అక్కినేని వంశం నుంచి నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా జోష్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరి ఆశక్తిని చూరగొన్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడుల మనవడు, నాగార్జున తనయుడు, వెంకటేష్ మేనల్లుడు ఇలా చాలా పెద్ద కుటుంబ ఇమేజ్ ఉన్న హీరో మొదటి సినిమా అందులోనూ రెండేళ్లు నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ని సినీప్రియుల్ని ఊరించిన ఈ సినిమా అనుకున్నంత ఆశించినంత జోష్ ని ప్రదర్శించలేకపోయింది. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత నిర్మించిన ఈ చిత్రంలో రాజు గారి దగ్గర చాలాకాలం నుంచీ పనిచేస్తున్న వాసువర్మని దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమాతో. అతనిలో ఉన్న కఫ్యూజన్ సినిమా అంతా కనబడింది. సినిమాని హీరో కుటుంబ ఇమేజ్ కి తగినట్టు రూపోందించాలా లేక తన సినిమాగా గుర్తింపు తెచ్చుకోవాలా అనే విషయంలో అతను చాలా తికమక పడ్డాడు. హీరో పాత్ర చిత్రణలో ఇది స్పష్టంగా కనబడుతుంది. సహజంగా యక్టివ్ గా ఉండే వ్యక్తి అందులోనూ యంగ్ కాలేజ్ అబ్బాయి మరి అంత నిరసపడిపోయినట్టు చూపించటం అతని క్యారెక్టర్ కి కరెక్ట్ గా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక రకంగా సినిమా మొదటినుంచి చివరివరకూ మరోరకంగా ఉండటం మార్పుని సూచి...