వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా
ముందు మాట::
జోధా-అక్బర్ తరువాత అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా ఇది. తప్పకుండా మంచి రోమాంటిక్ కామెడి సినిమా అవుతుంది అని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య విశేషం ప్రియాంకా చోప్రా పన్నెండు(12) పాత్రల్లో నటించడం. కమల్ హాసన్ రికార్డుని బ్రేక్ చేసేసింది. మరి ఆ పన్నెండు పాత్రల్లో కేవలం కనబడిందో లేక నటించిందో ఈ నెల 25 కి విడుదలయ్యే సినిమాని చూస్తే తెలిసిపోతుంది. అశుతోష్ రెహమాన్ ని విడిచి ఈ సినిమాతో సోహైల్ సేన్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేసారు. అతను పాటలు ఎలా ఇచ్చాడో చూద్దాం.........ఆ..అన్నట్టూ ఇందులో పదమూడు(13) పాటలున్నాయి. రాశికో పాట. ఇంకో ఎక్సట్రా.............
పల్ పల్ దిల్ జిస్కో డూండే.........(మేషం/Aries)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్
హీరో తనకు దగ్గ రాశి ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ పాడుతున్నట్టు సాగుతుంది. చాలా స్లో పాట. పాడిన పద్ధతి ఫర్వాలేదు అనిపించేలా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినాలపించే పాట కాదు. పాట మొదలులో వచ్చే బీట్ బాగుంటుంది.
జావో నా..............(కుంభం/Aquarius)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్, తరన్నుమ్ మల్లిక్
పాట మొత్తం వచ్చే గీటార్ బీట్స్ చాలా బాగున్నాయి. మంచి రోమాంటిక్ పాట. అఖ్తర్ గారి లిరిక్స్ అర్ధవంతంగా చాలా అందంగా ఉన్నాయి. పాడిన వారివురూ బాగా పాడారు. ఇంకోసారి వినాలపించే పాట.
ఆజా లేహరాతే..........(మిధునం/Gemini)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: షాన్, భవ్యా పండిట్
పాట ని వి,ఎమ్ ఛానల్లలో ప్రసారం చేస్తున్నారు. మొత్తం డాన్స్ కోసమే చేసిన పాట. అట్లాగే పాటలో డ్రమ్స్ దే ఆధిపత్యం. లిరిక్స్ పెద్దగా అవసరం లేదు ఈ పాటకి. చిత్రికరణలో కూడా బాగుంది. ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది పాట.
బిఖరీ బిఖరీ............(కర్కాటకం/Cancer)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్, మరియానే డి’క్రజ్
పాట స్లో గా మెలోడియస్ గా ఉంటుంది. బాధల్లో ఉన్న అమ్మయికి చేయుతనిస్తూ హీరో పాడే పాట. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. పాటలో కొత్తదనం తక్కువ. పాడిన పద్ధతి బాగుంది.
మానుంగా మానుంగా.......(తుల/Libra)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: అశుతోష్ గోవారికర్, పమేలా జైన్
అశుతోష్ పాటని బాగా పాడాడు. ఇందులోనూ కొత్తదనం లేదు. ఒక రోబోట్ లా నీ ముందు ఉంటానంటూ హీరో, హీరోయిన్ తో పాడే పాట. ఫర్వాలేదనిపించే పాట.
సౌ జనమ్..............(మీనం/Pisces)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: ఉదిత్ నారాయణ్, మధుశ్రీ, సోహైల్ సేన్
మళ్లీ మళ్లీ వినాలపించేలా ఉంది పాట. ఉదిత్ గారు పాడిన తీరు పాటకి వన్నె తెచ్చింది. ప్రేమలో ఉన్నవారికి బాగా నచ్చే పాట. లిరిక్స్ బాగున్నాయి.
ఆ లే చల్.......(వృశ్చికం/Scorpio)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: అశ్లేషా గోవారికర్, హర్మన్ బవేజా
ఇందులో హర్మన్ గోంతు అక్కడక్కడా కలుస్తుంది. ఒక అమ్మాయి గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నట్టు బాగా రాసారు లిరిక్స్. అంతకు మించి పెద్ద విశేషం లేదు పాటలో.
ప్యారీ ప్యారీ........(కన్య/Virgo)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: అలఖా యాగ్నిక్, సోహైల్ సేన్
ఎక్కడో విన్నట్టుగా ఉంటుంది పాట. కొత్తదనం లేదు. లిరిక్స్ క్యాచీ గా రాసారు. "ప్యారీ ప్యారీ........నయి నయి న్యారీ న్యారీ"...... అలా సాగుతాయి లిరిక్స్. ఒక్కసారి వినొచ్చు.
సూ ఛే...సూ ఛే...(వృషభం/Taurus)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్, బేలా షిండే
ఇందులోనూ కొత్తదనం లేదు. ఎక్కడొ విన్నట్టుగానే ఉంటుంది. లిరిక్స్ నీ గురించి చెప్పూ అని అమ్మాయి అంటే నేనేందుకు చెప్పాలీ అని అబ్బాయి అన్నట్టు రాసారు.
ఫర్వాలేదనిపించే పాట.
సలోని క్యా........(ధనున్సు/Sagittarius)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్, తరన్నుమ్ మల్లిక్
అమ్మాయి ముద్దు అంటే అబ్బాయి వద్దు అంటు సాగుతుంది పాట. ఫర్వాలేదనిపించే పాట. పాడిన వారు బాగా పాడారు.
ధడకన్ ధడకన్.........(సింహం/Leo)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్, తరన్నుమ్ మల్లిక్
చాలా రోటీన్ పాట. లిరిక్స్ బాగున్నాయి కానీ ఇంకా బాగా రాయగలరు అఖ్తర్ గారు. వింటున్నంత సేపు బానే ఉంటుంది.
కోయి జానే నా.........(మకరం/Capricorn)
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: రజబ్ అలీ భారతీ, బేలా షిండే
రజబ్ గారి గోంతు వల్ల పాటకి కొత్తదనం, నిండుదనం వచ్చాయి. ఆల్బమ్ మొత్తానికి మంచి పాట. ఎక్కువ సార్లు వినాలపించే పాట. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.
వాట్స్ యూవర్ రాశి? చ్చేహరా జో దేఖే.......(ఎక్సట్రా/Extra).
రాసిన వారు:: జావేద్ అఖ్తర్
పాడిన వారు:: సోహైల్ సేన్
అన్ని పాటల కలగూరగంప ఈ పాట. అలాగే ఈ పాటలో పన్నెండు మంది ప్రియాంకలు కనబడతారు నర్తిస్తారు. పాట మొదటి బీట్ ఎక్కడొ విన్నట్టుగా ఉంటుంది.
లిరిక్స్ కన్నా సంగీతానికే పెద్ద పీట వేసారు ఈ పాటలో.
చివరి మాట::
ఫర్వాలేదనిపించే పాటలు. కొన్ని పాటలు బాగున్నాయి. మరికొన్ని మరీ రోటీన్ గా ఉన్నాయి. రెండు పాటలు మినహా అన్ని పాటలూ సోహైల్ సేన్ పాడటం అతనికి మంచిది కానీ వినేవాళ్లకి మోనాటనీ కలిగిస్తుంది. కొన్ని పాటలకి అతను కన్నా ఇంకేవరైనా పాడుంటే బాగుండేది. వినదగ్గ పాటలు.
ఇక సినిమా చూడదగ్గ దవుతుందో లేక ఇందులో పన్నెండు అవతారాలు తప్ప విషయం ఏమీ ఉండదో చూడాలి.
Priyanka is my favorite actress.I see many Priyanka's movies at http://10starmovies.com
ReplyDelete