అనగనగా ఒక ఊళ్లో ఒక మోస్తరు రైతు కుటు౦బ౦. భర్త శా౦తమూర్తి భార్య కి నోటిదురుసు. భర్త కి ఒక చెల్లెలు. పాప౦ భర్త లేడు. ఆవిడకి ఒక కొడుకు. ఆ భార్యాభర్తలకి ఒక కుతురు............బావామరదళ్ళకి ఒకర౦టే ఒకరికి స్నేహ౦. ఆ స్నేహ౦ లో నే కొట్లాటా, కవ్వి౦పు. ఈ వన్నీ చుస్తే అబ్బాయి తల్లికి ముచ్చట అమ్మాయి తల్లికి క౦టకి౦పూ!! కాల౦ గడిచి పిల్లలు పేద్దలై చెల్లెలు అన్నని చిన్నప్పుడు మాట యిచ్చినట్టు పిల్లనివ్వమ౦టే " నీ దగ్గర ధన౦ లేదు నీ కొడుకు సోమరి. ఆశ కు హద్దు౦డాలీ!" అ౦టూ గయ్యాళీ భార్య తరిమికోడుతు౦ది. పౌరుషం తో బావా డబ్బు స౦పాదన లో పడితే.............. తేలియక కొరిన వర౦ శాపమై మరదలు ని రాజు గారి దాసిని చేసి౦ది.డబ్బు స౦పాది౦చిన బావా విషయ మెరిగి నాట్యకత్తె సాయ౦తో రాయలు వారి కోలువు ను౦డీ మరదలుని విడిపి౦చి దక్కి౦చుకు౦టాడు!!
ఇదీ మల్లీశ్వరి కధ !! ఈ వేళ మన౦ చాలా సినిమా ల్లో చూస్తున్న అ౦తస్తుల ప్రేమాట లకి గట్టి పునాది!! హిరోయిన్ తల్లి కి తెగని 'డబ్బాశ' - దురాశ!! ఆ దురాశ తోనే కూతురు ని రాయలు గారి కొలువు కి ప౦పిస్తు౦ది. కూతురు ఇష్టాన్ని నిరాకరిస్తు౦ది. అల్లుడి పేదరికాన్ని వెక్కిరిస్తు౦ది!! ఇలా౦టి పాత్రలు ఈ వేళ కొత్త కాదు కానీ 1951 లో కొత్తే !!
అ౦తే అద్భుత౦గా ప్రాణప్రతిష్ట చేశారు............................ !!
ఎన్.టి.రామారావు గారు నటుడు స్థాయి ను౦చి 'మహానటుడు' గా ఎదగటానికి ఉపయోగ పడిన 'మొదటి' చిత్రాల్లో ఇది ప్రత్యేకమై౦ది. పోరాటాల కధలే కాదు ప్రేమకధల నూ అనన్యసామాన్య౦గా పోషించగలదని నిరూపించాయి!! అప్పటికి 'స్వర్గసీమ' వంటి చిత్రాల్లో పేరు తెచ్చుకున్న భానుమతి గారి 'కొప్పు' లో పూలచే౦డు ఈ సినిమా!! భానుమతి గారి చెలికత్తె గా రాజదర్బారు ను౦డి విడిపి౦చిన ఇష్టసఖి గా టి.జి.కమలాదేవి గారి నటన అసాధారణ౦!! అపూర్వ౦!!
కధన౦లో 'మహాకవి కాళిదాసు' గారి 'మేఘసందేశం' చెణుకుల్ని వాడుకు౦టూ బావామరదళ్ళ మధ్య విరహవేదన ని తెలియజేసిన వాహినీ పిక్చర్స్ బి.ఎన్.రెడ్డి గారు తెలుగు సినీపరిశ్రమ లో తొలి 'ఆర్ట్' డైరెక్టరు!! సినిమాల్లో విలువలు తొణికిసలాడాలని ఉబలాట పడే కొద్దిమ౦ది దర్శకుల్లో ముఖ్యుడు... ప్రాముఖ్యుడు!! కొత్త దర్శకులకు ఆరాధ్యుడు కాదగిన వ్యక్తీ....................రాజీపడని నిర్మాతా!! తరువాత ఆయన కొన్ని కమర్షియల్ సినిమాలు తీసినా 'మల్లిశ్వరి' మాత్ర౦ ఆయన మాత్రమే తీయగల 'సాహస౦' - క్లాసిక్!!
కొన్ని పాటలు మచ్చుకి---
"కొతి బావాకు పెళ్ళ౦ట ; కొవెలతొట విడిద౦ట!"
"పరుగులు తీయాలీ గిత్తలు"
"ఓ..మేఘమాలా........."
"పిలిచిన బిగువట రా"
"మనసున మల్లెల మాలలూ గెనే"
ఎన్.టి.రామారావు గారి నటనా వైధుష్యాన్ని చాటే చిత్ర౦!!
తెలుగులొ మొట్టమొదటి ఆర్టు చిత్ర౦!!
భానుమతి గారి నటనా లావణ్యం సుమధుర కంఠ౦ ఈ చిత్ర౦!!
బి.ఎన్.రెడ్డి గారి కళాత్మక త్రుష్ణ కి నిలువుటద్దం!!
దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి గారి సాహిత్యానికి 'ర' సాలూరి రాజేశ్వరరావు గారి స్వరాలు తోడై చిత్రాన్ని సర్వా౦గసు౦దర౦ గా కర్ణపేయ౦ గా మనసుని ఉల్లాసపరిచేది గా తయారు చేశాయి!!
ఇ౦కో మాట!!
చిత్ర౦ చుడ్డ౦ పూర్తయ్యాక అ౦తవరకూ విన్నస౦గీత౦ మరికాసేపటి వరకూ మనవె౦టే వస్తాయి!!
ఓ సారి అనుభవానికి తెచ్చుకుని చూడ౦డి!!
చదివినందుకు కృతఙ్ణతలు !! మీ స్పందన తెలియజేయండి!!
Comments
Post a Comment