పాట ముఖ్యమా??
సినిమా కొంతమందికి జీవనాధారం!! మరికొంతమందికి వినొద సాధనం!! ఇవాళ మన సమాజం లో సినిమాకు ఉన్న ఆరాధనను చూసి చాలామంది నటులు కావాలనీ, రచయితలు కావాలనీ, దర్శకులు కావాలనీ తిరుగుతున్నారు!! ఎంతోమంది మిగిలిన అత్యవసరపనులు చేస్తూ గడుపుతున్నారు!! ఇదేమీ ఇవాళ కొత్తగా ఉన్న పరిణామం కాదు!!
ఏనాటి సమాజానికి ఆనాటి అత్యుత్తమ వినొదసాధనం లో భాగం కావాలనీ, దాన్ని జీవనాధారం చేసుకోవాలనీ చాలామంది ప్రయత్నించారు!! ప్రయత్నిస్తూనే ఉన్నారు!! మన సమాజంలో వినొదానికి ముఖ్యం పాట!!
ఒక పాట మనిషిని కదిలిస్తుంది, మదిని మెలుకోల్పుతుంది............విన్నవారితో విహరించి ప్రాచుర్యం పోందుతుంది!! ఏటువంటి మనిషైయినా పాట వింటాడు!! ఎదో ఒకరకం గా అనుభవిస్తాడు!! అనుభవంలోంచి అభినయం పుట్టింది!!
అభినయం పాటలోని మాటకనుగుణంగా మారి భావంతో నాట్యం అయ్యింది!! నాట్యం నుంచీ నటన, అందులోంచి అనుకరణ అన్నీ మొదలయ్యాయి!! కాబట్టి పాటలేకుండా మనం మన ప్రసిధ్ధ కళారుపాల్ని ఉహించుకోలేము!!
విదేశంలో నాటకం ఎలా పుట్టిందో కానీ మనదగ్గర మాత్రం పాటలోంచే పుట్టింది!! మన గురించీ మనం చర్చించుకుందాం.... మిగతా వారి గోడవేందుకు?? ముందు ఇంట గేలుద్దాం!!
అసలు పాటకే అందరికీ ఆనందాన్ని కలిగించే సత్తా ఉంది!!
పాటల్లో ఎన్నో రకాలు---- భక్తి పాటలు, రక్తి పాటలు, విషాద గీతాలు, జానపదాలు ఇలా అనేకం!! భావోద్వేగం పాట రూపంగా నిండిన సంస్కృతి మనది!! మన కళారుపాల్లో అత్యంత ప్రాముఖ్యం పోందినవి --- భరతనాట్యం, కూచీపూడి లాంటి నాట్యరూపాలు, బుర్రకధ, హరికధ, మనదైనా పద్యం, మన నాటకం, సినిమా!! వీటన్నింటిలోనూ పాటలు ముఖ్య భూమిక పోషిస్తాయి!! పద్యాన్ని మనం శ్రావ్యంగా పాడతాము!! వచన నాటకాల కన్నా ముందు మనవి నృత్యరూపకాలు!! అంటే కధని పాటరూపంలో రాసుకోని ఆ పాటని తగు విధంగా అభినయించడం!!
పాట మన సంస్కృతి లో ఎంతగా భాగమైందో కదా?? అందుకే పాట మనకి ముఖ్యం!!
ప్రత్యేకంగా రచన ఎందుకు చేయ్యాలి::
తెలుగులో ముఖ్యంగా పద్యప్రాధాన్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో మన కవులు కావ్యరచన మాత్రమే చేసారు!! అందుకే మన సాహిత్యంలో కావ్యాలే ఎక్కువ!! వచన కధలు 19వ శతాబ్ధంలో మొదలై, 20వ శతాబ్ధంలో ప్రాచుర్యం పోందాయి!!
నాటకాలు మొదలైయ్యాక బుర్రకధ హరికధల ప్రభావంతో పౌరాణీక నాటకాలు ప్రాచుర్యం పోందాయి!! అలా నాటక పరిశ్రమ ప్రారంభమైంది!! ప్రసిధ్ధ కావ్యాల్ని నాటకాలుగా మలిచేవారు పుట్టారు! అలాగే హరికధల్ని నాటకాలుగా రాసేవారు మొదలైయ్యారు!! నాటక రచన విడిగా జరిపే ఆచారం మొదలైయ్యింది!! ఏలాంటి నాటకాలు అధిక జనామోదాన్ని పోందుతున్నాయో పరిశీలించి చేసిన ఈ ప్రక్రియని మొదలుపెట్టింది ఎవరో చెప్పడం కష్టం!! అంతా ఎదుగుదలలో ఒక భాగమే!!
సినిమా కనిపెట్టబడినప్పుడు అది ఒక ఆశ్చర్యం మాత్రమే!! ఆశ్చర్యానికి జనామోదం తోడై అది గుండెల్లోకి చొచ్చుకుపోవాలంటే?? నాటకంలానే అంతకుముందు ఆదరణ పోందిన కళారూపాల నుంచీ నేర్చుకోని ఒక వ్యవస్ధగా ఎదగాలి. అందువల్లే ముందు సినిమాలన్ని నాటకాలే!! అందులో జనాదరణ పోందిన పౌరాణీకాలే ఎక్కువ!! నాటకాల ఉన్నతి గమనించి సామాజిక సమస్యల్ని ఇతివ్రత్తలుగా చేసుకోని జనంలో వినొదంతో విజ్ఞానం నింపిన "కన్యాశుల్కం" వంటి రచనలు, "గురజాడ అప్పారావు" వంటి రచయితలు, రచించారు!! నైజాంపై పోరాటం తో ప్రజాకవులు జన్మించారు!!
అలా నాటకాల్లో సాంఘికాల ఒరవడి పేరిగింది!! ఇలాంటి మార్పే మన సినిమాల్లోనూ చోటుచేసుకుంది నాటక రచనకీ సినిమా రచనకీ తేడా ఉందని విదేశి సినిమాలు, మన అనుభవాలు పాఠాలు నేర్పడంతో ప్రత్యేక రచన అవసరమైంది!!
పౌరాణీకాల్ని కూడా సినిమాకు తగినట్టు రచన చేసి మళ్ళీ మళ్ళీ మలచడం జరిగింది!! కేవలం సినిమాలకే రచన చేసేవారూ వచ్చారు! ఇప్పుడు నాటకాల్ని నామమాత్రం చేసేంతగా సినిమా, సినిమా రచన ఎదిగాయి!!
"సినిమా అంటే కళాత్మక వ్యాపారం"
ఈ విషయం మీద చర్చ మూడోవ భాగం లో చేసుకుందాం!!
త్వరలో సినిమా అంటే... (మూడోవ భాగం) మీ ముందుకు వస్తుంది!!
ఈ విషయం మీద చర్చ మూడోవ భాగం లో చేసుకుందాం!!
త్వరలో సినిమా అంటే... (మూడోవ భాగం) మీ ముందుకు వస్తుంది!!
nareshkota gaaru,
ReplyDeletemee visleshana baagundhi!!
mudo bhagam tvaragaa raayandi!!
mee response ki thanks!!
ReplyDelete