గమ్యం లో నిన్ను తలవని రోజు లేద...
మూలం: మా నాన్న Shri. VLNSK గారు రాసిన బ్రతుకు సుఖం(1979) ముకుంద్ శేఖర్ నది ఒడ్డున కూర్చుని వస్తున్న - పోతున్న పడవలు ఒకదానిని మరోకటి దాటడం చూస్తున్నాడు. దూరంగా సూరీడు టాటా బై బై చెప్పే పని లో తెడ్డు పడిన నది నీటి తరంగాలలో దోబూచులాట ఆడుకుంటున్నాడు. పొద్దున్నుంచి అందర్నీ ఒక వైపు మాడుస్తునే ఇంకో వైపు బ్రతుకు దారి చూపించి చూపించి అలసిపోయాడు పాపం. పైగా ఇక్కడ డ్యూటీ దిగి ఇంకో వైపు ఎక్కాలి... కొంచెం సేపు ఇలా ఆడుకుంటే తప్పేముంది అనుకున్నాడు. ఒక పడవ లో అటు ఒడ్డుకు వెళుతున్న అలసిపోయిన పెద్దోళ్ళు ... వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఇటు ఒడ్డుకు వస్తూ అల్లరి చేస్తున్న కురోళ్లు మరో పడవ లో. వాళ్ల గోల మనకెందుకు అనుకుంటూ కొంచెం దూరంగా వయ్యారాలు పోతూ ఈదుతున్న బాతులు ... వాటి పైన గుడ్లూ చేరుకోవాలి అని ఎగురుతున్న పక్షులు. రసికత ఉండాలే కాని ఈ సీన్ ని సీనరి నీ చూస్తూ అలా ప్రకృతి నీ వర్ణిస్తూ గడిపెయొచ్చు. కానీ ... మన ముకుంద కళ్ళలో ఏవో దిగులు నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. అవి తెర దాటి రావు ... మన వాడి బాధ భారం కొండ దిగదు. ఇంత ఆనందం తన చుట్టూ ఉన్న అనుభవించలేని కష్టాన్ని కడిగే పని లో ఉన్నట్టు ఉంది నది ... వచ్చి చల్లగ...