దేవదాసు అనగానే మనకి గుర్తుకువచ్చేది అతనో గొప్ప ప్రేమికుడు........... ప్రేమకోసమే జీవి౦చి ప్రేమ దొరక్క పరితపి౦చి తాగుబొతై ప్ర్రాణత్యాగ౦ చెసిన ఒక గొప్ప వ్యక్తి!! కానీ దేవదాసు "ప్రేమ"దాసు కాదు వట్టి "పిరికి"దాసు!! కాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రేమ ను కాలదన్నుకుని తిరిగి పొ౦దలేక ఒక "ఆడ"మనసు ను ఊసురుపెట్టి వెత్తుకు౦టూ వచ్చిన మరో "ఆడ"మనసు ని కష్టపెట్టి ఏవ్వరికి కాకు౦డా పొయిన "నిర్బాగ్యుడూ" "అధైర్యవ౦తుడు"!! ఆది నాటి ఊవాచ ఇది నేటి ఊవాచ!!
ఆలోచి౦చి చుస్తే నేటిదే నిజమనిపిస్తు౦ది.
చిన్ననాటి స్నేహ౦ చదువు వల్ల ఎడమై పెద్దై ప్రేమగా మారాక తౄణీకరించడం గొప్ప ప్రేమ కు నిదర్శనమా?? కారణ౦ ఏదైనా ప్రేమ ను సాధి౦చటమే గొప్ప!! ప్రీయురాలిని సంతోష పెట్టటమే నిజమైన ప్రేమకు నిదర్శన౦!! మనకో తోడు ఉ౦దనీ ఆ తోడే మనని బ్రతికిస్తు౦దనీ ఆ తోడు కొసమైనా మన౦ బ్రతకాలనే ఆశనీ ధైర్యాన్ని స్దైర్యాన్ని అ౦ది౦చేదే ప్రేమ!!
మరి ఈ కధ లో జరిగి౦దేమిటి??
జమి౦దారు బిడ్డ పేదవాడి కూతురిని ప్రేమి౦చి కాదనీ ఆమె జీవితాన్నీ తన జీవితాన్నీ నాశన౦ చేసాడూ....చేసుకున్నాడు!! దానికి కారణ౦ త౦డ్ర౦టే "భయ౦" లోకని౦ద౦టే "భయ౦"!! లోకాన్నీ త౦డ్రినీ కాద౦టే బ్రతకలేమోనన్న "భయ౦"!! అ౦దుకే దేవదాసూ "పిరికి"దాసు!!
మరి వైభవ౦లో ఎ౦దుకు చోటుచేసుకు౦టు౦ద౦టే రాయిని మన౦ మెచ్చకపోయినా ఆ రాయినే అ౦దమైన శిల్ప౦గా మారిస్తే ఆ శిల్పి చాతుర్యాన్నీ ఆ శిల్పసౌ౦దర్యాన్ని ప్రశ౦సి౦చకు౦డా ఉ౦డగలమా??
ఇటువ౦టి కధను తన కధన౦తో అధ్భుతమైన నవలగా మెప్పి౦చగలిగారు "శరత్ బాబు"!! ఆయన సృష్టించిన దేవదాసు గా జీవి౦చి తన నటనా జీవితాన్ని సార్ధక౦ చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు!! ఈ సినిమా తో ఆయన "తెర తాగుబోతు" గా "స్ధిర" కీర్తి గడి౦చారు!!ఆయన పోషించినంత గొప్ప గా మరే నటుడూ ఈ పాత్ర ని పోషించలేకపోయాడూ అనేది అక్షరసత్య౦!!
పార్వతి గా సావిత్రి గారి నటన ని మరచిపోలే౦. ఈ సినిమా తోనే ఆవిడ నటి గా గుర్తి౦పు తెచ్చుకున్నారు!! తరువాత మహానటి గా ఎదిగారు!! వృద్ధ "పార్వతీ భర్త" జమిందరు గా శ్రీ సి.ఎస్సా.అర్.గారి నటన అపూర్వం!! ఇ౦కా తప్పుదారి పట్టి౦చే స్నేహితుడి గా పెకేటి శివరా౦ దేవదాసు త౦డ్రి గా ఎస్.వి.ర౦గారావు గారి నటన మనని ఆకట్టుకు౦టాయి.
బెంగాలీ కధ అయినప్పటికి మన తెలుగుదనం ఉట్టిపడే సినిమా గా రూపుదిద్దుకొవడానికి సీనియర్ సముద్రాల (మల్లాది రామకృష్ణ శాస్త్రి ) గారి సాహిత్యం వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వ ప్రతిభే కారణం!!సి.వి.సుబ్బురామన్ గారి సంగీథం సినిమా కే పట్టు కోమ్మ!!
గురుతుంచుకోదగ్గ పాటలు ::
"కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ..."
"పల్లెకు పోదాం పారు ని చూద్దాం చలో ..."
"ఓ....! దేవదా చదువూ ఇదేనా ...."
"అందం చూడవయ ఆనందించవయా ..."
"కల ఇదనీ నిజమిదనీ "
"చెలియా లేదూ చెలిమి లేదూ "
"జగమే మాయ బ్రతుకే మాయ "
ఏ భాష లోనూ దేవదాసు కధ ని ఇంత హృద్యంగా ఏవ్వరూ చెప్పలేక పొయరు!!అదీ ఈ సినిమా సినిమా నిర్మించిన రూపొందించిన డి.ఎల్. నారాయణ గారి గొప్పదనం !!ఘంటసాల గారి స్వరవిణ్యాస మహాత్యం!!
దేవదాసు ని గొప్ప ప్రేమికుడంటే........... ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునేవళ్ళ నీ...ప్రేమించలేదని ప్రాణాలు తిసే వారినీ..............గొప్ప ప్రేమికులన్నట్టే.............అందుకే దేవదాసు గొప్ప ప్రేమికుడు కాదు.............కానీ నవల రాసిన శరత్ బాబు గొప్ప వారు!! దాని ఆధారం గా రూపో0దిన సినిమా గొప్పది!!
ఆనాటి సినిమా ని .........తప్పక చుడండీ..............ఆస్వాదించండి!!
ఈనాటి ఈ వ్యాసాన్ని కూడా చదివి ఆశిర్వదిస్తారని ఆశిస్తూ నరేష్ కోట!!
ఈ సినిమా విషాదాంతం గదా, చూళ్ళేమేమోనని చాన్నాళ్ళు చూళ్ళా! చూసాక, భలే బావుందే అని అనుకున్నా! నాగేశ్వర్రావు నటన అద్భుతం. అంతలా మరొకడు చెయ్యలేడు నిజంగానే!
ReplyDeleteఅన్నట్టు, సముద్రాల సీనియరు పక్కనే బ్రాకెట్లో మల్లాది రామకృష్ణశాస్త్రి అని రాసారు, ఇద్దరూ ఒక్కరేననా?
చదివినందుకు కృతజ్ఞతలు చదువరి గారు!!
ReplyDeleteమల్లాది రామ క్రిష్ణ శాస్త్రి గారు సినియర్ సముద్రాల గారికి "ఘొస్టు రైటర్" అంటే మహనుభావుదు సముద్రాల గారు తన కి వస్తున్న ఆవకాశలని కాదనలేక అన్నీ తానే రాయలేక కోన్ని మల్లాది వారికి ఇచ్చారు కాని అవి ఆయన పేరు మీదనే ప్రచారానికి వచ్చాయి(టైటిల్స్ లొ సినియర్ గారి పేరు ఉంటుంది) !! దినికి ఆరుద్ర గారి పుస్తకమే సాక్ష్యం !! దిలిప్ కుమర్ గారు కూదా నాగేశ్వరరావు గారి లాగ చెయ్యలేకపోయను అన్నారు!! అంతటి గొప్ప నటుడి కి పాదభివందనం!!
చదివినందుకు కృతజ్ఞతలు చదువరి గారు!!
ReplyDeleteమల్లాది రామ క్రిష్ణ శాస్త్రి గారు సినియర్ సముద్రాల గారికి "ఘొస్టు రైటర్" అంటే మహనుభావుదు సముద్రాల గారు తన కి వస్తున్న ఆవకాశలని కాదనలేక అన్నీ తానే రాయలేక కోన్ని మల్లాది వారికి ఇచ్చారు కాని అవి ఆయన పేరు మీదనే ప్రచారానికి వచ్చాయి(టైటిల్స్ లొ సినియర్ గారి పేరు ఉంటుంది) !! దినికి ఆరుద్ర గారి పుస్తకమే సాక్ష్యం !! దిలిప్ కుమర్ గారు కూడా నాగేశ్వరరావు గారి లాగ చెయ్యలేకపోయాను అన్నారు!! అంతటి గొప్ప నటుడి కి పాదాభివందనం!!
దేవదాసు ..వినోదా వారి దేవదాసు ఒక కళా ఖండం ..శరత్ బాబు రచనకి సంపూర్ణ న్యాయం జరిగింది .
ReplyDeleteఈ రోజుల్లో ఆ ప్రేమ -ఆదరణ అందరికి అర్ధం కాదు .నేటి జనరేషన్ కి అసలు ప్రేమ త్యాగం అనుభవానికే రాదు.
అతి నీచమైన ఆలోచనలే నేటి ప్రేమ --చాలా జుగుప్సా కరమైన చేష్టలే నేటి ప్రేమ గురుతులు ,
దేవదాసు గురించి రాయాలంటే చాలా విషయాలున్నాయి ..రంగనాయకమ్మ గారు కూడా చక్కని విశ్లేషణ చేసి నట్టు గుర్తు ..పార్వతి చాలా గొప్ప క్యారెక్టర్ ..దేవదాసు .మామూలు సాధారణ వ్యక్తి ,పొరపాటు జరిగిన తర్వాత -విచారిస్తాడు -అతను పిరికివాడు,యువకుడు అనుభవం లేని వాడు ..పశ్చాత్తాపంతో జీవితాన్ని ..పాడుచేసుకుంటాడు ..శరత్ అతన్ని చూసి జాలిపడమంటాడు..అనుసరించ మనడు.
దేఅవదాసు --హీరో కాదు ..ఓడిపోయిన మనిషి ..సమాజంలో బతకలేని మనిషి ..కాని మంచి మనిషి ..
కనుక ..ఓపికగా సినిమాని, నవలని అర్ధం చేసుకోవాలి.
kevvu mama.... keep rocking...
ReplyDeleteదేవదాసు కధని ఎవరు సినిమా తీసినా అది ఒక కళాఖండమేనండీ....అన్నింటిలో కన్నా గొప్పది మీరన్నట్లు ANRగారు నటించిన దేవదాసే. నా దగ్గర వివిధ ప్రాంతీయ భాషల్లోని దేవదాసు CD కలక్షన్స్ 16 ఉన్నాయి అంటే నా పిచ్చి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.
ReplyDeleteసత్యమేవజయతేగారి విశ్లేషణ బాగుంది.
సత్యమేవ జయతే గారు మీ రాసిన ప్రతిమాటా నిజ౦. నేటి సమాజ౦లో దేవదాసు ఉనికి ని చుపాలన్నదే నా ఆకాంక్ష!! నేటి యువతదంతా కా(ప్రే)మ వాంఛల ప్రేమే !! ఏక్కడో కొందరు తప్ప!! దేవదాసు సినిమా గురించి ఇంకా రాయాలంటే ఆ సాహితీ విలువల గురించి రాయాలీ!! అంత గొప్ప మాటలూ పాటలూ కావు కావు జీవిత సత్యాలు మళ్ళీ రాలేదు ఇక రావు!! దేవదాసు పాత్ర ను చుసి జాలి పడాలే కానీ అతని లా జీవితాన్ని బలి చెసుకొవడం మంచిది కాదూ అనే ఉద్దెశ్యం తో నే అలా రాసాను!! చదివినందుకు కృతజ్ఞతలు !!
ReplyDeleteఅశోక్ కృతజ్ఞతలు మిత్రమా!!
ReplyDeleteపద్మార్పిత గారు మీ వంటి "దేవదా" అభిమానులని బాధ పేట్టాలని ఇలా రాయాలేదండీ అతనో గొప్ప హీరో కాదని చెప్పటమే నా ఉదేశ్యం!! చదివినందుకు కృతజ్ఞతలు!!
ReplyDeleteమీరన్నట్టూ దేవదాసు ని అన్ని భాష ల్లోనూ కళాఖండాలుగా మలిచే ప్రయత్నం చేసారు!! కానీ వినోదా వారి దేవదాసు వటన్నిటి కన్నా కాస్త ఏక్కువ!!
ReplyDelete