౪. అద్భుత రసం:: ఆశ్చర్యచకితుల్ని చేయడం!!
అద్భుత రసం అంటే కేవలం ఒక మాయాజాలం ప్రదర్శించటం కాదు!! ఒక పి.సి.సర్కార్ షో లాగా నిజమా? మాయా? అనిపించే విధంగా ఉండనవసరం లేదు.. జనం లో అద్భుతమనే భావనని మిగల్చగలిగితే చాలు. ప్రకృతిని అందంగా కెమెరా లో బంధించటం దగ్గర నుంచీ మనసుని తాకే గ్రాఫిక్ వరకూ అంతా అద్భుతమే!!
మన సినిమాల్లో ముందు నుంచీ ఈ రసాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు....ఒక్క సినిమాలో అని కాదు అన్ని సినిమాల్లోనూ అంతే.........కధనంలో రావల్సిన అన్ని మలుపులూ అయిపోయి ఇక చివరి ఘట్టం మొదలౌతుంది. విలన్ ఎవరూ ఛేదించలేనంత ప్యూహాన్ని పన్నుతాడు......హీరో రెండు మైళ్ల దూరం నుంచీ పరిగెత్తుకు వచ్చి సమయం మించనివ్వకుండా ఛేదిస్తాడు ........ డూపుల సహాయంతో ...ఈ మధ్య వైర్ల సహాయంతో....!! మనకి అద్భుతమైన సినిమాని చూసాం అనే నిజమైన ఆనందాన్ని, తృప్తిని మిగిల్చేవి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు. మాయాబజార్ లో అంతా మాయే ..... కృష్ణ మాయ, పింగళి కలం మాయ, కె.వి.రెడ్డి దర్శకత్వ మాయ, మార్కస్ బారట్లే కెమెరా మాయ, అన్నింటికీ మించి నటీనటుల మాయ, ఘటోత్కచ మాయ అబ్బ...అంతా వివాహ భోజనమ్మే కదండి!!
పాతాళభైరవి లో నేపాళమాంత్రికుడో అద్భుతం.........కధనంలో ఇమిడిపోతాయి అతని మాయలు. అప్పటి వాళ్లకి అవన్ని వింతలే.. ఇప్పటికీ ఆ సినిమా వింతే. కేవలం అద్భుతరసాన్ని ఆశ్రయించి ప్రేక్షకుల్ని మభ్యపేట్టడం కష్టం. కధ, కధనాల్లో వాటికి తగిన చోటు తప్పకుండా ఉండాలి. గ్రాఫిక్ జాలం తప్ప కధని నమ్మని ఎన్నో సినిమాలు ఈ మధ్య చతికిల పడ్డాయి! అలాగే కాస్త కధ కలిసిన అరుంధతి, అమ్మోరు, మగధీర ఆడాయి. పది పాత్రల అద్భుతంగా మాత్రమే మిగిలిపోయిన దశావతారం సినిమా కధలో పట్టు ఉంటే గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయేది. విఠలాచార్య గారి విజయరహస్యం అద్భుతరసం పాతాళ భైరవి కధనం.....అటు ఇటు మార్చి ప్రదర్శిస్తే కొత్త సినిమా. కొత్త రకం కధలతో ఈ రసం ఇంకా ప్రేక్షకుల్ని ఆనందపరచాలి.
౫. భయానక రసం:: భయాన్ని కలిగించటం, ప్రదర్శించటం!!
ఈ మధ్య రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తోంటే ఇదే కలుగుతోంది. ఆయన తీసిన ఆగ్, ఫూంక్, అగ్యాత్, కాంట్రాక్ట్ వంటి సినిమాల పేర్లు తలుచుకుంటే ఈ రసాన్ని అస్వాదిస్తున్నాం. ఆయన సినిమాల్లో నిజంగా భయం పండిందంటే అది భూత్ సినిమాలోనే.
Alfred Hitchcock సినిమాలు సరైన ఉదాహరణలు ఈ రసం ఎంత ప్రభావంతమో తెలపడానికి. భయానికి సస్పెస్ మూలం. కధలో లినమైయ్యేలా చేయ్యడం ముఖ్యం.....అలాగే దానికో అర్ధం ఉండటం అవసరం. ఇవన్నీ మనకి ఆయన సినిమాల్లో కనబడతాయి!! Pshyco ఆయన తీసిన సినిమాల్లో ఉత్తమమైనదని చెబుతుంటారు. అన్ని నేను చూడలేదు. ఇక మన సినిమాల విషయానికి వస్తే మనవి భయపేట్టే కధలు కావు.....కమర్షియల్ వంటకాలు. ఇప్పుడిప్పుడే మొదలౌతున్నాయి. వాటికి మన దగ్గర ఆద్యుడు అని చెప్పుకోవలసింది రాంగోపాల్ వర్మనే!!
భయం ఎఫేక్టలలో ఉండదు. దురంగా పోతున్న వింత ఆకృతుల్ని చూపించడంలో లేదు. అదో మానసిక భావన అన్ని తేలినినా కూడా మనం ఆ సమయంలో భయపడోచ్చు. సినిమాల్లో ఆ సంధర్భం అందరూ ఒప్పుకునేదిగా ఉండాలి. అక్కడ మనం ఉన్నాం అనిపించాలి. అందుకే మన దగ్గర భయపేట్టేవన్నీ దయ్యం కధలే...ఎవో కొన్ని తప్ప.
జగ్గయ్య గారు హీరో గా నటించిన ఆమె ఎవరు?, అలాగే కృష్ణ హీరో గా నటించిన అవేకళ్లు సినిమాలు మనకి అరుదుగా వచ్చిన భయపేట్టే సినిమాలు. ఆ కాలానికి అవేకళ్లు మరి. ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు తీస్తూన్న ఇంగ్లీషు "ఇస్పిరేషన్" సినిమాలు విజయం సాధించి ఇటువంటి సినిమాల్ని ఇంకా పేంపొందిస్తున్నాయి. మన సినిమాల్లోని "మధ్య"కాలం అనగా కమర్షియల్ సినిమాలు తప్ప మామూలువి రాని రోజుల్లో యండమూరి వీరేంద్రనాధ్ నవల తులసీదళం కాష్మొరా సినిమా వచ్చింది. రాజేంద్రప్రసాద్ ఖాద్రా గా నటించాడు. ఇది మూఢనమ్మకాల్ని ఆశ్రయించుకున్న భయం.
మరిన్ని రసాలూ-సినిమాలూ వచ్చే వ్యాసంలో..........ప్లీజ్........డోంట్ మిస్!!
Comments
Post a Comment