Skip to main content

Posts

Happy Republic Day!!

Manam 60th Republic Day chesukuntunam. Ayina manam inka venakabatu thanam mida vidipovalanukuntunnam......Adi mana pragathi.... DESIGNED BY NARESHKOTA........

కృష్ణా నది వరద ఉధృతి--దృశ్యాలు

  విజయవాడ కృష్ణలంక గ్రామం కరకట్ట వద్ద అక్టోబర్ రెండు నాటి వరద పరిస్ధితి!! ఆరు మెట్ల దూరంలో నీరు...!!

భారత్-పాకిస్తాన్ క్రికెట్ పోరు..........

దక్షిణ ఆఫ్రికా, సెంచూరియన్ మైదానంలో నేడు ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ తన తోలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడుతోంది. పదహారు నెలల తరువాత దాయాదులు, చిరకాల ప్రత్యర్ధులు అయిన ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ సంగ్రామమిది. క్రికెట్ ప్రియులకు విందు భోజనం లాంటి ఈ సమరం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.

విజయవంతమైన ఓషన్ శాట్-2 ప్రయోగం..!!

భారతీయ సాంకేతిక విజ్ఞానం వేగంగా అభివృధి చెందుతోంది అనడానికి మరో ఊదాహారణ. చంద్రయాన్ తరువాత చేసిన ఈ ప్రయోగం సఫలం కావడం నిజంగా హర్షించదగ్గ విషయం. పూర్తి భారతీయ విజ్ఞానం తో రూపోందిన PSLV రాకెట్ లాంచర్లు పదిహేనోసారి తమ పనితనన్నాని నిరూపించుకున్నాయి. ఇస్రో సైంటిస్టులు అందరికీ అభినందనలు!!

పదివేలు పూర్తి...కాల్పనిక లోకం లో........!!

కాల్పనిక లోకం ఒకప్పుడు........Nareshkota's world not so fictional!! ఈ రోజు తో నాలుగంకెల నుంచి ఐదు అంకెలకు చేరుకుంది. తోలిసారి నాలుగంకెలు వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. మళ్లీ ఐదంకెలప్పుడు అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. ఇది మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యం అయ్యింది. బ్లాగుని సందర్శించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు!! వెన్ను తట్టి ప్రోత్సాహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు!!                                                                                 ఇలాగే ఇంకా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ఆడియో రివ్యు..!!

వాట్స్ యూవర్ రాశి??? హింది సినిమా ముందు మాట:: జోధా-అక్బర్ తరువాత అశుతోష్ గోవారికర్ తీసిన సినిమా ఇది. తప్పకుండా మంచి రోమాంటిక్ కామెడి సినిమా అవుతుంది అని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఈ సినిమాలో ముఖ్య విశేషం ప్రియాంకా చోప్రా పన్నెండు(12) పాత్రల్లో నటించడం. కమల్ హాసన్ రికార్డుని బ్రేక్ చేసేసింది. మరి ఆ పన్నెండు పాత్రల్లో కేవలం కనబడిందో లేక నటించిందో ఈ నెల 25 కి విడుదలయ్యే సినిమాని చూస్తే తెలిసిపోతుంది. అశుతోష్ రెహమాన్ ని విడిచి ఈ సినిమాతో సోహైల్ సేన్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేసారు. అతను పాటలు ఎలా ఇచ్చాడో చూద్దాం.........ఆ..అన్నట్టూ ఇందులో పదమూడు(13) పాటలున్నాయి. రాశికో పాట. ఇంకో ఎక్సట్రా.............

గణేష్--జస్ట్ గణేష్ ఆడియో రివ్యూ........!!

గణేష్--జస్ట్ గణేష్ ముందు మాట:: ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రామ్ నటించిన కొత్త సినిమా గణేష్ పాటలు విడుదలయ్యాయి. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఎమ్.శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెఢీ తరువాత రామ్ తో స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రమిది. మిక్కి జె.మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...... తనేమందో............ . రాసిన వారు:: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన వారు:: జావేద్ అలీ పాట టైటానిక్ సంగీతం బీట్ తో మొదలౌతుంది. వింటున్నంత సేపు ఎక్కడో విన్నట్టుగానే ఉంటుంది. ఇంకా హ్యాపీ డేస్ మత్తు వదలలేదు మిక్కి గారికి. జావేద్ అలీ గొంతులో తెలుగు అంతగా కూనీ కాకపోవడం కాస్త హర్షించదగ్గ విషయం. పాటకి తగినట్టుగా ఉంది అతని గానం. శాస్త్రి గారు ఎప్పుడూ రాసే భావాలే.......కొత్తదనం లేని పాట. లలల్లలయ్.......... రాసిన వారు:: రామజోగయ్య శాస్త్రి పాడిన వారు:: కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్ పాట పూర్తిగా ’ఒకే ఒక్కడు’ సినిమాలోని ’ఉట్టి మీద కూడు’ తరహాలో నడుస్తుంది. దరువు పాట ఒక్కటైనా ఉండాలని చేసినట్టు ఉన్నారు. రామజోగయ్య గారి లిరిక్స్ పాటకి తగినట్టు గానే ఉన్నాయి. పాడిన...