పెళ్ళిచూపులప్పుడు,
మన కొనచూపులు కలసిన................. ఆ తొలిక్షణం
నువ్వు నాదానివైపోవాలనిపించిన........ఆ క్షణం
అద్దం, నాలో నిన్నే చూపించి
మురిపించిన.................ఆ క్షణం
మదినది లో, పోంగే భావనలన్నీ అక్షరరూపంలో
పోందుపర్చి నీకు చూపించిన....................ఆ క్షణం
నిశ్చితార్ధం రోజు, ఉంగరాలు మారిన.................ఆ క్షణం
నీ ముఖమంతా సిగ్గుపువ్వులు విరిసిన.........ఆ క్షణం
నీ మెడలో తాళి కట్టిన.............ఆ క్షణం
నీ చేతిని నా చేతిలో పెట్టిన...... ఆ క్షణం
ఇక ఒకరికొకరం అనుకున్న.....ఆ క్షణం
నాతో జీవితం గడపాలని నువ్వు ఇల్లు దాటిన............ఆ క్షణం
తల్లిదండ్రులను వదలలేక నీ కంటిముత్యాలు రాలిన.......ఆ క్షణం
నీతో నేను అబద్ధమాడిన............ఆ క్షణం
నీ బుంగమూతి కోరికలన్నీ నేను తీర్చిన.........ఆ క్షణం
నన్ను పూర్తిగా నీ వాడిని చేసుకున్న.............ఆ క్షణం
మనమల్లుకున్న పందిరికి తొలి పూవు పుసిన.............ఆ క్షణం
నువ్వు నాకు దక్కుతావో లేదోనని నేను కంగారుపడిన..........ఆ ప్రతీక్షణం
మన కంటి పాపలు పెద్దవై, మనకి దూరంగా ఉంటున్న.....ఈ క్షణం
..................ఈ గూటిగువ్వలకి మిగిలింది ఆ క్షణాలే నేస్తం..........................

అద్భుతంగా ఉందండీ.! ఒకరికొకరు తోడూ నీడై సాగించే ఈ జీవన ప్రయాణాన్ని చాలా అందంగా చెప్పారు. జీవితమంటే.. అలాంటి కొన్ని క్షణాలే కదూ.!
ReplyDelete@మధురవాణి గారు:: అంతే కదండీ.......జీవితం క్షణబంగురం!! ప్రతి క్షణం గడిచిపోతూ ఉంటే మనం గుర్తుపేట్టుకోగలిగేవి కొన్ని క్షణాలే కదండీ........ఆ గుర్తులే మనకి మరణం వరకూ తోడుంటాయి!!
ReplyDeleteధన్యవాదాలు!!
మధురమైన క్షణాలు....భలే చెప్పారు.
ReplyDeleteక్షణాల్లో జీవితం గురించి చక్కగా చెప్పారు.
ReplyDeleteసృజన గారికీ, పద్మార్పిత గారికీ ధన్యవాదాలు!!
ReplyDelete