దక్షిణ ఆఫ్రికా, సెంచూరియన్ మైదానంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ తన తోలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడుతోంది. పదహారు నెలల తరువాత దాయాదులు, చిరకాల ప్రత్యర్ధులు అయిన ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ సంగ్రామమిది. క్రికెట్ ప్రియులకు విందు భోజనం లాంటి ఈ సమరం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.
పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ గాయపడ్డ యువరాజ్ సింగ్ స్ధానంలో విరాట్ కోహ్లిని టీమ్ లోకి తీసుకుంది. పాకిస్తాన్ మిస్బావుల్ హక్ ను పక్కన పెట్టి గాయపడ్డా ఆడడానికి సిద్ధపడ్డ తమ కెప్టెన్ యూనిస్ ఖాన్ ను తీసుకుంది. ఇది ఈ పిచ్ మీద వరుసగా మూడో మ్యాచ్. చాలా నెమ్మదిగా ఉంటూ బంతి బాగా స్పిన్ అవుతుందని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. మొదట టాస్ గెలవడమే ఉత్తమమననీ, బ్యాటింగ్ ఎంచుకుని మంచి స్కోరు చేసి ప్రత్యర్ధి టీమ్ మీద అధిపత్యం చేలాయించ వచ్చని తెలిపారు. మరి టాస్ ఓడిపోయి ఇద్దరు ముఖ్యులు లేకుండా ఆడుతోంది. ఎమి చేస్తుందో చూద్దాం.....
పాకిస్ధాన్ ఇన్నింగ్స్ లో కష్టకాలం::
ఇమ్రాన్ నజీర్, కమ్రాన్ అక్మల్ ఇద్దరు ఇన్నింగ్స్ ను ధాటిగా మొదలు పెట్టారు. భారత బౌలర్లలో రుద్ర ప్రతాప్ సింగ్ రెండు ఒవర్లలో ఇరవై రెండు పరుగులు సమర్పించాడు. అతని వల్ల కేవలం ఏడు ఒవర్లలోనే ఒక వికెట్టు నష్టానికి యాభై పరుగులు చేసింది. ఇమ్రాన్ నజీర్ ఇరవై తోమ్మిది పరుగుల వద్ద నెహ్రా బౌలింగ్ లో హర్బజన్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తోమ్మిదో ఓవరులో కమ్రాన్ అక్మల్ ఔటవ్వడం తో పాకిస్ధాన్ కు కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ యూనిస్ ఖాన్ కూడా త్వరగా ఔటవ్వడంతో అరవై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాకిస్ధాన్ కష్టాలలో పడింది.
రికార్డు భాగస్వామ్యం::
ఈ దశలో జోడీ కట్టిన షోయబ్ మాలిక్, మహ్మాద్ యూసుఫ్ రికార్డు స్ధాయిలో రెండు వందల పదమూడు పరుగులు జోడించి పాకిస్ధాన్ ను కష్టాల నుంచీ భయటపడేసి గెలిచేందుకు వీలున్న స్కోరును సాధించారు. షోయబ్ మాలిక్ సెంచరీ సాధించాడు. సంవత్సరం క్రితం భారత్ మీద సాధించిన సెంచరీ తరువాత ఇదే అతని మలి సెంచరీ. దీనితో అతను తన కేరిర్ లో ఏడు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. మహ్మాద్ యూసుఫ్ భారత్ పైన ఎప్పటిలానే మరోసారి రాణించాడు. నెహ్రా బౌలింగ్ లో యూసుఫ్ ఔటవ్వడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
చివరలో కుప్పకూలిన పాకిస్ధాన్::
రికార్డు భాగస్వామ్యం ముగిసిన తరువాత వచ్చిన పాకిస్ధాన్ బ్యాట్ మెన్ అందరూ భారీ షాట్లకు పోయి ఔటయ్యారు.
ఈ దశలోనే వారు మూడువందల స్కోరును కూడా దాటారు. చివరకు మూడువందల మూడు పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించారు.
పస లేని భారత బౌలింగ్::
నెహ్రా తప్ప మరో భారత బౌలర్ ఎవ్వరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. హర్బజన్ సింగ్ తనకు అనుకులంగా ఉన్న పిచ్ మీద ఒత్తిడిలో ఉన్న ప్రత్యర్ధిని స్ధిరపడనిచ్చాడు. మిగిలిన వారు కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు.

భారత ఇన్నింగ్స్ మూగిసిన వేంటనే మిగిలిన మ్యాచ్ విశేషాలు రాస్తాను.
Comments
Post a Comment