మన కళలల్లో రాసప్రాధాన్యత అమోఘం!! చూసేవారిలో రసానుభూతిని కలిగించడమే ముఖ్యం!! అసలు రసమంటే ఇంగ్లీషు లో expression!! తెలుగు లో భావోద్వేగ స్పందన!! ఒక దృశ్యాన్నో, సంఘటన్నో, చూసినవేంటనే మనలో కలిగే భావోద్వేగ స్పందన!! మన చుట్టూ జరుగుతున్నవిషయాలు, మనమున్న పరిస్ధితులే ఈ స్పందనకు కారణం!!
సినిమాల్లో నటులు తాము స్పందిస్తూ, చూసేవారిలో స్పందన తీసుకురావాలి!! క్లుప్తంగా "రసపోషణే నటన"!!
కేవలం రసపోషణ జరిగితే చాలా?? చాలదు!! సినిమాలు చూసే జనం కోసమే కదా!! మరి ఏదో నటుడు నటించేస్తే సరిపోతుందా?!! సరిపోదు!! ఆ నటుడు ఏం చేసాడో జనానికి ఎక్కాలి, అతను చేసిందానికి తనకు తేలీకుండానే స్పందించాలి!! అది యిల రూపంలో కావచ్చు లేదా తనలో తనే ఆనందించోచ్చు, బాధపడోచ్చు!! ఏమైనా కధలో లీనమైపోవాలి, నటుడుని ఇష్టపడాలి, తిట్టుకోవాలి, అతడు పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకోవాలి!! అదే రసానుభూతి!!
అందుకే నవరసాలు!!
అభినయం కలగలిసిన కళ నాట్యం.. నాట్యంలోంచి వచ్చినవే నవరసాలు!! ఎన్ని ముద్రలు ఉన్నా ముఖంతో అబినయించేటప్పుడు నవరసాల్ని పోషించటం అవసరం!! అదే నటనగా నాటకాల్లోకి ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించాయి!! ఇక ఆ తొమ్మిది రసాలు ఏమిటీ?? మన సినిమాల్లో వాటిని ఎలా ఉపయోగించారో చూద్దాం!!
౧. శృంగారరసం:: ఇద్దరి మధ్య చోటు చేసుకునే ప్రేమభావన శృంగారం!!
ఈ రసానికి మన సినిమాల్లో ప్రాధాన్యత ఎక్కువ! ఆడవారు అందుకే ఉంటారు!! పాటలు పాడుకుని కాస్త కవ్వించి సినిమా ముగింపులో హీరోని పెళ్లాడి అంతకు పూర్వం పాడుకున్న పాటనే మళ్ళీ పాడి సినిమా హాలు నుంచీ బయటికి పోయేముందు మరోసారి విందు చేసి పంపిస్తారు!! మళ్ళీ చూడాలనిపిస్తే వచ్చేయ్యమంటారు!!
ఇప్పుడు హీరోయిన్లూ చేస్తోంది శృంగారరస పోషణే నా?? కాదు.....జుగుప్సాకర విన్యాసాలు!! హీరోల వెంటపడి...బూతులు తిడుతుంటే.......మినీలు, మైక్రోమినీలు, బికినీలు వేసుకుంటే...... శృంగారం ఒలకబోసినట్టా?! ఎంతమాత్రమూ కాదు!!
అలాగని అంటీముట్టనట్టూ ఉండక్కర్లేదు!! కంటితో కవ్వించాలి........నవ్వుతో మత్తెక్కించాలి!! ఏమి చేసినా హుందాగా ఉండాలి!! అంతా హీరోయిన్లకేనా అంటే........హీరోలు ఏటూ కానీ చూపోకటి చూసి, అర్ధంకానీ నవ్వొకటి నవ్వితే అది శృంగారమవదు!! ఆమె పట్ల ప్రేమని కళ్లతోనే తేలియజేయాలి!! ఇద్దరూ దగ్గరైనప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి, జంట చూడముచ్చటగా ఉందనిపించాలి!! అందుకే ఈ రసాన్ని పోషించటం కష్టం!! అన్ని రసాల్లోకీ మొదటిస్ధానం ఉరకే రాదు కదా!!
ఇబ్బందికి, బాగుందికి చిన్న గీతే తేడా!! శృతిమించనంత వరకూ శృంగారాన్ని మించిన రసం లేదు!! అసలుసిసలు శృంగారం మనకి మణిరత్నం సినిమాల్లో కనబడుతుంది! హద్దుమీరకుండానే కవ్విస్తుంది!! నవ్విస్తుంది!! కన్ను పులకిస్తుంది! ఆ రోజుల్లో దూరంగా ఉండటమే ధర్మం!! అప్పటి సినిమాల్లో కూడా అదే కనబడుతుంది!! కంటికి ప్రసన్నంగా ఉంటుంది!! అంతా కళ్ల భాషే కదా!! రాఘవేంద్రుడి సినిమా పాటల్లో శృతిమించనంత వరకూ బాగుంటుంది!!
మన సినిమాల్లో ఇదో భాగం మాత్రమే కనుక గొప్ప శృంగారకావ్యాలు అని పేర్కోనతగ్గవేవీ కనబడవు!!
సినిమా పాటల్లో కూడా ఇవి గొప్పవి ఇవి కావు అనలేం!! ఈ రసం ప్రతి సినిమాలోనూ కనబడుతూనే ఉంటుంది!! అన్ని సినిమాల్లో ఒక్క పాటన్న శృంగారప్రధానంగా సాగుతుంది!!
౨. హాస్యరసం:: నవ్వించటం!!
అమ్మో.! హాస్యమే అని కాకలు తీరిన నటులు సైతం భయపడతారు !! నవ్వించటం చాలా కష్టం!! అందుకే జంధ్యాల గారు "నవ్వించటమోక భోగం!! నవ్వలేకపోవటం ఒక రోగం!!" అన్నారు!! అక్షరసత్యం!! ఇప్పటి సినిమాల్లో వచ్చినట్టు ఆ నిముషానికి నవ్వు వస్తే సరిపోదు!! కడుపులోంచి కంటినిండా రావాలి!! ఆ నీళ్లు గుర్తుండిపోవాలి!! అలాంటి హాస్యానికే శాశ్వతత్వం!!
ఈ విద్య ఎప్పటినుంచో ఉన్నా ఈ కాలానికి జంధ్యాల గారి వల్ల విజృంభించింది!! అందుకే ఆయన "హాస్యబ్రహ్మ"!! ఇప్పుడు ఆయన సినిమాలు చూడనీ, ఆయన హాస్యాన్ని అనుభవించని వారుండరు!! అసలే హాస్యప్రియులం కూర్చోపెట్టి నవ్విస్తే నవ్వమా!! సినిమా ఉన్నంత కాలం నిలిచిపొతారు!! ఆ కాలం సినిమాల్లో పింగళి గారు హాస్యాన్ని అలవోకగా పండించారు!! ఆయన రాసిన జగదేకవీరుని కధ సినిమా హాస్యజానపదాల్లో ముఖ్యమైనది!! అందులో బాదరాయణ ప్రగడ పాత్రని మరువలేం!! ఇక మాయాబజార్, పాతాళ బైరవీ సినిమాల గురించి ప్రత్యేకంగా చేప్పాలా?
ఆయన చేసిన పదప్రయోగాలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి!! డి.వి.నరసరాజు గారిని సరసరాజు అనేవారు!! ఆయన వ్యంగ్యాస్త్రాలు వేయటంలో దిట్ట!! మరోసారి యమగోల, గుండమ్మ కధ చూడండి!! ఆయన అన్ని రకాలూ రాసినా వ్యంగ్యరచనా సమర్ధుడు గానే ప్రసిద్ధుడు!! చక్రపాణీ గారు రాసిన సినిమాలు పెళ్లి చేసి చూడు, అప్పు చేసి పప్పు కూడు, మిస్సమ్మ హాస్యరస ప్రధాన చిత్రాలే!!
కవ్విస్తూ నవ్వించటంలో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు!! ఆయన రాసిన సినిమాలన్నింటిలోనూ ఆయన మాటవరుసలు బాగుంటాయి!! పూర్తిస్ధాయి హాస్యాన్ని ఒలకబోసిన చిత్రం ప్రేమించి చూడు!! నవ్వుకుంటూ చూడాల్సిందే!! ఇక ముత్యాలముగ్గులో రావుగోపాలరావు డైలాగ్స్ ని మరచుపోతరమా!!
కొంత slapstick, కొంత మాటల హాస్యం, మరికొంత సందర్భహాస్యం కలగలిసింది మన తెలుగుసినిమా హాస్యం!!
మొన్న మొన్న ఇ.వి.వి, రేలంగి నరసింహారావు, కృష్ణా రెడ్డి సినిమాల్లో మెరిసింది!! ఇప్పుడు త్రివిక్రం కలంలో జీవం పోసుకుంటోంది!! రాజేంద్రప్రసాద్ ని అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపుపోందేలా చేస్తోంది!!
రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, బాలకృష్ణ(ఆనాటి..), సూర్యాకాంతం, అల్లు రామలింగయ్య, గిరిజ, గీతాంజలి, ఛాయాదేవి, రాజబాబు, రమాప్రభ,రావికొండలరావు,చలం తోలితరం హాస్యనటీనటులు !! హాస్యానికి వన్నెతెచ్చిన వారు!! వారు పండించిన హాస్యం నేటికీ సజీవం!! వారికీ ప్రత్యేకంగా పాటలు కూడా ఉండేవి!!
"అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే........", "సరదా సరదా సిగరెట్టూ......."," సుందరీ నీ వంటి దివ్యస్వరూపం.." ఇప్పటికీ గుర్తింపు పోందుతూనే ఉన్నాయి!!
ఇవాళ్టి తరానికి బ్రహ్మానందం , కోట శ్రీనివాసరావు, అలీ, బాబూమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పుకోతగ్గ హాస్యనటులు!! ఆ రోజుల కంటే ఇప్పడు హాస్యం పేరుతో బూతులు ఎక్కువగా చెలామణీ కావటమే బాధాకరం!!
అప్పుడు ఒక లోభి డబ్బు కోసం ఏ గడ్డైనా కరవటం హాస్యమైతే ఇప్పుడు ఆడవారి వేంటపడుతూ తినరాని చోట దెబ్బతినటం హాస్యం అదే తేడా!! అందుకే ఇప్పటి హాస్యం నిలబడటం లేదు!! అప్పటికీ ఇప్పటికీ మారనిది ఒక్కటే.... చిన్న పేద్ద తేడా లేకుండా అందరు హీరోలూ హాస్యచిత్రాలు చేసి నవ్వించారు!!
౩. కరుణరసం:: ఏడిపించటం, జాలి కలిగించటం!!
కరుణరసమంటే ఏడవటం కాదు ఏడిపించటం, జాలి కలిగించటం!! మన సినిమాల్లో ఆడవాళ్ల సినిమాల పేరుతో బకెట్లు, బకెట్లు కన్నీరు కార్పిస్తుంటారు!! ఎందుకు ఏడుస్తారో తెలియదు కాని ఏడవాలి !! అప్పుడే చూస్తారు!! ఏమిటో ఈ లెక్కలు!! మనకర్ధం కావు!!
మన సినిమాల్లో కరుణ కలిగించే పాత్రలు చాలానే ఉన్నాయి!! కధలు బోలేడు!! హీరో తల్లి పాత్రలు ఎప్పుడూ మిషన్ కుట్టో, వంటలు వండో, ఇంకా ఇలా చాలా కష్టాలు పడాలి! అబ్బాయి జులాయి అయితే గుండెలు బాదుకోవాలి, డిగ్రీ సంపాదించుకోస్తే తండ్రి పటాన్ని తెచ్చి అతని చేత మోక్కించి కోరిక తీర్చానని మురిసిపోవాలి!! ఆడపిల్ల తల్లి అయితే అబ్బాయిలు వేంటపడుతున్నారని తెలిసి బాధపడాలి, మరణించే ముందు మిగిలిన పిల్లల బాధ్యతని అప్పగించాలి!!
అన్ని కరుణరసానికి ప్రతీకలే!! మరికాస్త శృతిమించితే విడిపోయిన కుటుంబాన్ని కలపమంటూ కళ్లనీళ్లు పెట్టుకోవాలి!!
విడిపోయిన వారికోసం వెతుక్కోవాలి!! సినిమా చివరి వరకూ కలవకూడదు!! ఇదంతా కమర్షియల్ సినిమాల హిట్ ఫార్ములా డ్రామా!!
అసలుసిసలు కరుణరసం రూచి చూపించిన సినిమా సత్యహరిశ్చంద్ర!! నాటకంగా కూడా అందరి చేత కళ్లనీళ్లు పెట్టించింది!! కాటికాపరి పద్యాలు రికార్డులు గా కూడా అమ్మబడ్డాయి!! యసేస్వి రంగారావు గారి నటనలో పాత్ర, పద్యాలూ అమోఘంగా పండాయి!! ఎన్.టి.రామారావు గారి హరిశ్చంద్ర అంతగా పండకపోయినా మంచి సినిమానే!!
శాశ్వతంగా నిలిచిపోయే కరుణరసాత్మక నాటకచిత్రం!!
దేవదాసు పాత్ర self-pity తో తను బాధపడుతూ చూసేవారినీ బాధపేడుతుంది!! నాగేశ్వరరావు గారు అద్భుతంగా పోషించారు ఈ పాత్రని!! ఎప్పటికి నిలిచిపోతుంది!! ఆయన పాడిన తత్వాలు, ఆ expressions ఎప్పటికీ మరచీపోలేం!!
ఇంకోన్ని మంచి చిత్రాలు రక్తసంబంధం, మనుషులు మారాలి !! ఇప్పటి కాలానికి అంతపడదు అని ఈ రసం లో సినిమాలు తగ్గిపోయాయి!! గుర్తుంచుకోతగ్గ చిత్రం మాతృదేవోభవ!!
ఆ సినిమాలోని "రాలిపోయే పూవ్వా నీకు రాగాలేందుకే.........." పాట తెలియనివారు కన్నీరుపేట్టనివారూ ఉండరు!!

మిగిలిన రసాల్ని రెండొవ భాగంలో చర్చిస్తా.........ప్రా’మిస్’......ప్లీజ్....డోన్ట్ ’మిస్’..!!
మీ కీబోర్డులో పీరియడ్ ఉండాల్సిన చోట ఎక్స్‌క్లమేషన్ పాయింట్ ఉన్నట్లుంది :-)
ReplyDeletehahahaha, అది కేవలం అలవాటు!! మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను!! కామెంటినందుకు ధన్యవాదాలు అబ్రకదబ్ర గారు!!
ReplyDelete