సినిమా అంటే కళాత్మక వ్యాపారం::
ఎదైనా వ్యాపారం అవ్వాలంటే అది జనానికి అవసరమో లేక జనామోదమో పోంది ఉండాలి!! కళకి వ్యాపారానికి సంబంధం ఒక్కపటిది అని చెప్పలేనిది!! కళ ఎంత జనామోదం పోందితే అంత వ్యాపారమైంది!! అసలు వ్యాపారం కానివేవైనా మన జీవితాల్లో ఉన్నాయా.......సబ్బులు దగ్గర నుంచీ తిండి దాకా అంతా వ్యాపారమే కదా..(ప్రేమ తప్ప....అవి కూడా ఒక్కోసారి) ఆ బాటలోనే విద్య, కళ రెండూ వ్యాపారాలైయ్యాయి!!
చిన్న పిట్ట కధ::(సంబంధం ఉన్నదే....)
ఒక గుంపు...(ఏ కాలం నాటిదని అడగకండి.......మీ ఊహా.) ......నడుచుకుంటూ వెళుతున్నారు!! వారు ఎంతసేపటి నుంచీ నడుస్తున్నారో చెప్పలేను కానీ బాగా అలసిపోయి ఉన్నారు!! చెట్టు చూసుకుని కునుకు తీసారు!! నిద్ర తీరాక వారందరికీ ఆకలి మొదలైయింది! మంచివాడోకడు వేట పట్టుకొచ్చాడు!! వాడు తెచ్చిందాన్ని అందరూ పంచుకోవాలనుకున్నారు!! అంతా తనే తినలేడు కనుక అతనూ ఒప్పుకున్నాడు!! ఒక్కొక్కరూ ఒక్కొ పనికి పునుకున్నారు!! ఒకడు వంటచెరకు తెచ్చాడు!! ఇంకొకడు వంటచేసాడు!! మరోకడు అందరికీ సమానంగా పంచటం అదే వడ్డించాడు!! ఒకడు ఆకులు కుట్టాడు!! అందరిలోకీ బలంగా ఉన్నవాడు మరే గోడవ రాకుండా అలాగే బయటినుంచీ ఎలాంటి ప్రమాదం మీద పడకుండా కాపలాకాసాడు!! ఇలా అందరూ ఏదోక పని చేసి తిండి సంపాదించుకున్నారు!! కానీ ఒక్కడు మాత్రం ఏమీ మాట్లాడలేదు!! అందరూ అతని వంక "నువ్వేమీ చేయ్యవా!!".............. అన్నట్టు చూసారు.........వంట మొదలుపెట్టాక పాట అందుకున్నాడు!! అతను పాడిన పాటకి వాళ్లకి పని ఒత్తడి తెలియలేదు...ఇంకా కొత్త ఉత్సాహం పుట్టింది.......పాట పుర్తయ్యాక కూడా వాళ్లల్లో ఉత్సాహం తగ్గలేదు... మళ్ళీ ... మళ్ళీ ... పాడించుకున్నారు!! పులకించిపోయారు.....పాడిన వాడిని మెచ్చుకున్నారు!! అతని భాగనికి వచ్చిన దానితో సరిపెట్టక తాము తినే దాంట్లోచి కూడా కొంతపెట్టారు!! అఖరికి ఎప్పుడూ ఎవరికి పెట్టని లోభి కూడా అతని పిసరంత ఇచ్చాడు!!..............అదీ పాట గొప్పతనం!!
ఈ పిట్టకధలోని గుంపు మన నమాజమైతే........... రైతు తిండికి ముడి పధ్ధార్ధం సమకూరిస్తే............పాటపాడిన వాడు కళాకారుడు......ఆ కళాకారులకి మన సమాజంలో ఉన్న ఆదరణ...ఆరాధన.. వేరే చెప్పనక్కర్లేదుగా.......!!మిగిలిన వారి గురించి మీరే ఊహించండి!! నేను మన వ్యాసం లోకి త్రిపుల్ జంప్ చేసేస్తాను!!
ఇంతకీ విషయం ఏమిటంటే సమాజంలో లలితకళలకి ఉన్న ఆదరణ పేరుగుతూ పోయేసరికి చాలామంది దాన్నో జీవనాధారం చేసుకోవడం మొదలుపెట్టారు!! మంది పేరిగితే మజ్జిగ పలుచనగును అనే సామెత మనకేలాగో ఉంది కదా!! మరి వెల్లువైన కళాకారులలో మంచివారేవరో, పైకి ఎదిగేవారేవరో ఎంచేవారూ, ఎదిగేవారికి సహాయం చేసేవారూ, అవకాశం కల్పించేవారూ.........ఇలా ఒక వ్యవస్ధ పుట్టింది!! అది ఎదిగి వ్యాపారమైంది!!
రాజులకాలంలో ఈ వ్యవస్ధ రూపు వేరు!! రాజాశ్రయం పోందడం గొప్ప ...... ప్రతి కళాకారుడి కల!! తిరస్కరించిన వారూ..... అఖర్లేదనుకున్నవారూ......బహూకొద్ది ....పోతన గార్లాంటి వాళ్లు!! శ్రీనాధుడు లాంటి వాళ్లే ఎక్కువ!! నన్నయ్య గారూ, తిక్కన గారూ ............ ఇలా ఎందరో రాజాశ్రయం పోందిన వారే!! ఒక కావ్యం రాసుకున్నాక అది వారికి నచ్చుతుంది అనుకున్నాక ఎందరో రాజధానికి వెళ్లేవారు!! అందరిని రాజుగారే పరిశిలించలేరు కదా.... అందుకని మహాపండితులు కొందరు ఆ పని చుసుకునేవారు!! నిజంగా పట్టున్నవారికి ఇంకా శిక్షణనిచ్చేవారు!! లేనివారికి ఎమీలేదూ!! రాజాశ్రయం పోందిన వారు తమ గొప్పకావ్యాల్ని రాజుగారికి అంకితమిస్తే వారికి మూడు తరాలకు సరిపోయేంత కనుకలు లభించేవి!! ఆగ్రహం వస్తే అన్నీ పోయేవనుకోండి( శ్రీనాధుడి చరిత్ర)..!!.అదీ రాజాశ్రయం గొప్ప!! అసలుసిసలు వ్యాపారం!! మిగిలిన కళలు అంతే నాట్యకత్తేలు రాజనర్తకిలు గా, హాస్యంగా మాట్లాడేవాళ్లు భట్రాజులుగా, విదూషకులు గా ఉండేవారు!! హరికధలు, బుర్రకధలు చెప్పేవారు ఊరురూ తిరుగుతూ ప్రదర్శనలిచ్చేవారు!!
జమీందారుల కాలంలో కొత్తగా నాటకాలు కూడా గుర్తింపు పొందాయి!! ఇక్కడా జనం ఎక్కువయ్యేసరికి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు!! అన్నింటిలోకీ సురభీ వారూ బాగా పేరు సంపాదించుకున్నారు!! ప్రజాకవులు మొదలయ్యాక ప్రజానాట్యమండలిని స్ధాపించి జానపదాల్ని, జన ఉద్యమ గీతాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు!!
సినిమాని కనిపెట్టాక తెలుగు సినిమాని రఘుపతి వెంకయ్య గారు ఊరురూ తిరుగుతూ ప్రదర్శనలిస్తూ అభివృధి చేసారు!! డేరాలు కట్టి ప్రదర్శనలిచ్చారు!! సినిమా మీద ఆసక్తి పుట్టినవారు నేర్చుకొవడం మొదలుపెడితే, కొందరు ధియేటర్లు కట్టి వ్యాపారంగా అభివృధి చెందడానికి కృషి చేసారు!! అలా వ్యవస్ధను ఎర్పర్చుకోని సినిమా వ్యాపారమైంది!!
ఇంత మనం చర్చలో తేల్చుకునేదేమంటే...........సినిమా ఒక కళారూపం!! కళ జనాదరణ పోంది జీవనాధారమైతే వ్యాపారమౌతుంది!! ఎంత వ్యాపారమైయినా కళ కళే!! దాన్ని కేవలం వ్యాపారంగా మాత్రమే చూస్తే ఎదురుదెబ్బలు తప్పవు!! ఇవాళ మనం చాలానే తింటున్నాం....చూస్తున్నాం!! అందరూ మెచ్చారూ.......జీవనాధారం అని చేసిందే పదే..పదే....చేస్తే.........మనం వేరే చేసినా జనం చూడరు!! గుర్తించరు!!
అందుకే సినిమా అంటే............కళ అనుకుంటే........కళ!!
జీవనాధారం అనుకుంటే........కళాత్మక వ్యాపారం!!
కేవలం వ్యాపారం అనుకుంటే......సూన్యం!!
సామాజిక ప్రభావం చూపించే శక్తి ప్రతికాలంలో ఆ కాలానికి ప్రసిధ్ధమైన ప్రతి కళారుపంలోనూ ఉంది!!
కాబట్టి మంచిని గ్రహించి చేడుని వదిలేస్తే సరి!!
సినిమా ద్వారా వస్తున్నాయి అనుకుంటున్న చెడు పరిణామాలు వాటంతట అవే పోతాయి!!
సినిమా అంటే...................ఒక కళారూపం, వినొద సాధనం, కొందరికి జీవనాధారం, అందరికీ కళాత్మక వ్యాపారం!!
మూడు భాగాల్ని ఆదరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు!!
తోలిసారిగా చదువుతున్నవారుకి మూడు భాగాల్ని చదవమని నా విజ్ఞప్తి!!
అన్ని భాగాలు :: [సినిమాలోకం]
తోలిసారిగా చదువుతున్నవారుకి మూడు భాగాల్ని చదవమని నా విజ్ఞప్తి!!
అన్ని భాగాలు :: [సినిమాలోకం]
హ్మ్
ReplyDeletepittakadha baagundi............
ReplyDeletethank u mahesh gaaru!!
ReplyDeletethank u vinay!!
ReplyDelete