ఆ రోజు............ఆ రోజు............ నా రోజు.!! తనని అప్పటి వరకూ ఎన్నిసార్లు చూసినా మామూలు గానే అనిపించింది. కానీ ఆ రోజు మాత్రం తను నా(కు) కంటికి దేవకన్య, శిల్పులకు అప్సరకాంత, కవులకు కావ్యకన్యక, విశ్వనాధుని కి కిన్నెరసాని, న౦డూరి వారికి ఎంకి, బాపు గారికి తన కుంచె గీసిన అందాల గీత.......అనిపించింది. ఇక నాకు తనే.....తనకు నేనే....తనూ నేనే.!!
కాలేజ్ లో అందరికన్నా సినీయర్ ని అయ్యుండీ, పదో తరగతి రెండు సార్లు, ఇంటర్ మూడు సార్లు, డిగ్రీ ఐదో ఏడాది చదువుతున్నా ఒక్క అమ్మాయీ నా వంక చూడటం లేదని బాధపడ్డాను. ప్రతి ....ఊ......కి ఒక రోజు వస్తుంది అన్నట్టు నా రోజు కోసం ఎదురుచూశాను. ఇద్దరి తో స్నేహం పునాది మీద ప్రేమసౌధం నిర్మిదామనుకుంటే అది నన్ను వారికి అన్నని చేసి వారి ఇంటి.......ఆ!..ఆ!....నిర్మాత ని చేసింది.
( నరేష్ కోట:: మొత్తానికి ఇద్దరిని ప్రేమించబోయి వారికి పెళ్ళి చేశానాంటావ్!! భాష కన్నా భావం ముఖ్యం!!)
అదేలే......రిధమిక్ గా చెప్తూ అలా అన్నా. మరీ ఉన్నది ఉన్నట్టు చేప్తే కిక్ ఎముంటుందీ..!!
ఆ రోజు..... నా పెళ్ళిచూపులు. తను మా అపార్ట్ మెంట్స్ లోనే ఉంటుంది. ముందు చెప్పినట్టు చాలాసార్లు చూసుకున్నాం కూడా!! కానీ ఆ చూపులు కలసిన శుభవేళ మాత్రం మా ఇద్దరి లో ప్రేమ చిగురించింది. అప్పటి వరకూ ఒకరి గురించి ఒకరం ఎమనుకున్నా ఆ రోజు నుంచీ ఒకరి కోసం ఒకరం అనుకున్నాం! తను కూడా నాలాగా చదువుల్లో ’సరస్వతి’, ఆటల్లో అరటిపండు,ఫ్రెండ్స్ కి ఉప్మాలో కరివేపాకు!!
( నరేష్ కోట:: ఉపమానాలాపి కధ తేల్చరా!!)
అంతేలే నాలాంటి మంచి ’ఎజ్డ్ పర్సన్’ ని చూస్తే మీలాంటి వాళ్లకి అలుసే!! ఎదో చెప్పుకుంటుంటే చెప్పుకోనివచ్చు గా.........!!
( నరేష్ కోట:: అది కాదురా!! మళ్ళీ మొదటికొచ్చావ్ అందుకనీ......)
సర్లే....పెళ్ళిచూపుల నుంచీ నిశ్చితార్ధం వరకూ ఫోను కాల్లూ, sms సందేశాలే మాకు గతి. కలుసుకోవడానికి వీల్లేదు అన్నారు!! వాళ్ల ఆంక్షలు వింటుంటే నాకు ఒళ్లు మండిపోయేది. ఫోను లొ మాట్లాడినా పొద్దున్నే అందరూ ఉన్నప్పుడే మాట్లాడాలీ!! sms లు పంపిస్తే అవి అందరూ చదివేవారు. ఇక రోజు క్లాసులే!! నిశ్చితార్ధం రోజు వీళ్ళ తిక్కకుదర్చాలని కట్నం అడిగేశా!!
( నరేష్ కోట:: ఇచ్చారేటీ........!!)
హలో..........నేను నీలా కాదమ్మా!! ఉళ్లో పోలాలు, నాన్న వ్యాపారం, నా వ్యాపారం, తాత ఇల్లు అన్నీ ఉన్నాయి!! అందుకే చదువు అబ్బక పోయినా మావాళ్ళు ఏమీ అనలేదు!! ఎజ్ వచ్చిందని లాస్ట్ ఇయర్ చదువు మాన్పించేసి పెళ్ళి చేసారు!! తనకూ అంతే!!
( నరేష్ కోట:: తన విషయం లో ఒ.కె. కానీ నీ విషయం లో నే.......)
అలా కట్నం కింద .................... అడిగాను!!
గోవిందం భార్య:: ఏమయ్యా!! నీకు అర్ధం కాదా!! [మొన్న] చెప్పాను వీడి తో తిరక్కు అనీ..!! వాత కూడా పెట్టబోయాను!! అయినా నువ్వు మార వా..!! పద... ఇంటికి.... పద.......నాకు బాగా ఆకలి గా ఉంది లే..!!
వస్తానండీ...............మళ్ళీ................ అబ్బ లాక్కే....... వస్తున్నాగా...!!
( నరేష్ కోట:: అలా గోవిందం మరోసారి ఇంటికి "లాక్కేళ్ళ బడ్డాడు")

Comments
Post a Comment