మొదటి భాగం
స్కూలు రోజుల్లో అంతా భారీతనమే!! అసలు ఆ గ్రౌండ్ అది తెలుచుకుంటుంటే ఒళ్ళు గగురుపోడుస్తుంది!! అప్పటి తో పోల్చుకుంటే కనీసం స్విమింగ్ పూలు అంత కూడా ఉండనీ కాలేజిల్లో ఇంటర్, డిగ్రీ చదివాను!! ఆ గ్రౌండ్ లో సిక్స్ కొట్టాలంటే కష్టమైపోయేది!! సచిన్, ధోని లకి ఈజి నేమో!! గ్రౌండ్ మధ్యలో జెండా ఎగురుతుంటే ఒక కార్నర్ లో కూర్చుని చూడటమే అద్భుతంగా ఉంటుంది!! ఆ తరువాత డాన్స్ కాంపిటిషన్స్, పరుగు పందెలు, మంచి స్కిట్స్, గెలిచిన వాళ్ళకి ప్రైజులు!! అబ్బ... ఆ రోజులు.... ఆ రోజులే మళ్ళీ రావు.....రాలేవు!!
రాంబాబు సార్.... గుర్తున్నాడా.....మన డ్రాయింగ్ సార్.....ఎప్పుడూ స్కిట్స్ వేస్తుండే వాడూ..... అప్పుడు నువ్వు నాలుగొవ తరగతి అనుకుంటా నేను పది చదువుతున్నా లే..!!
(నరేష్ కోట:: ఆయన నా పదొవ తరగతికి కూడా అక్కడే ఉన్నారు!!)
ఆ..!! ఆయన సి.ఐ.డి. అనే స్కిట్ లో నన్ను హీరో గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ బ్రిజ్ గోపాల్ గాడి వల్ల నాకు అనుకున్నది వాడి కోడుక్కి పోయింది. వెధవకి నేనంటే ఎప్పుడూ కోపమే!! అందరికీ అడగ్గానే ఒక్కమార్కైనా పెంచేవాడు!! కానీ నాకు మాత్రం ఒక మార్కు తగ్గిస్తాననేవాడు!! అసలే పాస్ మార్కులు కన్నా ఎక్కువ వచ్చేవి కాదు!! మిగతా వాళ్ళు పోనిలే పాపం అని ఒ రెండుమూడు మార్కులన్నా ఎక్కువ వేసేవారు!! వీడు మాత్రం ఒక్కసారి కూడా వేసిన పాపనాపోలేదు. రాంబాబు సార్ నా మీద జాలి పడి రాజు క్యారెక్టర్ వేయ్యాల్సిన నాకు రాజు పక్కన ...... అదే......వి మీద ఏదో వస్తుంది.......ఆ..!! వింజామర.... విసిరే క్యారెక్టర్ ఇచ్చారు!!
(నరేష్ కోట:: ఇలాంటివి ఎక్కువగా ఆడవాళ్ళకి ఇస్తారు కదా.... నీకివ్వడమేంటి.....నిజం చెప్పు..)
స్కూల్ లో ఇలాంటి వన్నీ ఎవరు పట్టించుకుంటారు!! ఏదో నా ఎడుపు మోహం చూడలేక ఆ క్యారెక్టర్ ఇచ్చారు అనుకున్నా తరువాత తెలిసింది వాళ్ళబ్బాయి కి నా చేత సేవలు చేయించాలనుకున్నాడు ఆ బ్రిజ్ గోపాల్ !!
నా మీద అంత కోపం ఎందుకంటే...... వాళ్ళ ఫ్యామిలి మా అపార్ట్ మెంట్స్ లో నే ఉండేవారు!! నాకూ వాడి కోడుకు నానికీ ఒక్క నిముషం పడేది కాదు!! ఆ నాని గాడికి అన్నింట్లో నా తో పోటి నే............ వాడూ నేనూ ఒక్కటే క్లాసు నేనేంత చదువుతానో వాడూ అంతే!! మిగతా సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ నాకు వాడి కన్నా ఎక్కువ వస్తున్నాయనే కుళ్లు తో ఆ గోపాల్ కి చెప్పి నాకు మార్కులు తగ్గించి సంబరపడిపోయేవాడు!! కానీ ఆటల్లో నేను వాడిని ఒడించేవాడిని!!
రన్నింగ్ రేసు లో నేను లాస్ట్ నుంచీ ఫస్ట్ వస్తే వాడు సేకండ్!! క్రికెట్ లో నేను ఫస్టు బాల్ కి అవుటైతే వాడు ఓ పది బాళ్లు తిని ఔటయ్యేవాడు!! ఆడలేనప్పుడూ ఫస్టు బాల్ కి ఔటవ్వటమే మంచిది!!
ఈ గోపాల్ వల్ల నాకు ఇంగ్లీష్ అంటేనే విరక్తి పుట్టింది. అందుకే టెన్త్ రెండుసార్లు చదివాను. రెండొసారి ఇంట్లో వాళ్లు బాదేసరికి అలా అలా పూర్తి చేసాను!! ఏ మాట కా మాటే చెప్పుకోవాలి కోడుకు స్కూలు దాటాక నన్ను అస్సలు పట్టించుకోలేదు గోపాల్!! ఇలా నాకు ప్రతి ఎగ్జామ్ రెండుసార్లన్నా రాయటం అలవాటయ్యింది!! ఇప్పుడు గుర్తుకోస్తోంది..... హరీష్ అనీ మన డాన్స్ మాస్టర్ లేడూ... ఆయన్ని నేను ఒక్కసారైనా స్వాతంత్రదినొత్సవం రోజు ప్రైజు తీసుకోవ్వాలనుకుంటున్నాను డాన్స్ నేర్పించండి అంటే కాళ్ళ మీదా నడుం మీదా కొట్టి కొట్టి హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా చేసాడు..............
(నరేష్ కోట:: ఉరేయ్ చిన్ననాటి జ్ఞాపకాలు అంటే సార్ల్ ని తిట్టడం కాదు!! ఎదైనా మంచి విషయం చెప్పుకోవాలి రా..!!
అసలు పదవ తరగతి చదివేటప్పుడు ఎవడూ చిన్నవాడు కాదు!! ఇక నాకు వినే ఓపిక లేదు.......తరువాత చెప్పుకో.......)
నువ్వు కూడా మీ వదిన లాగే తయారైపోతున్నావ్.... నా మీద సెటైర్లు వేస్తూ నా నోరూ నొక్కేస్తున్నావ్...... నేనొప్పుకోనూ... నాకు న్యాయం జరగటం కోసం వాకౌట్ చేస్తున్నా...!!
(నరేష్ కోట:: అలా రెండొవ భాగం కూడా పెద్ద(చిన్న)నాటి జ్ఞాపకాల తో నింపి వాకౌట్ చేసాడు గోవిందం!!)
ఇప్పటి వరకు గోవిందం స్వ’గతం':: కట్నమడిగినందుకూ..........!!,నాకంటూ ఆ రోజు.....!!,నా జీవిత౦ లో ప్రతిరోజు

Comments
Post a Comment