పెళ్ళి చేసుకుని శుభ్రం గా ఉండొచ్చు కదా!! ఊ.....!.... తిక్క....". ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా....." అన్నట్టు [కట్నమడిగినందుకు] నాకు తగిన శాస్తే జరిగింది. నిశ్చితార్ధం రోజు కట్నమడిగిన నన్ను మా మామగారు వాళ్లు నీకు పిల్లనివ్వటమే ఎక్కువ మళ్ళీ కట్నం కూడా నా అన్నట్టు చూశారు!! అమ్మానాన్నలు కూడా తిట్టారు. చెవి నచ్చచెప్ప చూశారు!! నేను విన్లా!!
అందరి ముందూ గోడవ ఇష్టం లేక నా పేరు మీద ఒక ఎకరం, వాళ్ల అమ్మాయి పేరు మీద పదహేను ఎకరాలు రాసి ఇదే కట్నమనుకోమన్నారు!! అప్పుడు గర్వంగా తన వంక చూశాను.......... కళ్ళ ల్లో నీళ్ళు తీరుగుతున్నాయి తనకి..!! అప్పుడర్ధమయ్యింది నేనేంత తప్పు చేశానో.........ఇప్పుడు తెలిసోస్తోంది తను ఎంత బాధపడిందో!!
ఆరు నెలలు బానే ఉంది.తరువాత మొదలైయ్యింది అసలు సిసలు పండుగ. నేను ఏది చేసినా తప్పే...ఎంత తెచ్చినా చాలదు!!
పదివేలు ఫ్రీజ్జు తేస్తే..... పదిహేను వేలది కావాలి!! 29 ఇంచుల టి.వి. తేస్తే .... ప్లాస్మా కావాలి!! జిమ్ పెట్టుకోవడానికి ఫ్లాటు చాలటం లేదు డాబా కొనమంటుంది. ఇక నగల విషయం లో...........
తన నక్లెసు లో కన్నా పక్కింటి ఆంటీ నక్లెసు లోనే డైమెండ్స్ ఎక్కువ. తన పూసలదండ లో కన్నా ఎదురింటి మీనా పూసలదండ నల్లది. అందమైంది.
ఇలా ఒక్కటేమిటి బొట్టు బిళ్ళ, చంద్రహారం, సోమవారం, నా మోహం ... అన్నీ మిగతా అపార్ట్ మెంట్స్ లో వాళ్ల వే గొప్ప వీ. మంచివీ. ఉండాల్సినవీ.
(నరేష్ కోట :: బాబోయ్........!!)
అంతేనా................శాడిజానికి పరాకాష్ఠేంటంటే..... పరుపు లో మెత్తదనం తగ్గినా, సోఫా లో కుషన్ దగ్గినా నా తప్పే............ఇవి సరే..... ఎంత బాగా వండి నా కుర లో ఉప్పు తక్కువే....... అన్నం లో నీళ్ళెక్కువే...!!
(నరేష్ కోట :: ఆపరా బాబు...........ఇంక నేను వినలేను............అమ్మో..... ఇప్పటికే చాలామంది ఆడవాళ్లు ఫీలై ఉండొచ్చు!!)
ఇందులో తన తప్పుందని నేను అనడం లేదు గా!! అంతా నా అపరాధమే!! పెళ్ళి చూపుల తరువాత ఇద్దరం ఫోను ల్లో మాటలాడుకునే వాళ్ళమని చెప్పాను కదా!! అప్పుడు నేను ఎవరికి తేలినివ్వకుండా పదిసార్లు ఐ లవ్ య్యూ అంటే తను పదకోండు సార్లు చేప్పేది. అప్పట్లో అనుకున్నా నేను రూపాయి ఇస్తే తను రూపాయి పావలా ఇస్తుందీ అని. కానీ ఇప్పుడు రూపాయిన్నర ఇచ్చిన పావలా లానే చూస్తోంది. అప్పుడు నా ముందు, వేనుకా తన ఫ్రెండ్స్ నా గురించి ఎమన్నా వాగితే వాళ్లని తిట్టేది. సరదా కన్నా సరే..! ఇప్పుడో వాళ్ల తో నా గురించి నా ముందే జోక్స్ వేస్తోంది. ఇదంతా నేను కట్నమడిగిన "పుణ్యఫలమే"!! నన్ను అంతగా ప్రేమించింది కనుక నే తనని చేసుకునేందుకు కట్నమడిగానని ఇలా సాధిస్తోంది. అంతా నా తప్పే..!!
(నరేష్ కోట :: నువ్వు ఆ పని చేయ్యకుండా ఉండాల్సింది!!)
ఆ..! ఇప్పుడ లాగే ఉంటుంది. అప్పట్లో వాళ్లు పెట్టిన కండిషన్స్ వింటుంటే ఒళ్లు మండిపోయింది. వాళ్లని ఏడిపించాలని ఆ పని చేస్తే చివరికి అది నన్ను ఏడిపిస్తోంది. తనకి సంతోషం కలిగిస్తే తిట్లు...... బాధ కలిగిస్తే శాపనార్ధ రాగాలు!!
(నరేష్ కోట :: ఉరేయ్..!! మరీ ఎక్కువ చేయ్యకు ... అంతగా ప్రేమించినామె నిన్ను ఇంత టార్చర్ ఎందుకు పెడుతుంది?!!)
నిజం రా నాయనా!! కావాలంటే [ఇక్కడ చూడూ......] అందులో నా భార్యకు నా మీద ప్రేమ ఎక్కువ అనే అన్నాను!! నువ్వే......!! అయినా నిజం నిజమే!! తనకి నేనంటే ఇష్టం లేకపోతే నా కోసం ఎందుకు పరిగెత్తుకొస్తుంది. నేను టైమ్ కి ఇంటికి రాకపోతే కంగారు పడుతుంది. అనలు తను మీ ఇంటికి వచ్చేది కూడా అందుకే. తనకి నేను కనబడకపోతే తొచదు!! కనబడ్డాక తిట్టకపోతే తొచదు!! ఎం చేస్తాం.... ఖర్మ..........!!
తప్పు చేశాం...........ఇక శిక్షా కాలం ఎప్పుడు పూర్తవుతుందో.........!!
(నరేష్ కోట :: అన్నాయ్...... వదిన వచ్చేసింది.. గేటు దగ్గరుంది.!!)
వస్తాను రా తమ్మి.... మళ్ళీ కలుద్దాం............!! "ఇక్కడి దాకా ఎందుకూ రావడం..... నేనొస్తున్నా గా!!"
(నరేష్ కోట :: ఈ విధంగా గోవిందం స్వ’గతం’ మరో మలుపు తిరిగింది).

Comments
Post a Comment