పాతాళ భైరవి !!
తెలుగు సినిమాలలో అజరామరాలు గా నిలిచిపోయిన కొన్ని సినిమాలలో ఈ సినిమా అగ్రస్థానం లో నిలుస్తుంది!!చుసినవారిని విసిగించక ఆనందడోలికల్లో ఓలలాడిస్తుంది!!
ఎన్.టీ.ఆర్. తొలిరోజుల్లో చేసిన అద్భుతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని తెలుగు జానపదాల కి ఆద్యంగా భావిస్తారు!!విటలాచార్య గారు తన సినిమాలన్నిటి లో ఈ సినిమా తరహ స్క్రీన్ప్లే నే ఊపయోగించారు!!
అంత గా జనాన్ని ఆకట్టుకుంది!! ఇవాళ ఎన్నో సినిమాల్లో కనపడే ప్రేమికుల సమస్య అమ్మాయి పెద్దింటి పిల్ల అయితే అబ్బాయి పేదింటి వాడు లేదా జులాయి అల్లరి వాడు !! ఇప్పటికి ఎప్పటికి(మన వాళ్ళు అంత తొందరగా మారరుగా) నూతనంగా నిలిచిపోయే ఈ కథ వస్తువు ౫౮ ఏళ్ళ క్రితం ఈ సినిమాతో తిరుగులేని "హిట్ ఫార్ములా" అయ్యింది!!
"నిజం చెప్పమంటారా?? అబధం చెప్పమంటారా??"
ఎన్.టి.ఆర్. చెప్పిన ఈ డైలాగ్ ఎంతగా జనాన్ని ఆకట్టుకుందంటే ౪౦ ఏళ్ళ తరువాత వచ్చిన బాలకృష్ణ చిత్రం "భైరవద్వీపం" లో కూడా ఈ డైలాగ్ ని వాడుకున్నారు!! రెండు చిత్రాల్ని నిర్మించిన సంస్థ ఒక్కటే కావడం కాకతాళీయం!! ఆ సంస్థ పేరు విజయ ప్రొడక్షన్స్... ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఆ సంస్థ కి మొదటి అతి పెద్ద సినిమా......ఖర్చులోనూ అలాగే విజయం లో కూడా ..!! ఈ సినిమా తరువాత విజయ సంస్థ తెలుగులో అతి పెద్ద నిర్మాణ సంస్థ గా ఎదిగింది ........ మనకి మాయాబజార్, గుండమ్మ కథ వంటి అపురూపమైన చిత్రాలని మనకి అందించింది!!
ఈ సినిమా తో ఎస్.వి.రంగారావు గారు గొప్ప నటుడి గా స్థిరపడ్డారు!! ఈ సినిమాకి ముందు ఆయన ౧౯౪౫ కాలం లో హీరోగా ప్రయత్నించినా అదృష్టం కలిసి రాక తిరిగి ఊద్యోగం లో చేరిపోయారు!! ఆయన వేసిన మాంత్రికుడు వేషం ముందు "ముక్కామల" గారికి ఇద్దాం అనుకున్నారట కానీ చివరి నిముషం లో వారి నిర్ణయం మార్చు కోవడంతో మనకి ఎస్.వి.ఆర్. లాంటి మహా నటుడిని చూసే భాగ్యం దక్కింది ...లేకుంటే ఎక్కడ ఉండేవారో.......మనం ఎప్పటికైనా ఆయన్ని స్క్రీన్ మిద చూడగలిగే వరమో లేదో.......!! ఈ సినిమానే కాదు మాయాబజార్ ని కూడా ఆయన లేకుండా ఊహించుకోలేం..........అందుకు ఈ సినిమా తీసిన కే.వి. రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి!!
అప్పట్లో ఒక మూస లో వెళుతున్న జానపదల్ని మార్చి వాటిల్లోకి మంత్రికులని పరిచయం చేసిందీ చిత్రం!! ఎంతో జనాదరణ పొందిన "బాలనాగమ్మ" నాటకం నుంచి ఈ మాంత్రికుడి పాత్రని రూపొందించారు అని చెప్పవచ్చు!! ఆ మాంత్రికుడు కూడా రాణి ని కామించి ఆపాహరిస్తడు కానీ తేడా ఎక్కడంటే "బాలనాగమ్మ" ని ఆమె కొడుకు ౧౪ ఏళ్ళ తరువాత రక్షిస్తే ఇక్కడ మన విజయ్(ఎన్.టి.ఆర్.) వారం రోజుల్లో తన భార్య ని రక్షించుకుంటాడు!! అలాగే అలాద్దిన్ కథలో లానే నిరుపేద అయిన అబ్బాయి రాణి ని ప్రేమిస్తాడు అలాగే అలాద్దిన్ జీని సహాయం తో పాలస్ కడితే పాతాళ భైరవి సహాయం తో తోటరాముడు కోట కడతాడు!! అలాగే విక్రమార్క మహారాజులా తనని దేవి కి బలి ఇద్దాం అనుకున్నా మాంత్రికుడి ని సాస్తంగా పాడమని అతన్నే బలి ఇస్తాడు!! బాగా ప్రాచుర్యం లో ఉన్నా ఈ కథల్ని కలిపి ఒక అద్భుతాన్ని సృష్టించారు!! తోటరాముడికి యువరానికి మధ్య జరిగే ప్రేమ పర్వం ఎన్నో ప్రణయ కావ్యాలకు జన్మనిచ్చింది!!
ఈ కథ లో "ప్రేమత్రికోణం" కూడా ఉంది!! మహారాణి తమ్ము కూడా యువరాణి ని ప్రేమిస్తాడు ఆమె కోసం మాంత్రికుడి తో చెయ్యికలిపి చివరికి తప్పు తెలుసుకుంటాడు!! ఈ పాత్ర లో రేలంగి ఒదిగిపోయారు!! " వినవె బాలా......నా ప్రేమ గోలా......." పాట ని తనే పాడి మాయాబజార్ లోని "సుందరి .. నీ వంటి........." పాట కి ఆద్యం పోసారు అనే చెప్పాలి!!
మాయాబజార్ కన్నా ముందు వచ్చిందీ చిత్రం !! అలాగే సినిమా చూస్తే రేలంగి గారు తొలి ఎంత నాజూకు గా ఉండే వారో తెలుస్తుంది!! లేని పోనీ గోప్పల్ని చెప్పుకునే పాత్ర లో ఆయనకు ఆయనే సాటి అనిపించుకునేల నటించారు!!
కే.వి.రెడ్డి గారు అప్పటికే వాహిని ప్రొడక్షన్స్ లో చిత్తూర్ నాగయ్య గారి తో యోగి వేమన,అంతకు ముందు భక్త పోతన తీసి పేరు గడించిన!!ఆయన పేరు ను చిరస్థాయి లో నిలపెట్టిన చిత్రాలకి ఈ సినిమా నే ఆద్యం గా చెప్పాలి!! ఆయన ప్రతిభ కు మర్కాస్ బార్ట్లీ గారి కెమెరా తోడు లేకుంటే అంతటి వన్నె చేకురేది కాదేమో?!
విజయ వారి సినిమాలు అన్నిటి లో ఆయన పని తనం కనపడినా కే.వి.రెడ్డి గారి సినిమా మాత్రం ఒక అధ్బుతం!! ఒక ప్రయోగశాల!! పింగళి నాగేంద్రరావు గారు రాసిన కథ,కథనం,మాటలు,పాటలు అన్ని అజరమరాలే!!
పాటలకీ ఘంటసాల గారి సంగీతం సోగాసులద్దింది!!"విజయ వారి వెన్నల" కూడా అప్పుడే ప్రాచుర్యం లోకి వచ్చింది!!
మచ్చు కు కొన్ని..............
మాటలు..............."నిజం చెప్పామంటారా?? ... అబధం చెప్పమంటారా??."
"మనము సేయునది జనం చుడవలేనా?? జనం కోరునది మనం సేయవలెనా??"
" మోసం గూరూ.........మోసం"
"కొడుకునివ్వమంటే రాక్షసుడిని ఇచ్చావ్ కదా ర భగవంతుడా........!!"
"సాహసం సేయార డింభకా !! దేవి కరుణిస్తుంది రా !! రాజకుమారి లభిస్తుంది రా !!"
"జై పాతాళభైరవి.."
పాటలు.............."ప్రేమకోసమై వలలోపడేనే పాపం పసివాడు....."
" వినవె బాలా........నా ప్రేమ గోలా..."'
"ఎంత ఘాటు ప్రేమయో...."
"ఇతిహాసం విన్నారా..........." "
యువరాణి ఇందుమతి గా మాలతీ గారు, సదజపాడు గా పద్మనాభం గారు, అంజి గా బాలకృష్ణ(అప్పటి..) గారు,మహారాజు గా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు గారు అధ్బుతం గా నటించారు!!
తెలుగు వాళ్ళం మనం ఎవ్వరం మరచి పొకుదనీ సినిమా ఇది!! విదేసియులకి మనం " ఇది మా సినిమా" అని గర్వం గ చెప్పు కోతగ్గా సినిమా ఇది!!
ఈ సినిమా చివరలో..........."ఈ కథ విన్న వారికీ కన్నవారికీ శుభం కలుగుగాక "అని ఆశీర్వదించారు!!
అందు వల్ల చూడకపోవటం పాపం కనుక వెంటనే ఒక సీడీ కొనుక్కొని చుసేయ్యండి!!
ఈ వ్యాసం చదివిన వారికీ మంచి కలుగుగాక (రాసిన వారికీ కూడా)!!
అతి చక్కటి సినిమా ని గుర్తు చేసి అందులో విశేషాలు అంద చేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వ్యాసాలు నవతరంగం లో రాస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
ReplyDeleteవ్యాసము చదివి మీ అభిప్రాయాన్ని తెలియజెసిన౦దుకు ధన్యవదములు. నవతర౦గ౦ లొ నా బ్లాగు ను చెర్చె ప్రయత్ ప్రయత్న౦ చేస్తాను!!
ReplyDelete