Skip to main content

Posts

Showing posts from August, 2009

వినదగ్గ కొత్త తెలుగు సినిమా పాటలు.....!!

కొత్త సినిమాల మీద రివ్యూల కన్నా ఇలా చేబితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే నేను విన్న కొత్త సినిమాల పాటల విశేషాలు ఇవి............ జోష్............  త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా పాటలు బాగున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కార్తిక, వాసువర్మ పరిచయం అవుతున్నారు. సందీప్ చౌతా చాలా జాగ్రత్తగా సంగీతం సమకూర్చాడు. పాటలు వినగ వినగా గుర్తుండే స్ధాయిలో నచ్చుతాయి. అన్నిట్లో చాలా బాగున్న పాటలు... డి..డిరిడి.. . పాటలో వైవిధ్యం ఆకట్టుకునేలా ఉంది. లిరిక్స్ ఫర్వాలేదు. కునాల్, సందీప్ గోంతుల్లో వైవిధ్యం మనని ఆకట్టుకుంటుంది. బాడ్ బాడ్ బాయ్... . ఇందులో ఈలగానం మనని ఆకట్టుకుంటుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. రంజిత్ బాగా పాడాడు. నీతో ఉంటే నిన్నే పెళ్ళాడతాలోని ఎటో వెళ్ళిపోయింది మనసు పాటని గుర్తుకుతెస్తున్నట్టు సాగుతుంది. సీతారామశాస్త్రి గారి లిరిక్స్ బాగున్నాయి. మంచి మెలోడి. కాలేజీ బుల్లోడా. . చంద్రబోస్ లిరిక్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అలాగే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. విఠల్ రాహుల్ బాగా పాడాడు. పాటలు అన్ని కధ అనుగుణంగానే ఉన్నాయి. లిరిక్స్ అర్ధవంతంగా ఉన్నాయి. సందీ...

ఆ క్షణం

పెళ్ళిచూపులప్పుడు, మన కొనచూపులు కలసిన................. ఆ తొలిక్షణం నువ్వు నాదానివైపోవాలనిపించిన........ఆ క్షణం అద్దం, నాలో నిన్నే చూపించి మురిపించిన.................ఆ క్షణం మదినది లో, పోంగే భావనలన్నీ అక్షరరూపంలో పోందుపర్చి నీకు చూపించిన....................ఆ క్షణం నిశ్చితార్ధం రోజు, ఉంగరాలు మారిన.................ఆ క్షణం నీ ముఖమంతా సిగ్గుపువ్వులు విరిసిన.........ఆ క్షణం నీ మెడలో తాళి కట్టిన.............ఆ క్షణం నీ చేతిని నా చేతిలో పెట్టిన...... ఆ క్షణం ఇక ఒకరికొకరం అనుకున్న.....ఆ క్షణం నాతో జీవితం గడపాలని నువ్వు ఇల్లు దాటిన............ఆ క్షణం తల్లిదండ్రులను వదలలేక నీ కంటిముత్యాలు రాలిన.......ఆ క్షణం నీతో నేను అబద్ధమాడిన............ఆ క్షణం నీ బుంగమూతి కోరికలన్నీ నేను తీర్చిన.........ఆ క్షణం నన్ను పూర్తిగా నీ వాడిని చేసుకున్న.............ఆ క్...

సినిమాలోకం::సినిమాలు - నవరసాలు!! (రెండోవ భాగం)

మొదటి భాగం ౪ . అద్భుత రసం :: ఆశ్చర్యచకితుల్ని చేయడం!! అద్భుత రసం అంటే కేవలం ఒక మాయాజాలం ప్రదర్శించటం కాదు!! ఒక పి.సి.సర్కార్ షో లాగా నిజమా? మాయా? అనిపించే విధంగా ఉండనవసరం లేదు.. జనం లో అద్భుతమనే భావనని మిగల్చగలిగితే చాలు. ప్రకృతిని అందంగా కెమెరా లో బంధించటం దగ్గర నుంచీ మనసుని తాకే గ్రాఫిక్ వరకూ అంతా అద్భుతమే!! మన సినిమాల్లో ముందు నుంచీ ఈ రసాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు....ఒక్క సినిమాలో అని కాదు అన్ని సినిమాల్లోనూ అంతే.........కధనంలో రావల్సిన అన్ని మలుపులూ అయిపోయి ఇక చివరి ఘట్టం మొదలౌతుంది. విలన్ ఎవరూ ఛేదించలేనంత ప్యూహాన్ని పన్నుతాడు......హీరో రెండు మైళ్ల దూరం నుంచీ పరిగెత్తుకు వచ్చి సమయం మించనివ్వకుండా ఛేదిస్తాడు ........ డూపుల సహాయంతో ...ఈ మధ్య వైర్ల సహాయంతో....!! మనకి అద్భుతమైన సినిమాని చూసాం అనే నిజమైన ఆనందాన్ని, తృప్తిని మిగిల్చేవి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు. మాయాబజార్ లో అంతా మాయే ..... కృష్ణ మాయ, పింగళి కలం మాయ, కె.వి.రెడ్డి దర్శకత్వ మాయ, మార్కస్ బారట్లే కెమెరా మాయ, అన్నింటికీ మించి నటీనటుల మాయ, ఘటోత్కచ మాయ అబ్బ...అంతా వివాహ భోజనమ్మే కదండి!! పాతాళభైరవి లో నేపాళమాంత్రికుడో అద్భ...

నన్ను క్షమించు కన్నా.....!!

లోకం నేర్పాల్సిన తండ్రిని నిన్ను చీకట్లో పెంచాను విధి నన్ను తయారుచేస్తే నేను నిన్ను తయారుచేయాలనుకున్నాను యాభై ఏళ్లకు నేను ఇంతవాడినైతే నువ్వు ఇరవైయ్యేళ్లకే నా అంతవాడివి కావాలనుకున్నాను !! నువ్వు నన్ను ప్రతి విషయంలో మించాలనుకున్నాను అందరు నన్ను నీ తండ్రీ అని గౌరవిస్తూంటే పోంగిపోదామనుకున్నాను కానీ ఇవాళ ఇంత జరిగాక నా తప్పు తేలుసుకున్నాను !! అవును!! విధితో నిన్ను ఆడనివ్వాలి, ఓడనివ్వాలి, పోరాడనివ్వాలి, గెలవనివ్వాలి, ఎదగనివ్వాలి!! అన్నీ నా కళ్లల్లోంచే చూడనివ్వాల్సింది కాదు!! అంతా నువ్వు ఎరిగినట్టే ఉంటుందని మభ్యపెట్టాల్సింది కాదు!! తప్పే..........నువ్వంటూ ఒకడివి ఎదగాలనీ నీకంటూ ఒక మనస్తత్వం ఉండాలనీ నీదంటూ ఒక పంధా ఎర్పర్చుకోవాలనీ నేర్పలేదు.............నాది నిజంగా తప్పే!! నా కఠినత్వం తప్పే నా స్వార్ధం తప్పే నా అమాయకత్వం తప్పే నీ ఆనందాన్ని హరించడం తప్పే ఆకాశహార్మ్యంలా ఎదిగిన నిన్ను చూడాలనుకున్నాను... కానీ.....ఇలా గోడ మీద చిన్న బొమ్మలా చూస్తూన్నాను!! నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాగా....... నీ రంపపుకోతని అర్ధం చేసుకున్నాగ...

వినాయక ప్రసాదంబు.....

వినాయక ప్రసాదంబు....... కుడుమే శ్రేష్ఠంబు.. చవితి నాటి విందు........ఓహ్హొహ్హొ..మనకే పసందు!!

గోవిందం స్వ’గతం’:: ఇదే ఆఖరు

అవును...!! ఇదే ఆఖరుసారి నేను ఈ కాల్పనిక లోకానికి రావడం.....ఈ న....నరేష్ కోట బ్లాగు కి ఇక రాను!! బాబూ నరేషు ఇక నీ తలపులకూ, కల్పనలకూ గుడ్ బై, ఇంక సేలవు...!! నువ్వు నా క్యారెక్టర్ ని నడుపుతున్న తీరుకి నా మీద నాకే ఆసహ్యం వేస్తోంది. నేను కట్నం తీసుకున్నానా? అందుకు శిక్షగా నా భార్య నన్ను చులకనగా చూస్తుందా?? ఏ కాలం లో ఉన్నావ్ బాబూ?? సరే.....అది పక్కన పేడదాం.......నాకు వచ్చేవి పాస్ మార్కులా? నేను.. గోవిందం ది గ్రేట్ ని పది.....రెండుసార్లు, ఇంటర్.....నాలుగుసార్లు, డిగ్రీ.......ఐదో ఏడాది చదివానా? నాకు చదువబ్బడం లేదని మా పెద్దలు పేళ్లి చేసేసారా? ఆఖరికి నా భార్య కూడా నా అంతే చదువుతుందా? ఇట్లాగే ఉరుకుంటే మా పిల్లలు మా కంటే వెధవలు అనేలా ఉన్నావే...! అసలు నీకో క్యారెక్టర్ క్రియేట్ చేయ్యడం వచ్చా? గోవిందం...ది సంఘసంస్కర్త, గోవిందం....ది రాజకీయ నాయకుడు, గోవిందం.....ది సైనికుడు..లాంటి వేవీ దొరకలేదా? పోనీ గోవిందం...ది సాఫ్టవేర్ ఇంజినీర్ అనన్నా అందాం అనిపించలేదా? నరేష్ కోట :: ఏందుకు అనాలి?? నువ్వు నేను సృష్టించిన పాత్రవి. నా ఇష్టం నాకు తోచినట్టు రాస్తాను. నువ్వేరివి అడగడానికి? నీ పాత్రని, నేను నాకు నచ...

సినిమాలోకం:: సినిమాలు - నవరసాలు!!

మన కళలల్లో రాసప్రాధాన్యత అమోఘం!! చూసేవారిలో రసానుభూతిని కలిగించడమే ముఖ్యం!! అసలు రసమంటే ఇంగ్లీషు లో expression!! తెలుగు లో భావోద్వేగ స్పందన!! ఒక దృశ్యాన్నో, సంఘటన్నో, చూసినవేంటనే మనలో కలిగే భావోద్వేగ స్పందన!! మన చుట్టూ జరుగుతున్నవిషయాలు, మనమున్న పరిస్ధితులే ఈ స్పందనకు కారణం!! సినిమాల్లో నటులు తాము స్పందిస్తూ, చూసేవారిలో స్పందన తీసుకురావాలి!! క్లుప్తంగా "రసపోషణే నటన"!! కేవలం రసపోషణ జరిగితే చాలా?? చాలదు!! సినిమాలు చూసే జనం కోసమే కదా!! మరి ఏదో నటుడు నటించేస్తే సరిపోతుందా?!! సరిపోదు!! ఆ నటుడు ఏం చేసాడో జనానికి ఎక్కాలి, అతను చేసిందానికి తనకు తేలీకుండానే స్పందించాలి!! అది యిల రూపంలో కావచ్చు లేదా తనలో తనే ఆనందించోచ్చు, బాధపడోచ్చు!! ఏమైనా కధలో లీనమైపోవాలి, నటుడుని ఇష్టపడాలి, తిట్టుకోవాలి, అతడు పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకోవాలి!! అదే రసానుభూతి!! అందుకే నవరసాలు!! అభినయం కలగలిసిన కళ నాట్యం.. నాట్యంలోంచి వచ్చినవే నవరసాలు!! ఎన్ని ముద్రలు ఉన్నా ముఖంతో అబినయించేటప్పుడు నవరసాల్ని పోషించటం అవసరం!! అదే నటనగా నాటకాల్లోకి ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించాయి!! ఇక ఆ తొమ్మిది రసాలు ఏమిటీ?? మన ...

సినిమాలోకం:: సినిమా అంటే.....మూడొ(ఆఖరి) భాగం!!

[రెండొవ భాగం] సినిమా అంటే కళాత్మక వ్యాపారం :: ఎదైనా వ్యాపారం అవ్వాలంటే అది జనానికి అవసరమో లేక జనామోదమో పోంది ఉండాలి!! కళకి వ్యాపారానికి సంబంధం ఒక్కపటిది అని చెప్పలేనిది!! కళ ఎంత జనామోదం పోందితే అంత వ్యాపారమైంది!! అసలు వ్యాపారం కానివేవైనా మన జీవితాల్లో ఉన్నాయా.......సబ్బులు దగ్గర నుంచీ తిండి దాకా అంతా వ్యాపారమే కదా..(ప్రేమ తప్ప....అవి కూడా ఒక్కోసారి) ఆ బాటలోనే విద్య, కళ రెండూ వ్యాపారాలైయ్యాయి!! చిన్న పిట్ట కధ ::( సంబంధం ఉన్నదే ....) ఒక గుంపు...(ఏ కాలం నాటిదని అడగకండి.......మీ ఊహా.) ......నడుచుకుంటూ వెళుతున్నారు!! వారు ఎంతసేపటి నుంచీ నడుస్తున్నారో చెప్పలేను కానీ బాగా అలసిపోయి ఉన్నారు!! చెట్టు చూసుకుని కునుకు తీసారు!! నిద్ర తీరాక వారందరికీ ఆకలి మొదలైయింది! మంచివాడోకడు వేట పట్టుకొచ్చాడు!! వాడు తెచ్చిందాన్ని అందరూ పంచుకోవాలనుకున్నారు!! అంతా తనే తినలేడు కనుక అతనూ ఒప్పుకున్నాడు!! ఒక్కొక్కరూ ఒక్కొ పనికి పునుకున్నారు!! ఒకడు వంటచెరకు తెచ్చాడు!! ఇంకొకడు వంటచేసాడు!! మరోకడు అందరికీ సమానంగా పంచటం అదే వడ్డించాడు!! ఒకడు ఆకులు కుట్టాడు!! అందరిలోకీ బలంగా ఉన్నవాడు మరే గోడవ రాకుండా అలాగే బయట...

సినిమాలోకం:: సినిమా అంటే.....(రెండొవ భాగం)

" ప్రత్యేకంగా రచన చేసి , పాత్రాధారులతో నటింపజేసి , చిత్రికరించబడేదే సినిమా / చలనచిత్రం " [మొదటి భాగం] పాట ముఖ్యమా ?? సినిమా కొంతమందికి జీవనాధారం!! మరికొంతమందికి వినొద సాధనం!! ఇవాళ మన సమాజం లో సినిమాకు ఉన్న ఆరాధనను చూసి చాలామంది నటులు కావాలనీ, రచయితలు కావాలనీ, దర్శకులు కావాలనీ తిరుగుతున్నారు!! ఎంతోమంది మిగిలిన అత్యవసరపనులు చేస్తూ గడుపుతున్నారు!! ఇదేమీ ఇవాళ కొత్తగా ఉన్న పరిణామం కాదు!! ఏనాటి సమాజానికి ఆనాటి అత్యుత్తమ వినొదసాధనం లో భాగం కావాలనీ, దాన్ని జీవనాధారం చేసుకోవాలనీ చాలామంది ప్రయత్నించారు!! ప్రయత్నిస్తూనే ఉన్నారు!! మన సమాజంలో వినొదానికి ముఖ్యం పాట!! ఒక పాట మనిషిని కదిలిస్తుంది, మదిని మెలుకోల్పుతుంది............విన్నవారితో విహరించి ప్రాచుర్యం పోందుతుంది!! ఏటువంటి మనిషైయినా పాట వింటాడు!! ఎదో ఒకరకం గా అనుభవిస్తాడు!! అనుభవంలోంచి అభినయం పుట్టింది!! అభినయం పాటలోని మాటకనుగుణంగా మారి భావంతో నాట్యం అయ్యింది!! నాట్యం నుంచీ నటన, అందులోంచి అనుకరణ అన్నీ మొదలయ్యాయి!! కాబట్టి పాటలేకుండా మనం మన ప్రసిధ్ధ కళారుపాల్ని ఉహించుకోలేము!! విదేశంలో నాటకం ఎలా పుట్టిందో కానీ మనదగ్గర మాత్రం పాటల...

62 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు!!

62 వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు!! నాకు తెలిసిన ఫోటోషాప్ లో డిజైన్ చేసిన బొమ్మ ఇది!!

గోవిందం స్వ’గతం’:: చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం (రెండొవ భాగం)!!

మొదటి భాగం స్కూలు రోజుల్లో అంతా భారీతనమే!! అసలు ఆ గ్రౌండ్ అది తెలుచుకుంటుంటే ఒళ్ళు గగురుపోడుస్తుంది!! అప్పటి తో పోల్చుకుంటే కనీసం స్విమింగ్ పూలు అంత కూడా ఉండనీ కాలేజిల్లో ఇంటర్, డిగ్రీ చదివాను!! ఆ గ్రౌండ్ లో సిక్స్ కొట్టాలంటే కష్టమైపోయేది!! సచిన్, ధోని లకి ఈజి నేమో!! గ్రౌండ్ మధ్యలో జెండా ఎగురుతుంటే ఒక కార్నర్ లో కూర్చుని చూడటమే అద్భుతంగా ఉంటుంది!! ఆ తరువాత డాన్స్ కాంపిటిషన్స్, పరుగు పందెలు, మంచి స్కిట్స్, గెలిచిన వాళ్ళకి ప్రైజులు!! అబ్బ... ఆ రోజులు.... ఆ రోజులే మళ్ళీ రావు.....రాలేవు!! రాంబాబు సార్.... గుర్తున్నాడా.....మన డ్రాయింగ్ సార్.....ఎప్పుడూ స్కిట్స్ వేస్తుండే వాడూ..... అప్పుడు నువ్వు నాలుగొవ తరగతి అనుకుంటా నేను పది చదువుతున్నా లే..!! (నరేష్ కోట:: ఆయన నా పదొవ తరగతికి కూడా అక్కడే ఉన్నారు!!) ఆ..!! ఆయన సి.ఐ.డి. అనే స్కిట్ లో నన్ను హీరో గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ బ్రిజ్ గోపాల్ గాడి వల్ల నాకు అనుకున్నది వాడి కోడుక్కి పోయింది. వెధవకి నేనంటే ఎప్పుడూ కోపమే!! అందరికీ అడగ్గానే ఒక్కమార్కైనా పెంచేవాడు!! కానీ నాకు మాత్రం ఒక మార్కు తగ్గిస్తాననేవాడు!! అసలే పాస్ మార్కులు కన్నా ఎక్కువ వచ్చేవి...

గోవిందం స్వ’గతం’:: చిన్ననాటి స్వాతంత్రదినొత్సవం!!

మీ వదిన పుట్టింటికి వెళ్లింది ఇవాళ మన రాజ్యం!! మనకీ స్వాతంత్రదినొత్సవమే!! మా సోసైటీ వాళ్ళు జెండావందనంకి రమ్మన్నారు!! ఏన్నాళ్లకి మళ్ళీ జెండావందనం చూస్తున్నాను అని నిముషం భావొద్వేగానికి లోనయ్యాను!! చిన్ననాటి సంగతులన్నీ ఒక్కసారి అలా అలా గుర్తుకొచ్చాయి!! ఆ పిల్లలు చాక్లెట్లు పంచుకుంటుంటే స్కూల్లో మాస్టార్లు పంచిన చాక్లెట్లు వడ్డించిన బెత్తం చాక్లెట్లు అన్ని గుర్తుకొచ్చాయి........గుర్తుకొస్తున్నాయి......గుర్తుకొచ్చేసాయి...... మన కాలేజిలో జెండావందనం చేస్తాం రండి రా బాబు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళబుధ్ధికాలేదు!! వెళితే అంతదూరం వాడేగరేస్తున్న జెండాని చూడటానికి వెళ్లాలి!! మళ్ళీ చిన్నపిల్లలకి పెట్టినట్టు అర్ధరూపాయి చాక్లెట్లూ వాడూనూ...!! నిజంగా గతజన్మలో బకాసురుడి తమ్ముడి మనవడి కోడుకయ్యూంటాడు!! అంతా వాడే తినే మిగతావాళ్ళకి...........అందులో వాడికి ఇంతింత ఫీజులు కడుతున్న మనకి మాత్రం విదిలిస్తాడు!! ల్యాబు లైనా అంతే.......స్పోర్ట్స్ అయినా అంతే........ అన్యూవల్ డే...... అఖరికి జెండావందనం కూడా అంతే..!! లెక్చరర్లకి జీతాలు ఇవ్వటానికి కూడా గీచి గీచి చూసుకునే రకం అని విన్నా...... నిజమే అయ్యుంటది!! నాకు ఎదురుకు...

అంతరంగ తరంగాలు

స్వాతంత్రదినొత్సవం సందర్భంగా నా అంతరంగం లో మెదిలిన కొన్ని ....... స్వేచ్ఛ , మనసుకు ఉత్తేజం !! ప్రకృతి ధర్మం !! ప్రగతికి మార్గం !! స్వేచ్ఛ , లేకుంటే అది దాస్యం !! ప్లీజ్ క్లిక్ read more!! స్వేచ్ఛ అంటే భాధ్యత!! స్వేచ్ఛ అంటే భధ్రత!! స్వేచ్ఛ అంటే సామాజిక ఆవశ్యకత!! స్వేచ్ఛ అంటే దేశొన్నతికి తోడ్పడే దక్షత!! భూతకాలం లో బ్రతికేవారికి చేసినవాటి గురించి ఆలోచన భవిష్యత్తు లో బ్రతికేవారికి చేయబొయేవాటి గురించి ఆలోచన వర్తమానం లో బ్రతుకుతున్నవారికి చేస్తున్నవాటి గురించి ఆలోచన వెరసి ఏనాడు లేదు మనసుకి ఆలోచన నుండి స్వేచ్ఛ!! మనిషీ, నీ చుట్టూ గీసుకొకు వృత్తం!! స్వేచ్ఛావాయువు, పీల్చు ప్రతినిత్యం!! స్వాతంత్ర నమరయోధులారా , మీ, ధీక్షకు వందనం ...

సినిమాలోకం:: సినిమా అంటే........

ఇవాళ సినిమా మీద ఆశక్తి ఉన్నవారికీ ఆ రంగం లో స్ధిరపడాలనుకునేవారికీ కొదవ లేదు!! వారందరి లాగే నాకు కూడా సినిమా అంటే ప్రీతి, అచ్చతెలుగులో పిచ్చి!! ఈ రంగం మీద ఆకర్షణ ఆశక్తైయ్యాక అసలు సినిమా అంటే ఏమిటీ అనే సందేహం కలిగింది. ఆ సందేహనివృత్తి కోసం చేసిన ప్రయత్నాల్లో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి!! వాటినీ మీ ముందుంచుతున్నాను!! సినిమా అంటే " కదిలేబొమ్మల నాటకం " :: ఒక కధ కధనం తో, సంభాషణల తో, సెట్టింగుల తో, పాత్రధారుల తో సజీవం గా ఒక స్టేజి మీద ప్రదర్శింపబడితే అది "నాటకం"!! చూసేవారికి భావావేశం కలిగించటమే దిని ముఖ్య ఉద్దేశ్యం!! ఒక క్షణాన్ని ఫ్రేము లో బంధిస్తే అది ఫోటో. అచ్చతెలుగు లో బొమ్మ!! ఈ బొమ్మలన్నీ మన ముందు కదిలితే అది విడియో!! ఒక క్రమపధ్దతి లో విడియోలని పేర్చి, కధ ఆధారంగా కూర్చి చూపిస్తే అది సినిమా!! ముందు చెప్పుకున్నట్టు నాటకం లో కధ, కధనం, సంభాషణలు, పాటలు, పద్యాలు అన్నీ ఉంటాయి!! పాత్రధారుల స్ధాయి ని బట్టి రక్తికడతాయి!! దిని నే ఒక ప్రొజక్టర్ సహాయం తో తెర మీద చూపెడితే అదే సినిమా!! అందుకే సినిమా అంటే కదులేబొమ్మల నాటకం! ఇది మన పూర్వికుల నిర్వచనం!! సినిమాని కొత్తగా కన...

బ్లాగు పేరు మార్చుకున్నాను!!--ఇక "కాల్పనిక లోకం"

ఈ క్షణం వరకూ నా బ్లాగు పేరు "NARESHKOTA'S WORLD NOT SO FICTIONAL!!" కానీ ఇప్పటి నుంచీ "కాల్పనిక లోకం"!! అంటే బ్లాగును ఒక ప్రపంచం గా భావిస్తే నా బ్లాగు లో చోటుచేసుకునే వన్నీ నా రచనలే.... కొన్ని ఫోటో లు తప్ప!! రచనలు కల్పనలే కదా!! నిజ జీవితాన్ని ప్రతిబింబించినా అవి ఒక రచయిత (దృ)"కోణం" నుంచీ చదివేవే కనుక అవి అతని కల్పన లే అవుతాయి అనే ఉద్దేశ్యం తో ఈ పేరు పెట్టాను!! కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నా ఈ వేళ శరత్ గారి వల్లే ఆచరణ లో పెట్టాను!! కనుక శరత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు !!

నా బ్లాగు మీకు నచ్చిందా???

మీరు ప్రేక్షకులు ..... సారీ.......... చదువరులు................ మీకు నచ్చితేనే బ్లాగు కళ కళ లాడుతుంది. లేదంటే...........అంతే.......!! అందుకే మీ అభిప్రాయాలు సేకరించాలని ............ ఈ టపా!! ఇంత ప్రయాసేలనయ్యా నచ్చితే కమెంటు తాము కదా అంటే............. కమెంట్లు ఆయా పొస్టు లను బట్టీ ఉంటాయి కనుక మొత్తంగా నా బ్లాగు మీదనే మీ అభిప్రాయాన్ని సేకరించదలిచాను. మీకు నచ్చినవేవో నచ్చనివేవో నాకు తేలియజేయండి. ఇవి మీరు ఇంతకు చదివి ఉండటం చేత చేప్తున్నవైనా సరే.... ఇక మీదట చదివి చేప్పదలుచుకున్నా సరే..........ఏ విషయం నాకు తేలియజేయండి. మీ సమయాన్ని ఇందుకు వేచ్చించమంటున్న నా సాహసాన్ని మన్నించి.........నిక్కచి గా మీ అభిప్రాయాలను తేలియజేస్తారని ఆశిస్తూ..............................ఎదురుచూస్తుంటాను!! ఇవి నాకు తోచిన రెండు ముక్కలు--- " సేలవంటూ సాగించే ఒంటరి పయనం ఏ తీరం చేర్చునో చేసుకున్న ఖర్మం !!" ఇందు లో రీడ్ మోర్ కి పనిచెప్పలేదండి...

గోవిందం స్వ’గతం’:: కట్నమడిగినందుకూ..........!!

పెళ్ళి చేసుకుని శుభ్రం గా ఉండొచ్చు కదా!! ఊ.....!.... తిక్క....". ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా....." అన్నట్టు [ కట్నమడిగినందుకు ] నాకు తగిన శాస్తే జరిగింది. నిశ్చితార్ధం రోజు కట్నమడిగిన నన్ను మా మామగారు వాళ్లు నీకు పిల్లనివ్వటమే ఎక్కువ మళ్ళీ కట్నం కూడా నా అన్నట్టు చూశారు!! అమ్మానాన్నలు కూడా తిట్టారు. చెవి నచ్చచెప్ప చూశారు!! నేను విన్లా!! అందరి ముందూ గోడవ ఇష్టం లేక నా పేరు మీద ఒక ఎకరం, వాళ్ల అమ్మాయి పేరు మీద పదహేను ఎకరాలు రాసి ఇదే కట్నమనుకోమన్నారు!! అప్పుడు గర్వంగా తన వంక చూశాను.......... కళ్ళ ల్లో నీళ్ళు తీరుగుతున్నాయి తనకి..!! అప్పుడర్ధమయ్యింది నేనేంత తప్పు చేశానో.........ఇప్పుడు తెలిసోస్తోంది తను ఎంత బాధపడిందో!! ఆరు నెలలు బానే ఉంది.తరువాత మొదలైయ్యింది అసలు సిసలు పండుగ. నేను ఏది చేసినా తప్పే...ఎంత తెచ్చినా చాలదు!! పదివేలు ఫ్రీజ్జు తేస్తే..... పదిహేను వేలది కావాలి!! 29 ఇంచుల టి.వి. తేస్తే .... ప్లాస్మా కావాలి!! జిమ్ పెట్టుకోవడానికి ఫ్లాటు చాలటం లేదు డాబా కొనమంటుంది. ఇక నగల విషయం లో........... తన నక్లెసు లో కన్నా పక్కింటి ఆంటీ నక్లెసు లోనే డైమెండ్స్ ఎక్కు...

గోవిందం స్వ’గతం’:: నాకంటూ ఆ రోజు.....!!

ఆ రోజు............ఆ రోజు............ నా రోజు.!! తనని అప్పటి వరకూ ఎన్నిసార్లు చూసినా మామూలు గానే అనిపించింది. కానీ ఆ రోజు మాత్రం తను నా(కు) కంటికి దేవకన్య, శిల్పులకు అప్సరకాంత, కవులకు కావ్యకన్యక, విశ్వనాధుని కి కిన్నెరసాని, న౦డూరి వారికి ఎంకి, బాపు గారికి తన కుంచె గీసిన అందాల గీత.......అనిపించింది. ఇక నాకు తనే.....తనకు నేనే....తనూ నేనే.!! కాలేజ్ లో అందరికన్నా సినీయర్ ని అయ్యుండీ, పదో తరగతి రెండు సార్లు, ఇంటర్ మూడు సార్లు, డిగ్రీ ఐదో ఏడాది చదువుతున్నా ఒక్క అమ్మాయీ నా వంక చూడటం లేదని బాధపడ్డాను. ప్రతి ....ఊ......కి ఒక రోజు వస్తుంది అన్నట్టు నా రోజు కోసం ఎదురుచూశాను. ఇద్దరి తో స్నేహం పునాది మీద ప్రేమసౌధం నిర్మిదామనుకుంటే అది నన్ను వారికి అన్నని చేసి వారి ఇంటి.......ఆ!..ఆ!....నిర్మాత ని చేసింది. ( నరేష్ కోట:: మొత్తానికి ఇద్దరిని ప్రేమించబోయి వారికి పెళ్ళి చేశానాంటావ్!! భాష కన్నా భావం ముఖ్యం!!) అదేలే......రిధమిక్ గా చెప్తూ అలా అన్నా. మరీ ఉన్నది ఉన్నట్టు చేప్తే కిక్ ఎముంటుందీ..!! ఆ రోజు..... నా పెళ్ళిచూపులు. తను మా అపార్ట్ మెంట్స్ లోనే ఉంటుంది. ముందు చెప్పినట్టు చా...

తెలుగు సినిమా వైభవ౦:: పా౦డుర౦గ మహాత్మ్యం

" పా౦డుర౦గ నామ౦!! పరమ పుణ్య ధామ౦!!" భక్త తుకారా౦ చేత దివ్యస౦కీర్తనా గానాన్ని పలికి౦చిన ఆ "పు౦డరీక వరధు"డి చరిత ఆధార౦ గా నిర్మితమైన చిత్ర౦ పా౦డుర౦గ మహాత్మ్యం . కమలాకర కామేశ్వరరావు గారిని పూర్తి స్ధాయి లో దర్శకుడి గా నిలబెట్టిన చిత్ర౦.ఆయన మొదటి చిత్ర౦ "చ౦ద్రహార౦" అ౦తగా పోకపోయినా ఆ సినిమా హిరో ఎన్.టి.అర్. ని ఆయన పనితీరు ఆకట్టుకోవడ౦తో ఈ దృశ్యకావ్యాన్ని ఆవికర్షి0చే అవకాశం ఆయనకు దక్కింది. తన కు లభి0చిన అవకాశాన్ని తెలుగు సినిమాకు లాభించే విధంగా సద్వినియోగం చేసుకున్నారు. "పౌరాణిక బ్రహ్మ" అని కీర్తి నొ0దారు. కధ-కధనాల్లో ఎక్కడా నీరస౦ కమ్ముకోకు౦డా ప్రేక్షకుడి దృష్టిని ఏమత్రం మరలనివ్వకుండా రచన చేసిన సముద్రల జూనియర్ గారి తొలి పూర్తి స్ధాయి రచనా అంటే నమ్మలేం. తండ్రి నుంచి స్వతహాగా వచ్చిన టాలెంట్ అది. ఆయన ఈ సినిమా కోసం నిష్ఠ గా రచన చేసారని చాలామంది చెబుతారు. నిష్ఠ గా అంటే మరో ఆలోచన కూ రచన కూ తావు లేకుండా కేవలం ఈ సినిమా మీదే ఆయన కష్టపడ్డారట. ఒక మరాఠి కధ లో తెలుగుదన౦ ని౦పిన ఆయన ప్రజ్ఞ కు సాష్టాంగ నమస్కరాలు!! తల్లిద౦డ్రులను...

తెలుగు సినిమా వైభవ౦:: కన్యాశుల్క౦

మనిషి కి పుట్టినప్పటి నుంచి చనిపోయే౦త వరకూ డబ్బు రకరకాలుగా అవసరమే!! మన సమాజమైతే ఇద్దరు కలవటానికి అదే పెళ్ళి జరగటానికి కూడా డబ్బు అవసరమని తేల్చి౦ది. అప్పుడు కన్యాశుల్క౦ అ౦టే ఇప్పుడు వరకట్న౦ అ౦టో౦ది. రె౦టిలోనూ బాధ పడేది ఆడవారే.........!! కన్యాశుల్క౦ - కన్య ను నాకు ధారాధత్త౦ చేస్తున౦దుకు మీకు నేను చెల్లి౦చుకునే సు౦క౦!! వరకట్న౦ - కన్య ను నాకు ధారాపో సే౦దుకు నీవు చెల్లి౦చవలసిన సు౦క౦!! ప్రస్తుత౦ మన౦ కన్యాశుల్క౦ గురి౦చి మటలాడుకు౦దా౦ !! మన సమాజ౦ ఆడపిల్లల ని ఎప్పుడు "తల్లిద౦డ్రుల గు౦డెల మీద కు౦పట్లు"గానే భావి౦చి౦ది. అ౦దుకే బాల్యవివాహాల ను ప్రోత్సాహి౦చి౦ది. ఆ క్రమ౦లోనే మరో అడుగు ము౦దుకు వేసి కన్యాశుల్క౦ కనిపేట్టి౦ది. ఇది ముక్య౦గా ముసలి రె౦డో మూడో పెళ్ళి వరుడు పడుచు పిల్లల కోస౦ వారి తల్లిద౦డ్రులకు విధిగా ముట్ట చెప్పే సోమ్ము!! ఎవరు ఎక్కువ ఇస్తే వారిదే పిల్ల !! ఆమె ఇష్టానికి ఎలా౦టి హక్కూ లేదు!! చెడు పుట్టినచోటే మ౦చీ పుట్టి౦ది. రుగ్మత ఉన్నప్పుడే మ౦దు అవసరమవుతు౦ది. ఈ కన్యాశుల్క౦ రుగ్మతని పారద్రోలడానికి క౦కణ౦ కట్టుకున్న మహానుభావులలో ముఖ్యులు శ్రీ గురజాడ అప్పారావు!! ఆయన స...