భారతీయ సాంకేతిక విజ్ఞానం వేగంగా అభివృధి చెందుతోంది అనడానికి మరో ఊదాహారణ.
చంద్రయాన్ తరువాత చేసిన ఈ ప్రయోగం సఫలం కావడం నిజంగా హర్షించదగ్గ విషయం.
పూర్తి భారతీయ విజ్ఞానం తో రూపోందిన PSLV రాకెట్ లాంచర్లు పదిహేనోసారి తమ పనితనన్నాని నిరూపించుకున్నాయి.
ఇస్రో సైంటిస్టులు అందరికీ అభినందనలు!!
ఈ ఓషన్ శాట్ ద్వారా సముద్ర అధ్యయనం(Marine Study) ఇంకా తెలిక కానుంది. గత ఓషన్ శాట్ తన పదేళ్ల పనికాలాన్ని ముగించుకొంది. ఈ ఐదేళ్ల రెండొవ శాటిలైట్ ముందు దాని కన్నా అధునికమైనది. ఉపయోగకరమైనది.
ఈ శాటిలైట్ ద్వారా సముద్రంలో చేపలు ఎక్కడ పుష్కలంగా దొరుకుతాయో, సముద్ర గర్భంలో ఎలాంటి అలజడలు ఏర్పడుతున్నాయో, రుతుపవనాల రాకపోకలు ఏలా ఉంటాయో, సముద్రంలో ఖనిజ సంపదలు ఏలా ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలుసుకోవచ్చు. రేపటి నుంచి దిని పని మొదలౌతుంది.
ఇవాళ 11:51am కి కౌంట్ డౌన్ మూగియడంతో PSLV రాకెట్ లాంచర్ గగనతలంలోకి నిప్పులు కక్కుకుంటూ ఓషన్ శాట్ ను తీసుకువెళ్లి సరిగ్గా పదిహేడు నిముషాలలో శాటిలైట్ కు నిర్దేశించబడిన కక్ష్య(orbit)లో విడిచిపెట్టింది.
మరో రెండు నెలల్లో GSLV ప్రయోగం చేయబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఆ ప్రయోగం విజయవంతమై, అదే స్పూర్తితో చంద్రయాన్-2 కూడా పూర్తి స్ధాయి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.
భారతీయ సాంకేతిక విజ్ఞానం ఇలాగే దినదిన ప్రవర్ధమానం కావాలని మనసుపూర్తిగా ఆకాంక్షిస్తున్నాను!!
Comments
Post a Comment