అక్కినేని వంశం నుంచి నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా జోష్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరి ఆశక్తిని చూరగొన్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడుల మనవడు, నాగార్జున తనయుడు, వెంకటేష్ మేనల్లుడు ఇలా చాలా పెద్ద కుటుంబ ఇమేజ్ ఉన్న హీరో మొదటి సినిమా అందులోనూ రెండేళ్లు నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ని సినీప్రియుల్ని ఊరించిన ఈ సినిమా అనుకున్నంత ఆశించినంత జోష్ ని ప్రదర్శించలేకపోయింది. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత నిర్మించిన ఈ చిత్రంలో రాజు గారి దగ్గర చాలాకాలం నుంచీ పనిచేస్తున్న వాసువర్మని దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమాతో. అతనిలో ఉన్న కఫ్యూజన్ సినిమా అంతా కనబడింది.
సినిమాని హీరో కుటుంబ ఇమేజ్ కి తగినట్టు రూపోందించాలా లేక తన సినిమాగా గుర్తింపు తెచ్చుకోవాలా అనే విషయంలో అతను చాలా తికమక పడ్డాడు. హీరో పాత్ర చిత్రణలో ఇది స్పష్టంగా కనబడుతుంది. సహజంగా యక్టివ్ గా ఉండే వ్యక్తి అందులోనూ యంగ్ కాలేజ్ అబ్బాయి మరి అంత నిరసపడిపోయినట్టు చూపించటం అతని క్యారెక్టర్ కి కరెక్ట్ గా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రకంగా సినిమా మొదటినుంచి చివరివరకూ మరోరకంగా ఉండటం మార్పుని సూచించినా మొదటి నలభై నిముషాల్లో మరీ ఎడుపుమోహం పెట్టడం రూచించలేదు. అండర్ ప్లే చేయటం చాలా కష్టం, కొంచెం బెడిసికొట్టినా ఎడుపుమోహం అయిపోతుంది. అది మొదటి సినిమాలోనే ప్రదర్శించాలని చైతన్య తాపత్రయం మెచ్చతగ్గదే కానీ ఇంకాస్త అనుభవం వచ్చాక చేసి ఉంటే ఇంకా బాగుండేది.
స్క్రిన్ ప్లే రాసుకోవడంలో కూడా దర్శకుడు తడబడ్డాడు. కధకి న్యాయం చేయ్యాలో లేక హీరోకి న్యాయం చేయ్యాలో తెల్చుకోలేక దేనికీ న్యాయం చేయ్యలేకపోయాడు. "దిల్" రాజు సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా తరువాత వచ్చిన సినిమాలు చాలావరకు బొమ్మరిల్లు మూసలోనే సాగాయి. చివరిలో మెసెజ్ కచ్చితంగా ఇచ్చి తీరాలి అని అన్ని కధలు రాసుకుంటున్నారు అనిపిస్తుంది. జోష్ లో కూడా ఆ ప్రయత్నమే జరిగింది. కానీ కధలో భాగం అవ్వాల్సిన మెసెజ్ చుట్టూ కధని అల్లడంతొ తరువాత జరగబోయే సన్నివేశం ఎమిటొ ముందే ఊహించగలిగారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తరువాత వచ్చిన సన్నివేశాలు ఆహ్లాద పరిచినప్పటికీ ప్రేక్షకుల్లో ఆశక్తిని రగల్చలేకపోయాయి.
హీరోకి గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తొలి సన్నివేశం నుంచీ ఆశక్తిని రెకెత్తించి చివరికి చాలా సింపుల్ గా తెల్చేశాడు. అందులో చైతన్య చాలా బాగా చేసాడు. శివ చిత్రాన్ని ఇవాళ్టి తరానికి తగినట్టు చేబితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమా చేసినట్టు ఉన్నారు. సన్నివేశాల్లో నేటి తరం ఆలోచనలకు తగినట్టు రాసుకోవడంలో విఫలమైయ్యారు.
చైతన్య తనో విషయమున్న నటుడినని తోలి సినిమాతో నిరూపించుకున్నాడు. దాన్ని నిలబెట్టుకుని ఇంకా ఎదగాలి. చూడటానికి అంత అందంగా లేకున్నా కార్తిక మంచి నటి. బాగా చేసింది. సునీల్ కామెడి బాగుంది. బ్రహ్మానందం ఉన్నా లేనట్టే. జె.డి.చక్రవర్తి తన జీవితాన్ని మార్చిన అప్పటి జె.డి. పాత్ర ఇప్పుడు ఎంత ప్రమాదకారి అయ్యింది అనే ఉద్దేశ్యంతో రూపోదించిన పాత్రలో బాగా చేసాడు. కానీ అతన్ని పూర్తిగా వాడుకున్నట్టు కనిపించదు. మిగతావారు తమ పరిధి మేరకు బాగా చేసారు.
కధ-కధనం-మాటలు-దర్శకత్వం తన భుజాల మీద వేసుకున్న దర్శకుడు మాటల రచయితగా చాలా మంచి పనితనం ప్రదర్శించడు. మిగతా వాటిల్లో ఇంకా బాగా చేసే విలుంది. కానీ చేయ్యలేకపోయాడు. ఎడిటింగ్ ఇంకా బాగా చెయ్యాల్సింది. చాలా సన్నివేశాలు విసుగు తెప్పించాయి. సినిమాటొగ్రఫీ కూడా సమిర్ రెడ్డి స్ధాయి వ్యక్తి నుంచీ ఆశించినట్టు లేదు. బొమ్మరిల్లు మూసలోంచి దిల్ రాజు భయటికి వస్తే మంచిది.
ఇంకా మంచి సినిమా అయ్యేది. నాగచైతన్య కోసం ఒక్కసారి చూడొచ్చు.!!
Comments
Post a Comment