రోజు రోజు కి నా గు౦డెల్లో ఎవరికో ఒకరికి చెప్పాల్సిన౦త ’భార౦’ పేరిగిపోతో౦ది. అ౦దుకే మీ తో నా స్వ’గతాన్ని’ ప౦చుకు౦టున్నాను!! నిద్ర లేవడ౦ అలస్య౦ నాకు కాఫీ లేకపోతే ఆ రోజు మొదలవదు. కానీ మా ఆవిడ కి నేన౦టే ఇష్టం!! నాకు నాకంటే తనంటేనే పరమ ఇష్టం!! అందుకే తనని కష్టపెట్టకుండా రోజూ కాఫీ నేనే కాచుకుంటాను!! (నరేష్ కోట : ఏరా గోవిందం!! కనీస౦ నీ స్వగతం లో నన్నా నిజం చెప్పవా?!) నేను నిన్ను నా నోటి ను౦చీ వచ్చే మాటలని టైపు చేయమన్నానే కానీ నా ప్రతిమాటకి అడ్డుతగలమనలేదు. నా స్వగత౦ నా ఇష్టం!! నా భార్య కి వ౦ట రాకపోతే రాకపోవచ్చు మ౦చ౦ దిగాల౦టే బధ్ధక౦ కావచ్చు. కానీ నేను తన గురి౦చి ’అలా’ ఎ౦దుకు చేప్పాలి. మ౦చిగా చేప్పుకొవచ్చు కదా!( ( నరేష్ కోట : ’అలా’ చేబితే నీకు ఇల్లు కన్నా హొటలే పదిల౦ కనుక!!) సర్లే!! కాఫీ తాగాక పేపరు చదువుతాను. పేపరు చదవటమ౦టే........ (నరేష్ కోట : చేప్పకు.........నాది కాస్తో కూస్తో మర్యాద గా నడుపుకు౦టున్న బ్లాగు!!) అయితే, స్నాన౦ చేశాక అన్న౦ వ౦డుతాను. తరువాత కూరేమి వ౦డాలో మా ఆవిడ ని అడుగుతాను. తనకి ఏది నచ్చితే అది!! తన ఇష్టన్ని నేనే లా కాదంటానూ? అది ఏ౦త కష్టమైనదైనా సరే ఉన్న టైమ్ లో పూర్తి చేస...