లోకం నేర్పాల్సిన తండ్రిని నిన్ను చీకట్లో పెంచాను
విధి నన్ను తయారుచేస్తే నేను నిన్ను తయారుచేయాలనుకున్నాను
యాభై ఏళ్లకు నేను ఇంతవాడినైతే నువ్వు ఇరవైయ్యేళ్లకే నా అంతవాడివి కావాలనుకున్నాను!!
నువ్వు నన్ను ప్రతి విషయంలో మించాలనుకున్నాను
అందరు నన్ను నీ తండ్రీ అని గౌరవిస్తూంటే పోంగిపోదామనుకున్నాను
కానీ ఇవాళ ఇంత జరిగాక నా తప్పు తేలుసుకున్నాను!!
అవును!! విధితో నిన్ను ఆడనివ్వాలి, ఓడనివ్వాలి, పోరాడనివ్వాలి, గెలవనివ్వాలి, ఎదగనివ్వాలి!!
అన్నీ నా కళ్లల్లోంచే చూడనివ్వాల్సింది కాదు!!
అంతా నువ్వు ఎరిగినట్టే ఉంటుందని మభ్యపెట్టాల్సింది కాదు!!
తప్పే..........నువ్వంటూ ఒకడివి ఎదగాలనీ
నీకంటూ ఒక మనస్తత్వం ఉండాలనీ
నీదంటూ ఒక పంధా ఎర్పర్చుకోవాలనీ
నేర్పలేదు.............నాది నిజంగా తప్పే!!
నా కఠినత్వం తప్పే
నా స్వార్ధం తప్పే
నా అమాయకత్వం తప్పే
నీ ఆనందాన్ని హరించడం తప్పే
ఆకాశహార్మ్యంలా ఎదిగిన నిన్ను చూడాలనుకున్నాను...
కానీ.....ఇలా గోడ మీద చిన్న బొమ్మలా చూస్తూన్నాను!!
నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాగా.......
నీ రంపపుకోతని అర్ధం చేసుకున్నాగా......
ఒక పాఠం నేర్చుకున్నాగా.....
ఒక్కసారి నా తో మాటలాడు నాన్నా......
తండ్రంటే అంత అసహ్యమేందుకు.........
ఇంత శిక్ష అనుభవించలేకపోతున్నారా.........
నన్ను క్షమించు కన్నా......................

మీ కవిత (?) మనసును తాకిందండీ ...
ReplyDeleteచాలామంది ఉలిక్కిపడి తరచి తమను తాము చూసుకునేలా ఉంది .
Simply superb Naresh garu.... chaalaa kaalam taruvatha gunde lothulni taakindi.... Keep it up...
ReplyDeleteబావుంది... కాబోయే తండ్రులకు కనువిప్పుగా...
ReplyDeleteతండ్రులే కాదు తల్లులు కూడా తల్లడిల్లేలా ఉంది మీ కవిత!
ReplyDeleteకామెంట్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు!!
ReplyDelete